BigTV English

Dogs Cry : కుక్కలు రాత్రిపూట ఎందుకు ఏడుస్తాయి..?

Dogs Cry : కుక్కలు రాత్రిపూట ఎందుకు ఏడుస్తాయి..?

Dogs Cry : మనది ఆధ్యాత్మికత దేశం. ప్రతి విషయానికీ ఒక పట్టింపు, నమ్మకం ఉంటుంది. కుక్క ఏడ్చినా, పిల్లి ఎదురొచ్చినా అశుభంగానే భావిస్తుంటారు. అర్థరాత్రి సమయంలో కుక్కల ఏడుపులు మీరు తరచూగా వినే ఉంటారు. రాత్రిపూట కుక్కల చూట్టూ ఆత్మలు తిరుగుతూ ఉంటాయని చెబుతుంటారు. కుక్కులు అన్నీ ఒకచోటకు చేరి ఏడిస్తే గుండె దడ మొదలవుతుంది. వాటిని చెడగొట్టే ప్రయత్నం కూడా చేయరు. ఎందుకంటే కుక్కలు ఏడిస్తే ఎవరైనా చనిపోతారని చాలా మంది నమ్ముతుంటారు. కుక్కలు ఒక్కసారి ఏడుపు మొదలు పెట్టాయంటే.. అలానే ఏడుస్తుంటాయి. దీంతో భయంతో వణికిపోతారు. మన దేశంలోనే కాదు.. ఫాస్ట్‌కల్చర్ ఉన్న అమెరికాలోనూ ఇటువంటివి నమ్ముతున్నారు. మరి ఇది నిజమేనా? సైన్స్ దీని గురించి ఏం చెబుతుందో ఇప్పుడు చూద్దాం..!


కుక్క అరుపు జన్యుశాస్త్రానికి సంబంధించిన అంశమని పరిశోధకులు చెబుతున్నారు. కుక్కల DNA తోడేళ్లు, నక్క జాతులను పోలి ఉన్నాయని అంటున్నారు. దీని ప్రకారమే కుక్కలు అరుస్తాయట.

నక్కలు, వేటకుక్కలు రాత్రి వేట ముగిసిన తర్వాత తిరిగి ఒకేచోటకు చేరుతాయి. రాత్రి చీకటిగా ఉంటుంది. కాబట్టి అవి ఉన్న ప్రదేశాన్ని సహచరులకు తెలియజేయడానికి ఒకరకమైన శబ్ధాన్ని చేస్తాయి. మనతో పాటు జీవించే కుక్కలు కూడా ఇందు కోసమే చేస్తాయి.


కుక్కల గుంపులోకి ఏదైనా కొత్త కుక్క వస్తే అన్ని కుక్కలు కలిసి దానిపై దాడి చేస్తాయి. దీంతో ఆ కొత్త కుక్క తోక ముడుచుకుని పారిపోతుంది. దీని అర్థం ఈ ప్రాంతం వారి ప్రాంతంగా ఏర్పరుచుకోవడమే. వాటి ఉనికిని చాటుకునేందుకు రాత్రిళ్లు కుక్కలు ఒక రకమైన అరుపులతో మిగతా కుక్కలకు తెలియజేస్తాయి. ఈ భూభాగం తమదేనని సిగ్నల్స్ పంపుతాయి.

భూమిపై నివశించే ప్రతి జీవి భావోద్వేగాలను కలిగి ఉంటుంది. వాటికి కలిగే బాధ, కోపం, ఆందోళన, ఆవేదనను.. ఇలా బిగ్గరగా ఏడ్చి చూపిస్తాయని పరిశోధనలు చెబుతున్నాయి. బయట చలిగా ఉన్నా లేదా వర్షం కురుస్తున్నా.. వాతావరణంలో మార్పులు తట్టుకోలేక బాధను వ్యక్తపరుస్తూ పెద్దగా అరుస్తాయి.

పగటిపూట కుక్కకు గాయమైతే రాత్రికి దాని నొప్పి పెరుగుతుంది. దీంతో నొప్పి భరించలేక శోకం పెట్టి ఏడుస్తాయి. అలానే కుక్కలు బాగా ఆకలితో ఉన్నా ఏడుస్తాయి. ముఖ్యంగా చలికాలంలో కుక్కలకు తినడానికి ఏమీ దొరకదు. దీని కారణంగా అవి ఏడుపును ప్రారంభిస్తాయి. కుక్కలు ఏడిస్తే మనుషులు చనిపోతారనేదానికి ఎటువంటి శాస్త్రీయ ఆధారాలు లేవు.

కుక్కలు తమ తల్లికి దూరమైనప్పుడు లేదా పిల్లలు దూరమైనపప్పుడు కూడా ఏడుస్తాయి. అదే విధంగా వాటి గుంపు నుంచి దూరమైనప్పుడు, యజమాని వేరైనప్పుడు రాత్రిపూట ఏడవటం ప్రారంభిస్తాయి.

కుక్కలు విశ్వాసానికి ప్రతిరూపం. కుక్కలు మనలోని నెగిటివ్ ఎనర్జీని కూడా చూస్తాయని కిందరు అంటుంటారు. కొన్ని అధ్యయనాల ప్రకారం.. కుక్కల వయసు కూడా వాటి అరుపుకు కారణం కావచ్చు. వయసు పెరిగే కొద్ది వాటికి భయం పెరుగుతుంది. ఈ సమయంలో ఒంటరిగా ఉన్నప్పుడు కుక్కలు ఏడుస్తుంటాయి.

Tags

Related News

Skin Whitening Tips: ఛాలెంజ్, ఈ టిప్స్ పాటిస్తే.. 7 రోజుల్లోనే నిగనిగలాడే చర్మం

Steel Pans: స్టీల్ పాత్రల్లో.. వీటిని పొరపాటున కూడా వండకూడదు !

Oral Health: వర్షాకాలంలో తరచూ వచ్చే గొంతు నొప్పికి.. ఈ టిప్స్‌తో చెక్ !

Diabetic Patients: షుగర్ పేషెంట్లు ఎలాంటి ఫుడ్ తినాలో తెలుసా ?

Fennel Seeds: సోంపు తినడం వల్ల ఎన్ని లాభాలుంటాయో తెలిస్తే.. ఆశ్చర్యపోతారు !

Raksha Bandhan Wishes 2025: రాఖీ పండగ సందర్భంగా.. మీ తోబుట్టువులకు శుభాకాంక్షలు చెప్పండిలా !

Big Stories

×