Viral Video: అహ్మదాబాద్ విమాన ప్రమాదంలో మరో కొత్త విషయం వెలుగులోకి వచ్చింది. ఈ ఘటనలో దాదాపు 242 మంది మాడిమసయ్యారు. గుర్తు పట్టడానికి వ్యక్తుల ఆనవాళ్లు దొరకలేదు. దీంతో డీఎన్ఏ టెస్టు చేయాలని ప్రభుత్వం భావించింది. ఇదే క్రమంలో కొత్త విషయం బయటకు వచ్చింది. క్లూస్ టీమ్‌కు భగవద్గీత పుస్తకం చెక్కు చెదరకుండా కనిపించడం ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది.
అహ్మదాబాద్‌లో ఎయిరిండియా విమానం ఒళ్లు గగుర్పొడిచే ఘటన. దాని గురించి తలచుకుంటే భారీ ఎత్తున ఎగిసిపడిన మంటలు, విమానం ముక్కలు ఇవన్నీ గుర్తుకు వచ్చాయి. అందులో ప్రయాణించే ట్రావెలర్ల గురించి చెప్పనక్కర్లేదు. పోలికలు లేకుండా మాడి మసయ్యారు మృతులను గుర్తించేందుకు వారి కుటుంబసభ్యుల నుంచి డీఎన్ఏ శాంపిల్స్ తీసుకుంటున్నారు.
ఇలాంటి ఘటనలో భగవద్గీత చెక్కు చెదరకుండా ఉండడంతో ఆసక్తికరంగా మారింది. ఘటన ప్రాంతంలో మృతదేహాలను గుర్తించడం, తరలించడం వంటివి చేస్తున్నాయి సహాయక బృందాలు. రకరకాల వస్తువులు, నగలు వాటికి సంబంధించి ప్రతీది చెక్ చేస్తున్నాయి దర్యాప్తు బృందాలు. అయితే ఆ ప్రాంతంలో భగవద్గీత చెక్ చెదరకుండా కనిపించడంతో హాట్ టాపిక్ అయ్యింది.
పేజీలు ఎక్కడ చెక్ చెరదలేదు. అన్నీ కలర్‌ఫుల్‌గా ఉన్నాయి. చెప్పాలంటే కనీసం ఒక్క పేజీ కూడా డ్యామేజీ కాలేదు. విమానంలో ఓ ప్రయాణికుడి వద్ద భగవద్గీత ఉన్నట్లు చెబుతున్నారు. ఆ పుస్తకం ఏమాత్రం పాడవకుండా ఉండటం చూసి ఆశ్చర్యపోతున్నారు నెటిజన్లు. అంతా కృష్ణలీల అంటూ మాట్లాడుకోవడం కనిపించింది.
ALSO READ: భోజనం చేస్తుండగా పాము.. బెదిరిపోయిన కస్టమర్; చివరలో ట్విస్టు
పుస్తకాన్ని చూసిన వెంటనే క్లూ టీమ్ నోటి వెంట మాట రాలేదు. దానికి ఎలాంటి రక్షణ వలయం లేదు. అలాగని ప్రత్యేక బాక్సులలో లేదు.ఇది ఎలా సాధ్యమంటూ ఆశ్చర్యపోతున్నారు. ఈ పుస్తకానికి సంబంధించి అధికారికంగా ఎలాంటి సమాచారం లేదు. ఈ ఘటనలో భగవద్గీతను చూసి హిందువులు ఒకింత హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఈ అంశం సోషల్ మీడియాలో విపరీతంగా ట్రెండ్ అవుతోంది.
భగవద్గీత అనేది హిందువులకు అత్యంత పవిత్రమైనది. మానవ జీవిత సారాన్ని శ్రీకృష్ణుడు గీత ద్వారా చెప్పారని బలంగా నమ్ముతారు. అందుకే ఈ పుస్తకాన్ని చదివేందుకు ఇష్టపడతారు. న్యాయస్థానాలు సైతం భగవద్గీతపై ప్రమాణం చేసి విచారణ జరిపిస్తారు. అంత పవిత్రమైన భగవద్గీత, విమాన ప్రమాదంలో ఏమాత్రం కాలిపోకుండా చక్కగా ఉంది.
అహ్మదాబాద్ విమాన ప్రమాదం.. చెక్కు చెదరని భగవద్గీత!
ప్రయాణికులు గుర్తు పట్టలేనంతగా కాలిపోయినా.. ఒక్క పేజీ కూడా కాలిపోని గీతా గ్రంథం
భారీ ఎత్తున మంటలు చెలరేగినా భగవద్గీత చెక్కు చెదరకుండా ఉండడంపై సర్వత్రా ఆశ్చర్యం
సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియో#AirIndia #AirIndiaCrash… pic.twitter.com/Kkh9jcKpgZ
— BIG TV Breaking News (@bigtvtelugu) June 13, 2025