BigTV English

PM Modi : 400 సీట్లు పక్కా.. వచ్చే టర్మ్‌లో మూడో ఆర్ధిక వ్యవస్థగా భారత్..

PM Modi : 400 సీట్లు పక్కా.. వచ్చే టర్మ్‌లో మూడో ఆర్ధిక వ్యవస్థగా భారత్..
PM Modi Speech in Lok Sabha

PM Modi Speech in Lok Sabha : బీజేపీ మూడో సారి అధికారంలోకి వస్తే భారత్ మూడో ఆర్ధిక వ్యవస్థగా ఎదుగుతుందని ధీమా వ్యక్తం చేశారు ప్రధాని నరేంద్ర మోదీ. మూడో సారి ఖచ్చితంగా అధికారంలోకి వస్తామని.. ఎన్డీయే కూటమికి 400 సీట్లు వస్తాయని అన్నారు. కేవలం భారతీయ జనతా పార్టీకే 370కి పైగా సీట్లు వస్తాయని స్పష్టం చేశారు. ఇక మూడో విడత పాలన వెయ్యేళ్ల పాటు గుర్తుంచుకునేలా ఉంటుందని అన్నారు. రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాల తీర్మానం సందర్భంగా ఆయన లోక్ సభలో మాట్లాడారు. విపక్షాలపై నిప్పులు చెరిగారు. విపక్షాలు చాలా కాలం విపక్ష పాత్ర పోషించడానికి సంకల్పం తీసుకున్నాయని, వారి కోరికను దేవుడు నెరవేరుస్తాడని భావిస్తున్నానని తెలిపారు. ఎన్ని సంవత్సరాలు అధికారంలో ఉన్నారో అన్ని ఏళ్లు విపక్షంలో ఉండాలని కోరుకుంటున్నట్లు పేర్కొన్నారు.


ఇండియా కూటమి అలైన్‌మెంట్ దెబ్బతిందని.. ఒకరిపై ఒకరికి విశ్వాసం లేదని ప్రధాని మోదీ ఎద్దేవా చేశారు. అలాంటి పార్టీలను దేశ ప్రజలు నమ్మరని తెలిపారు. కాంగ్రెస్ పార్టీ మైనారిటీల పేరిట రాజకీయాలు చేస్తుందని.. అలా ఎన్ని రోజులు చేస్తారని ప్రశ్నించారు. దేశానికి ఒక మంచి విపక్షం అవసరం ఉందని.. కాంగ్రెస్ పార్టీ ఆ పాత్రను పోషించడంలో ఫెయిల్ అయ్యిందన్నారు. వారసత్వ రాజకీయాలు వారి కొంప ముంచతాయని.. వారి వల్ల వేరే నాయకులు బాధితులయ్యారని ఖర్గే, ఆజాద్‌ను ఉద్దేశించి విమర్శించారు.

తాము అధికారంలోకి వచ్చాక 11వ స్థానంలో ఉన్న భారతదేశాన్ని 5వ స్థానానికి తీసుకొచ్చామని ప్రధాని మోదీ గుర్తుచేశారు. తాను మూడోసారి ప్రధాని అయ్యాక దేశం మూడో అతిపెద్ద ఆర్ధిక వ్వవస్ధగా ఎదుగుతుందని చెప్పారు. తాము సాధించిన అభివృద్ధిని సాధించాలంటే కాంగ్రెస్‌కు వందేళ్లు పడుతుందని అన్నారు. నెహ్రూ, ఇందిరా గాంధీలపై కూడా విమర్శలు గుప్పించారాయన.


Related News

New GST Rates: నేటి నుంచి భారీ ఉపశమనం.. GST 2.Oలో తగ్గిన వస్తువుల ధరల లిస్ట్ ఇదే!

PM Modi On GST 2.O: రేపటి నుంచి జీఎస్టీ ఉత్సవ్.. ప్రతి ఇంటిని స్వదేశీ చిహ్నంగా మార్చండి: ప్రధాని మోదీ

Deputy Cm: డిప్యుటీ సీఎం X అకౌంట్ హ్యాక్.. ఆ పోస్టులు ప్రత్యక్షం, ఇది పాకిస్తాన్ పనా?

Job Competition: 53,000 ప్యూన్ పోస్టులకు.. 25 లక్షల మంది పోటీ!

H-1B Visa: రద్దీగా ఎయిర్‌పోర్టులు .. అమెరికాకు ప్రవాసుల పయనం, పెరిగిన విమానాల టికెట్ల ధరలు

H-1B Visas: హెచ్-1బీ వీసాల ఫీజు పెంపు.. భారత టెక్ కంపెనీల పరిస్థితి ఏమిటి? ఆ సమస్య తప్పదా?

UPS Deadline: UPSలోకి మారాలనుకునే ప్రభుత్వ ఉద్యోగులకు సెప్టెంబర్-30 డెడ్ లైన్

India Vs Pakistan: ఇస్లామిక్ నాటో పైనే పాకిస్తాన్ ఆశలు.. భారత్‌కు ముప్పు తప్పదా?

Big Stories

×