E-Paper
Advertisement

ఫ్రిడ్జ్‌లో A4 సైజు పేపర్ పెడితే ఏమౌతుందో తెలుసా? కరెంట్ బిల్లు బాదుడుకు బ్రేక్ వేసే సింపుల్ ట్రిక్!

ఫ్రిడ్జ్‌లో A4 సైజు పేపర్ పెడితే ఏమౌతుందో తెలుసా? కరెంట్ బిల్లు బాదుడుకు బ్రేక్ వేసే సింపుల్ ట్రిక్!
Advertisement

Fridge Door Seal Test: జులై నెల మొదలైనప్పటికీ.. రెండు తెలుగు రాష్ట్రాల్లో వేడి వాతావరణం ఇంకా తగ్గలేదు. వర్షపాతం తక్కువగా ఉండటం వలన ఇప్పటికీ వేడి గాలులు వీస్తున్నాయి. అయితే ఈ క్రమంలో ఇంట్లోని వస్తువులు కూడా ఒత్తిడికి గురవుతుంటాయి. ముఖ్యంగా రోజంతా నాన్‌స్టాప్‌గా తిరిగే ఫ్రిడ్జ్ మరింత ఎక్కువ పని చేయాల్సి వస్తుంది.

బయట వేడి ఎక్కువగా ఉండటం వల్ల ఫ్రిడ్జ్ లోపల చల్లదనాన్ని కాపాడుకోవడానికి కంప్రెషర్ విపరీతంగా కష్టపడుతుంది. దీంతో కరెంట్ బిల్లులు పెరగడమే కాకుండా.. ఫ్రిడ్జ్ త్వరగా పాడైపోయే ప్రమాదం ఉంది. అయితే.. ఫ్రిడ్జ్ సరిగ్గా పని చేస్తుందో లేదో తెలుసుకోవడానికి ఈ చిన్న టెస్ట్ చేసి చూడండి.

అసలేమిటీ పేపర్ ట్రిక్?

Advertisement

ఫ్రిడ్జ్ డోర్ సరిగ్గా లాక్ అవుతుందో లేదో తెలుసుకోవడానికి ఒక సాధారణ A4 సైజ్ పేపర్ తీసుకుని.. ఫ్రిడ్జ్ డోర్ తెరిచి ఆ పేపర్‌ను సగం లోపల, సగం బయట ఉండేలా ఉంచి డోర్ గట్టిగా వేయాలి. ఇప్పుడు ఆ పేపర్‌ను బయటకు లాగడానికి ప్రయత్నించాలి. పేపర్ గట్టిగా పట్టుకుని ఉండి, లాగడానికి కష్టంగా అనిపిస్తే ఫ్రిడ్జ్ డోర్ సీల్ (రబ్బర్) బాగుందని అర్థం. అలా కాకుండా పేపర్ చాలా సులువుగా బయటకు వచ్చేస్తే మాత్రం, ఆ డోర్ రబ్బర్ లూజ్ అయిపోయిందని గ్రహించాలి.

Also Read: పాత ఆండ్రాయిడ్ ఫోన్ ఉందా? ఈ 5 స్టెప్స్‌తో కార్ సెక్యూరిటీ కెమెరాగా మార్చేయండి!

చిన్న డ్యామేజ్.. పెద్ద నష్టం:

Advertisement

డోర్ రబ్బర్ లూజ్ అయితే ఏమవుతుందని చాలామంది లైట్ తీసుకుంటారు. కానీ దీనివల్ల లోపలి చల్లటి గాలి బయటకు పోయి, బయట ఉన్న వేడి గాలి లోపలికి చేరుతుంది. దీనివల్ల ఫ్రిడ్జ్ లోపల టెంపరేచర్ తగ్గిపోతుంది. ఆ చల్లదనాన్ని మళ్లీ అందుకోవడానికి కంప్రెషర్ రాత్రింబగళ్లు కష్టపడాల్సి వస్తుంది. ఫలితంగా కరెంట్ బిల్లు చుక్కలు చూపిస్తుంది. పైగా ఫ్రిడ్జ్‌లో పెట్టిన పాలు, కూరగాయలు కూడా త్వరగా పాడైపోతాయి. అమెరికా ఇంధన శాఖ కూడా ఈ చిన్న పేపర్ టెస్ట్ ద్వారా ఎంతో శక్తిని ఆదా చేయవచ్చని చెబుతోంది.

