BigTV English

Hand Wrinkles: నీటిలో చేతులు పెడితే.. ఎందుకు ముడతలు పడతాయి? ఏంటా సీక్రెట్?

Hand Wrinkles: నీటిలో చేతులు పెడితే.. ఎందుకు ముడతలు పడతాయి? ఏంటా సీక్రెట్?

ఈతకొలనులో కాసేపు ఈత కొట్టాక మీ అరచేతులు చూసుకోండి. ముడతలు పడి కనిపిస్తాయి. అలాగే బట్టలు ఉతకడం వంటివి ఎక్కువసేపు చేసినప్పుడు కూడా అరచేతుల్లోని చర్మం పై ముడతలు పడడం గమనించే ఉంటారు. ఇది ప్రతి ఒక్కరికి జరిగేదే. కానీ అలా ఎందుకు అవుతున్నాయో ఎప్పుడైనా ఆలోచించారా?


కేవలం అరచేతులు, పాదాల కింద ఉన్న చర్మంలో మాత్రమే ఇలా నీటికి ఎక్కువ సేపు గురవడం వల్ల ముడతలు పడతాయి. కానీ తొడలు, ముఖము, మోచేతులు, మోకాళ్లు వంటి వాటిపై అలాంటి మార్పులు కనిపించవు. ఈ విషయంపై ఎన్నో శాస్త్రీయ అధ్యయనాలు జరిగాయి. అధ్యయనాల ప్రకారం నీటి శోషణ వల్ల మాత్రమే ఇలా జరగదు. నాడీ వ్యవస్థ ద్వారా నియంత్రించే ఒక శారీరక ప్రక్రియ వల్ల ఇలా జరుగుతుంది.

ఎందుకు ముడతలు పడతాయి?
సైన్స్ ప్రకారం మన వేళ్లు, అరచేతులు నీటిలో ఎక్కువసేపు ఉన్నప్పుడు చర్మంలోని స్వేద గ్రంధులు తెరుచుకుంటాయి. దీనివల్ల అక్కడ ఉన్న సోడియం సమతుల్యతలో మార్పులు వస్తాయి. రక్తనాళాలు కుచించుకు పోతాయి. లోపలి చర్మంలోని పొర పరిమాణం చాలా వరకు కుచించుకుపోతుంది. బయట పొరను లోపలికి లాగినట్టు చేస్తుంది. దానివల్లే ఈ ముడతలు ఏర్పడతాయి.


2020లో లండన్ సైన్స్ మ్యూజియంలో జరిగిన ఒక ప్రయోగంలో చర్మం అరచేతులపై ముడతలు పడిన తర్వాత వస్తువులను అవి మరింత సురక్షితంగా పట్టుకునేలా చేస్తాయని తెలిసింది. అంతేకాదు మరొక అధ్యయనంలో తడి ముడతలు పడిన చేతులతో నీటి అడుగున వస్తువులను 12 శాతం ఎక్కువ వేగంతో పట్టుకోవచ్చని.. ఒక చోట నుండి మరొక చోటకి మార్చవచ్చని తెలిసింది. దీనిబట్టి ముడతలు యాంత్రిక ప్రయోజనాలను కూడా అందిస్తాయని నిర్ధారణ అవుతుంది.

ఆ వ్యాధులు ఉంటే ఎక్కువ ముడతలు
అయితే ఒక వ్యక్తి ఆరోగ్యాన్ని బట్టి కూడా అతడి చేతిలో ముడతలు పడాలా వద్దా అన్నది ఆధారపడి ఉంటుంది. మధుమేహ రోగులు నీటిలో చేతులు పెట్టి ఎక్కువసేపు ఉంచినా కూడా అంతగా ముడతలు పడకపోవచ్చు. అయితే సిస్టిక్ ఫైబ్రోసిస్ వంటి సమస్యలు ఉన్న వారిలో మాత్రం ముడతలు ఎక్కువగా పడతాయి. అలా గుండె సమస్యలతో బాధపడే వారికి ఈ ముడతలు పడడం తక్కువగా ఉంటుంది. అలాగే పార్కిన్సన్స్ వ్యాధితో బాధపడే వారికి మాత్రం చేతివేళ్లు సాధారణంగా కాకుండా చూడడానికి వింతగా ముడతలు పడుతూ ఉంటాయి. దీనికి కారణం వారి నాడీ వ్యవస్థ సరిగా పనిచేయకపోవడమే.

ఆడవారిలోనే ఎక్కువ
మరొక అధ్యయనంలో ఒక వెరైటీ విషయం బయటపడింది. పురుషులతో పోలిస్తే స్త్రీల అరచేతులు నీటిలో ఉంచినప్పుడు నెమ్మదిగా ముడతలు పడతాయి. ఇది లైంగిక హార్మోన్ల కారణంగా జరుగుతుందని అంచనా వేస్తున్నారు. అయితే దీనికి పూర్తి కారణాన్ని ఇంకా వివరించలేకపోయారు.

తడిగా ఉన్నప్పుడే ఈ ముడతలు ఉంటాయి. కాసేపటికి వేడి తగిలాక చర్మం సాధారణ స్థితికి వచ్చేస్తుంది. ఇలా చర్మం ముడతలు పడడం వల్ల మనకి జరిగే హాని ఏమీ లేదు. కాబట్టి మడతలు పడిన చర్మాన్ని చూసి కంగారు పడాల్సిన అవసరం లేదు.

Related News

Raksha Bandhan Wishes 2025: రాఖీ పండగ సందర్భంగా.. మీ తోబుట్టువులకు శుభాకాంక్షలు చెప్పండిలా !

Tan Removal Tips: ముఖం నల్లగా మారిందా ? ఇలా చేస్తే.. క్షణాల్లోనే గ్లోయింగ్ స్కిన్

Cinnamon water: ఖాళీ కడుపుతో దాల్చిన చెక్క నీరు తాగితే.. మతిపోయే లాభాలు !

Junk Food: పిజ్జా, బర్గర్‌లు తెగ తినేస్తున్నారా ? జాగ్రత్త !

Health Tips: ఒమేగా- 3 ఫ్యాటీ యాసిడ్స్‌తో చర్మం, జుట్టుకు బోలెడు లాభాలు !

Broccoli Benefits: బ్రోకలీ తింటున్నారా ? అయితే ఈ విషయాలు తెలుసుకోండి

Big Stories

×