BigTV English

Mental Health: ఆ వ్యాధి ఉన్న వారిలో చెవిలో రకరకాల గుసగుసలు ఎందుకు వినిపిస్తాయి?

Mental Health: ఆ వ్యాధి ఉన్న వారిలో చెవిలో రకరకాల గుసగుసలు ఎందుకు వినిపిస్తాయి?
Mental Health: ప్రమాదకరమైన మానసిక వ్యాధులు ఎన్నో ఉన్నాయి. వాటిలో ఒకటి స్కిజోఫ్రెనియా ఈ వ్యాధితో బాధపడుతున్న వ్యక్తులు ఎంతో ఇబ్బందులు పడతారు. వారికి చెవుల్లో ఎప్పుడూ ఎవరో ఒకరు ఏదో మాట్లాడుతున్నట్టు వినిపిస్తుంది. గుసగుసలు వినిపిస్తూ ఉంటాయి. కానీ ఎవరు మాట్లాడారో అర్థం కాదు. కొన్నిసార్లు తమను తిడుతున్నట్టు కూడా వినిపిస్తూ ఉంటాయి. దీనివల్ల వారు చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు. ఇలా ఎందుకు వినిపిస్తుందో తెలుసుకోవడం కోసం ఒక అధ్యయనం జరిగింది. చైనా, న్యూయార్క్ కు చెందిన శాస్త్రవేత్తలు కలిసి ఈ అధ్యయనాన్ని నిర్వహించారు కనిపెట్టారు.
కొత్త అధ్యయనం ప్రకారం ఏదో మాటలు వినిపిస్తున్నట్టు అనిపిస్తున్నవన్నీ పూర్తిగా వారి ఊహాత్మకమైనవి అని, కేవలం భ్రాంతులని తెలుస్తోంది. మెదడు, ఇంద్రియ వ్యవస్థల మధ్య పరస్పర చర్యలతో కూడిన జీవ ప్రక్రియల వలన ఇలాంటి భ్రాంతులు వస్తాయని అధ్యయనం చెబుతుంది. ఇంద్రియాలు ఇచ్చిన సమాచారాన్ని ప్లాన్ చేయడానికి, అంచనా వేయడానికి మెదడు సామర్థ్యం సరిపోయినప్పుడు మెదడు బలహీనంగా మారినప్పుడు ఇలాంటి లక్షణాలు కనిపించే అవకాశం ఉందని అధ్యయనం చెబుతోంది.
అధ్యయనం ఇలా చేశారు
స్కిజోఫ్రెనియా వ్యాధితో బాధపడుతున్న అందరి రోగుల్లో ఇలాంటి భ్రాంతులు వినిపించే అవకాశం లేదు. కొంతమందికి వినిపిస్తాయి, మరి కొంతమందికి వినిపించకపోవచ్చు. ఇలా చెవులలో శబ్ద భ్రాంతులు వినిపించే వారిని ఒక కేటగిరీలో, వినిపించని వారిని మరో కేటగిరీలో తీసుకున్నారు. వారి మెదడు పనితీరులో అంతర్లీన విధానాలను గమనించారు. వారు మాట్లాడుతున్నప్పుడు కొన్ని రకాల శబ్దాలను ప్లే చేశారు. ఆ సమయంలో మెదడులోని విద్యుత్ కార్యకలాపాలు ఎలా ఉన్నాయో కూడా కొలిచారు.
చివరగా అధ్యయన ఫలితాలను నివేదించారు. ఆరోగ్యకరమైన వ్యక్తుల్లో మెదడు… చుట్టూ వినిపించే శబ్దాలను అణిచివేసి తాము మాట్లాడడానికి మనిషిని పర్ఫెక్ట్ గా సిద్ధం చేస్తుంది. స్కిజోఫ్రెనియా రోగుల్లో పరిస్థితి అలా ఉండదు. బయట శబ్దాలు భ్రాంతుల్లో వినిపిస్తున్న వాటిని అణిచివేసే యంత్రాంగం బలహీనంగా ఉంటుంది. దీని వల్ల వారు నిజంగానే తమకి ఏవో వినిపిస్తున్నాయని అనుకుంటారు. వాస్తవంగా లేని స్వరాలను కూడా వారు వింటూ ఉంటారు. స్కిజోఫ్రెనియాతో బాధపడుతున్న వ్యక్తులు కచ్చితంగా చికిత్సను తీసుకోవాలి. లేకుంటే ఆ సమస్య మరింతగా పెరిగిపోతుంది. వారు ప్రశాంతంగా కూర్చోలేని విధంగా చెవుల్లో మాటలు శబ్దాలు వినిపిస్తూ ఉంటాయి.
స్క్రిజోఫ్రెనియాలతో బాధపడుతున్న కొంతమంది రోగులు తీవ్రంగా ప్రతిస్పందించి అవకాశాలు కూడా ఎక్కువగా ఉంటాయి. కాబట్టి ఇలా చెవుల్లో మీకు తెలియకుండానే, చుట్టూ ఎవరు మాట్లాడకుండానే ఏవో శబ్దాలు, మాటలు వినిపిస్తుంటే మీరు వెంటనే వైద్యులను సంప్రదించి తగిన పరీక్షలు చికిత్స తీసుకోవలసిన అవసరం ఉంది.


Related News

Cinnamon water: ఖాళీ కడుపుతో దాల్చిన చెక్క నీరు తాగితే.. మతిపోయే లాభాలు !

Junk Food: పిజ్జా, బర్గర్‌లు తెగ తినేస్తున్నారా ? జాగ్రత్త !

Health Tips: ఒమేగా- 3 ఫ్యాటీ యాసిడ్స్‌తో చర్మం, జుట్టుకు బోలెడు లాభాలు !

Broccoli Benefits: బ్రోకలీ తింటున్నారా ? అయితే ఈ విషయాలు తెలుసుకోండి

Weight Loss: ఈ యోగాసనాలతో.. 10 రోజుల్లోనే వెయిట్ లాస్

Sugar: చక్కెర తినడం 30 రోజులు ఆపేస్తే.. ఏం జరుగుతుందో తెలుసా ?

Big Stories

×