సమస్య ఉన్నప్పుడు ఏం చేయాలంటే?

పేపర్ టెస్ట్‌లో మీ ఫ్రిడ్జ్ డోర్ లూజ్‌గా ఉన్నట్లు తేలితే వెంటనే కంగారుపడి కొత్త ఫ్రిడ్జ్ కొనాల్సిన అవసరం లేదు. కొన్నిసార్లు రబ్బర్ పైన పేరుకుపోయిన జిడ్డు, మురికి వల్ల కూడా డోర్ సరిగ్గా పడదు. కాబట్టి.. కొద్దిగా వేడి నీళ్లు, డిష్‌వాష్ లిక్విడ్ ఉపయోగించి ఆ రబ్బరును శుభ్రంగా తుడవాలి. రబ్బర్ కొద్దిగా గట్టిపడినట్లు అనిపిస్తే, హెయిర్ డ్రైయర్ సాయంతో తక్కువ వేడి అందిస్తే అది మళ్లీ మెత్తబడి డోర్‌కు గట్టిగా అతుక్కుంటుంది. ఇవన్నీ చేసినా కాకపోతే, చాలా తక్కువ ఖర్చుతో కొత్త రబ్బర్ సీల్‌ను మార్పించుకోవచ్చు.

ఈ చిన్న అలవాటు ఎంతో మేలు:

మనం ఇళ్లలో అనవసరంగా లైట్లు ఆపడం, ఫోన్ ఛార్జర్లు పీకేయడం లాంటివి చేస్తుంటాం. వాటితో పాటు ప్రతి కొన్ని నెలలకొకసారి, ముఖ్యంగా ఎండకాలం స్టార్ట్ అయ్యే ముందు ఈ 30 సెకన్ల పేపర్ టెస్ట్ చేయడం అలవాటు చేసుకోండి. 15 ఏళ్ల కంటే పాతబడిన ఫ్రిడ్జ్‌లు అయితే సాధారణం కంటే 20% ఎక్కువ కరెంట్ వాడుకుంటాయి. కాబట్టి.. పాత ఫ్రిడ్జ్‌ను జాగ్రత్తగా చూసుకోవడానికి ఈ చిన్న ట్రిక్ ఎంతో హెల్ప్ అవుతుంది.

Also Read: లాంచ్ స్ట్రాటజీ మార్చిన Huawei.. కొత్త ఫోన్ల కోసం ఎదురుచూస్తున్న యూజర్లకు గుడ్ న్యూస్, కానీ..

Related News

రూ.50 వేలలోపు బెస్ట్ స్మార్ట్ టీవీలు..అమెజాన్,ఫ్లిప్‌కార్ట్ సేల్‌లో ఇవే బెస్ట్!

ప్రైమ్ డే సేల్ కంటే ముందే ఆఫర్లు.. ఈ 5 గాడ్జెట్స్‌పై అమెజాన్‌లో కళ్లు చెదిరే డిస్కౌంట్లు!

బ్లూటూత్ తరచూ డిస్‌కనెక్ట్ అవుతోందా?నిమిషాల్లో ఇలా సాల్వ్ చేసుకోండి!

10నిమిషాల ఛార్జింగ్‌తో..200 నిమిషాల ప్లేటైమ్ ఇయర్ బడ్స్

ఇంతకీ ఈ LTPO డిస్‌ప్లే కథేంటి? స్మార్ట్‌ఫోన్లలో ఇది ఉంటే బ్యాటరీ లైఫ్ డబుల్ అవుతుందా?

రూ.499కే బ్లూటూత్ స్పీకర్..పాకెట్ ఫ్రెండ్లీ ప్రైస్‌లో ట్రెండీ మోడల్

మార్కెట్‌లోకి కొత్త మోడల్.. రచ్చ చేస్తున్న ఈ టీవీ మోడల్ గురించి మీకు తెలుసా?

రూ.1648కే 3 వస్తువుల కాంబో..ఇలాంటి ఆఫర్ ఎప్పుడూ చూసుండరు

Big Stories

Advertisement
×