E-Paper
Advertisement

మందుల బిళ్లలపై ఆ నిలువు గీత వెనుక ఇంత పెద్ద రహస్యముందా? ఈ నిజం 90% మందికి తెలియదు!

మందుల బిళ్లలపై ఆ నిలువు గీత వెనుక ఇంత పెద్ద రహస్యముందా? ఈ నిజం 90% మందికి తెలియదు!
Advertisement

Score Line on Tablet: మనం రోజువారీ జీవితంలో రకరకాల టాబ్లెట్లను చూస్తుంటాం. కొన్ని టాబ్లెట్ల మధ్యలో ఒక నిలువు గీత ఉంటుంది. చాలామంది ఇది కేవలం డిజైన్ కోసమే అనుకుంటారు. కానీ, ఆ చిన్న గీత వెనుక ఒక ముఖ్యమైన వైద్య కారణం ఉంది. రోగులకు సరైన మోతాదులో మందులు అందడానికి ఈ గీత ఎంతగానో సహాయపడుతుంది.

స్కోర్ లైన్ అంటే ఏమిటీ?

వైద్య పరిభాషలో టాబ్లెట్ మధ్యలో ఉండే ఈ గీతను Score Line లేదా Break Line అని పిలుస్తారు. దీనిని కంపెనీలు కావాలనే టాబ్లెట్లపై ఇస్తాయి. అవసరమైనప్పుడు ఈ టాబ్లెట్‌ను సరిగ్గా రెండు సమాన భాగాలుగా విరవడానికి ఈ గీత ఉపయోగపడుతుంది. దీనివల్ల మందు మారకపోయినా.. రోగికి అవసరమైన మోతాదును డాక్టర్లు సులభంగా మార్చగలరు.

డోసేజ్ సర్దుబాటు సులువవుతుంది:

Advertisement

కొన్నిసార్లు డాక్టర్లు పూర్తి టాబ్లెట్‌కు బదులుగా సగం టాబ్లెట్ వేసుకోమని చెబుతుంటారు. ఉదా: ఒక రోగికి 500 మిల్లీగ్రాముల టాబ్లెట్ మోతాదు ఎక్కువ అనుకుంటే.. దానిని 250 మిల్లీగ్రాములకు తగ్గించాల్సి వస్తుంది. అలాంటప్పుడు ఈ గీత ఉన్న టాబ్లెట్‌ను సులభంగా సగానికి విరిచి, కచ్చితమైన మోతాదులో మందును తీసుకోవచ్చు.

Also Read: వైన్ తాగితే ఏం కాదు అనుకుంటున్నారా? 10,000 స్కాన్స్ చూశాక వైద్యులు చెప్పిన ఆ చేదు నిజం తెలిస్తే..

మింగడం సులభం చేయడానికి:

Advertisement

వయసు పైబడిన వారికి, చిన్న పిల్లలకు పెద్ద టాబ్లెట్లను మింగడం చాలా కష్టంగా ఉంటుంది. అలాంటి సమయంలో టాబ్లెట్‌ను సగానికి విరిచి ఇవ్వడం వల్ల వారు సులభంగా, ఎలాంటి ఇబ్బంది లేకుండా మింగగలుగుతారు. రోగుల సౌకర్యాన్ని మనసులో ఉంచుకుని ఫార్మాస్యూటికల్ కంపెనీలు ఈ తరహా డిజైన్లను రూపొందిస్తాయి.

అన్ని టాబ్లెట్లను విరవకూడదు:

ఇక్కడ మనం ఒక ముఖ్యమైన విషయాన్ని గుర్తుంచుకోవాలి. గీత లేని టాబ్లెట్లను ఎప్పుడూ విరవకూడదు. కొన్ని మందులు శరీరంలోకి వెళ్లాక నెమ్మదిగా కరగడానికి వీలుగా ప్రత్యేకంగా తయారవుతాయి. అలాంటి వాటిని విరిచినా, పొడి చేసినా వాటి ప్రభావం తగ్గిపోతుంది. కాబట్టి.. సొంత నిర్ణయాలతో మందుల మోతాదును మార్చకుండా.. డాక్టర్ లేదా ఫార్మసిస్ట్ సలహా తీసుకోవడం ఎంతో మంచిది.

Also Read: ఫ్రిడ్జ్‌లో A4 సైజు పేపర్ పెడితే ఏమౌతుందో తెలుసా? కరెంట్ బిల్లు బాదుడుకు బ్రేక్ వేసే సింపుల్ ట్రిక్!

Related News

పచ్చి పాలు తాగడం వల్ల యువకుడికి గుండె సమస్య.. హెచ్చరిస్తున్న డాక్టర్లు

ప్రేమ అంటే రక్తంతో లవ్ లెటర్స్ రాయడం కాదు.. ఒక్కడే కొండను చీల్చిన ప్రేమికుడు

పిల్లల ప్రవర్తనలో ఈ 5 సంకేతాలు కనిపిస్తే తల్లిదండ్రులు తప్పు చేస్తున్నట్లే..

స్టేజ్‌పై మాట్లాడేటప్పుడు చేతులు, కాళ్లు వణుకుతున్నాయా? మీ కాన్ఫిడెన్స్ పెంచేందుకు ఈజీ టిప్స్

పనికి రాని పెయింటింగ్‌ను రూ.2,800కి కొన్నాడు.. కట్ చేస్తే కోటీశ్వరుడయ్యాడు, అదెలా?

58 ఏళ్ల నా భర్తతో పెళ్లికి 16 ఏళ్ల కన్నె పిల్ల కావాలి.. వింత కండిషన్లతో భార్య పత్రికా ప్రకటన

ఇంట్లో వరండా స్థలం చిన్నగా ఉందా? నో టెన్షన్ అందమైన మినీ గార్డెన్ పెంచడానికి ఈజీ టిప్స్

హార్ట్ పేషెంట్లు రాత్రి ఏ పొజిషన్‌లో పడుకోవాలి? సరైన నిద్ర భంగిమలు ఇవే

Big Stories

Advertisement
×