Women Scheme: కేంద్రప్రభుత్వం అనేక పథకాల ద్వారా మహిళలను ప్రోత్సాహిస్తోంది. వ్యాపార రంగంలో వారి భాగస్వామ్యాన్ని పెంపొందించేందుకు ప్రత్యేక పథకాలు ఉన్నాయి. మహిళల కోసం ప్రత్యేకంగా తీసుకొచ్చిన పథకమే ‘స్టాండ్ అప్ ఇండియా’-STAND UP INDIA SCHEME. ఈ పథకం ఉద్దేశం ఏంటి? విధివిధానాలపై ఓ లుక్కేద్దాం.
మోదీ సర్కార్ 2016లో స్టాండ్ అప్ ఇండియా పథకాన్ని ప్రారంభించింది. దీనివల్ల మహిళలు, షెడ్యూల్డ్ కులాలు-SC, షెడ్యూల్డ్ తెగలు-ST లకు చెందినవారు సొంతంగా వ్యాపారం పెట్టుకునేందుకు ప్రభుత్వం నుంచి అవసరమైన ఆర్థిక మద్దతు పొందవచ్చు. తొలిసారి వ్యాపారాన్ని ప్రారంభించేవారికి ఇదొక వరమన్నమాట.
గ్రీన్ ఫీల్డ్ ప్రాజెక్టులకు బ్యాంకులు తక్కువ వడ్డీకే రుణం ఇవ్వనున్నారు. మహిళలు, ఎస్సీ, ఎస్టీ వర్గాల వ్యక్తులు ఉద్యోగాల కోసం ఎదురుచూడాల్సిన పని లేదు. సొంతంగా వ్యాపారంలోకి అడుగు పెట్టడం దీని ఉద్దేశం. తమతో పాటు కొంతమందికి ఉపాధి కల్పించే దిశగా మారొచ్చు. ఈ పథకం ద్వారా మహిళలు తక్కువ వడ్డీకే భారీగా రుణాలు పొందవచ్చు.
గ్రీన్ ఫీల్డ్ ప్రాజెక్టుల కోసం 10 లక్షల నుంచి కోటి రూపాయల వరకు రుణాన్ని పొందవచ్చు. ఈ పథకం కింద మూడు విభాగాల్లో వ్యాపారం చేసేవారికి రుణం లభించనుంది. మ్యానుఫ్యాక్చరింగ్, సర్వీసెస్, వ్యవసాయ అనుబంధ కార్యకలాపాలు లేదంటే ట్రేడింగ్. పక్కన చెప్పిన వ్యాపారాలు కొత్తగా ప్రారంభించాలి. దీన్ని గ్రీన్ పీల్డ్ ప్రాజెక్టు కింద ఉండాలి.
ALSO READ: గ్యాస్ సిలిండర్ ధర తగ్గిందోచ్..
ఈ పథకం కోసం దరఖాస్తు చేయాలనుకునేవారికి అర్హతలు ఉండాలి. తొలుత భారతీయ మహిళ కావాలి. ఎస్సీ, ఎస్టీ మహిళతోపాటు గ్రీన్ ఫీల్డ్ ప్రాజెక్టు ఉండాలి. తొలిసారి ప్రారంభించబోయే వ్యాపారం కచ్చితంగా ఉండాల్సిందే. మరో నిబంధన ఏంటంటే గతంలో మిగతా బ్యాంక్ రుణాల్లో డిఫాల్టర్‌గా ఉండకూడదు. వ్యక్తిగతం లేదంటే ఓ సంస్థ పేరిట రుణం తీసుకోవచ్చు.
దరఖాస్తు చేసే సమయంలో ఆయా సంస్థలో ఎస్సీ, ఎస్టీ మహిళకు కనీసం 51 శాతం వాటా ఉండాలి. దీనికితోడు 18 సంవత్సరాలకు పైన ఉండాల్సిందే. టర్మ్ లోన్, వర్కింగ్ క్యాపిటల్ రూపంలో రుణం లభించనుంది. అవసరాన్ని బట్టి రెండింటిలో ఏదైనా లేదా రెండింటిని సదరు బ్యాంక్ నుంచి పొందవచ్చు. రుణంపై వడ్డీ రేటు సాధారణ రుణాల కంటే తక్కువగా ఉండనుంది.
రుణాన్ని తిరిగి చెల్లించేందుకు ఏడేళ్లు గరిష్ఠ కాల పరిమితి. ఏడాదిన్నర వరకు మారిటోరియం పీరియడ్ ఉంటుంది. స్టాండ్ అప్ ఇండియా పథకానికి ఆన్‌లైన్‌లో ఈ విధంగా దరఖాస్తు చేసుకోవచ్చు. దీనికి సంబంధించి అధికారిక వెబ్‌సైట్ https://www.standupmitra.in ఓపెన్ చేయగానే రిజిస్టర్ అనే బటన్‌పై క్లిక్ చేయండి.
మీ పేరు, ఫోన్ నెంబర్, ఆధార్ నెంబర్ వంటి వివరాలు నమోదు చేయాలి. ఆ తర్వాత వ్యాపార ప్రాజెక్టు వివరాలు అప్‌లోడ్ చేయాలి. అందులోనే ప్రాజెక్టు రిపోర్ట్, బిజినెస్ ప్లాన్ ప్రస్తావించాలి. బ్యాంకు ఎంపిక చేసి అప్లికేషన్‌ను సబ్మిట్ చేస్తే సరిపోతుంది. మీరు చేసిన దరఖాస్తు సమీప బ్యాంక్ శాఖకు వెళ్తుంది. అధికారుల సమీక్ష తర్వాత అప్పుడు రుణం మంజూరు అవుతుంది.
ఈ పథకం ఇప్పటి వరకు లక్షల మంది మహిళలు లబ్ధి పొందారు. దీనివల్ల మహిళల ఆర్థిక స్వావలంబన పెరిగింది. గ్రామీణ ప్రాంతాల్లో స్వయం ఉపాధికి ప్రధాన వనరుగా మారింది. మీరు మీ వ్యాపార కలలను సాకారం చేసుకోవాలనుకుంటే వెంటనే ఈ పథకానికి అప్లై చేసుకోండి.