BigTV English

OTT Movie: మనిషి బాడీ కోసం వెతికితే కోతి శవం, ఊహ‌ల‌కు అంద‌ని ట్విస్ట్‌ల‌తో ఆడియెన్స్‌ సీట్ ఎడ్జ్ లో కూర్చోబెట్టే మిస్టరీ థ్రిల్లర్..

OTT Movie: మనిషి బాడీ కోసం వెతికితే కోతి శవం, ఊహ‌ల‌కు అంద‌ని ట్విస్ట్‌ల‌తో ఆడియెన్స్‌ సీట్ ఎడ్జ్ లో కూర్చోబెట్టే మిస్టరీ థ్రిల్లర్..

Kishkindha Kaandam Movie: ఈ ఏడాది మలయాళంలో విడుదలై అత్యధిక వసూళ్లు సాధించిన టాప్ సినిమాల్లో ఒకటి ‘కిష్కింద కాండం’ ఒకటి.  దిన్జీత్ అయ్య‌థ‌న్ ద‌ర్శ‌క‌త్వం వహించిన ఈ మిస్ట‌రీ థ్రిల్ల‌ర్‌ మూవీలో ఆసిఫ్ అలీ, అప‌ర్ణ బాల‌ముర‌ళి ప్రధాన పాత్రలు పోషించారు. ఎలాంటి అంచనాలు లేకుండా సెప్టెంబర్ 12న చిన్న మూవీగా విడుదలై బాక్సాఫీస్ దగ్గర పెద్ద విజయాన్ని అందుకుంది. రూ. 5 కోట్లతో తెరకెక్కిన ఈ మూవీ.. ప్రేక్షకుల అనూహ్య ఆదరణతో ఏకంగా రూ. 50 కోట్లు వసూళు చేసింది.


‘కిష్కింద కాండం’ సినిమా కథ ఏంటంటే?   

అప‌ర్ణ‌(అప‌ర్ణ బాల‌ముర‌ళి), అజ‌య‌న్(ఆసిఫ్ అలీ) ప్రేమించి పెళ్లిచేసుకుంటారు. అజ‌య్ తండ్రి అప్పు పిళ్లై ఓ రిటైర్డ్ ఆర్మీ అధికారి. ఉద్యోగం తర్వాత ఆయన ఇంట్లోనే ఉంటారు. తన కారణంగా ఎవరికీ ఎలాంటి ఇబ్బంది కలుగకూడదని ఇంట్లో నుంచి బయటకు రారు. మతి మరుపు కారణం ఆయన ఏ విషయాన్ని మర్చిపోకుండా రోజూ పుస్తకంలో నోట్ చేసుకుంటారు. ఆయన కొడుకు అజయన్ ఫారెస్ట్ అధికారిగా పని చేస్తుంటాడు. ఆయనకు ఇంతకు ముందే పెళ్లవుతుంది. ఆయన భార్య క్యాన్సర్ తో చనిపోతుంది. కొడుకు చాచు కనిపించకుండా పోతాడు. ఆ బాధలో నుంచి బయటపడి, అపర్ణ అనే అమ్మాయిని ప్రేమించి పెళ్లి చేసుకుంటాడు. పెళ్లైన తర్వాత కూడా ఇద్దరూ ఆ అబ్బాయికి కోసం వెతుకుతూనే ఉంటాడు. అదే సమయంలో అజయన్ తండ్రి అప్పు గన్ మిస్ అవుతుంది. ఇంతకీ ఆ గన్ ఎలా మిస్ అయ్యింది? ఆ గన్ కారణంగా ఎన్ని ప్రాణాలు పోయాయి? అసలు అప్పు పిళ్లై గతం ఏంటి? అజయన్ కొడుకు ఏమైపోయాడు? పోలీసులు అబ్బాయి శవం కోసం వెతికితే కోతి శవం ఎందుకు బయటపడింది? ఇంతకీ చనిపోయిన చాచు శవాన్ని మాయం చేసింది ఎవరు? అజయ్ రెండో భార్య అపర్ణకు తెలిసిన విషయాలు ఏంటి? అనేవి ఈ సినిమాలో చాలా థ్రిల్లింగ్ గా చూపించారు.


‘కిష్కింద కాండం’ మూవీపై విమర్శకుల ప్రశంసలు

ఇన్వేస్టిగేష‌న్ మిస్ట‌రీ థ్రిల్ల‌ర్‌ గా తెర‌కెక్కిన ‘కిష్కింద కాండం’ మూవీ స్టోరీ ప్రేక్షకులకు ఓ రేంజిలో థ్రిల్ కలిగిస్తుంది. ఊహ‌ల‌కు అంద‌ని ట్విస్టులు ఆడియెన్స్‌ ను సీట్ ఎడ్జ్ లో కూర్చొబెడతాయి. ఈ మూవీలో ఆసిఫ్ అలీతో పాటు అప‌ర్ణ బాల‌ముర‌ళి నటనకు విమర్శకుల నుంచి సైతం ప్రశంసలు దక్కాయి.

డిస్నీ ప్ల‌స్ హాట్ స్టార్‌ లో స్ట్రీమింగ్

‘కిష్కింద కాండం’ సినిమా డిజిట‌ల్ రైట్స్‌ ను ప్రముఖ ఓటీటీ సంస్థ డిస్నీ ప్ల‌స్ హాట్ స్టార్ సొంతం చేసుకున్న‌ది. అక్టోబ‌ర్ 11నుంచి ఈ మూవీ ఓటీటీలో స్ట్రీమింగ్ అయ్యే అవకాశం ఉంది. తెలుగుతో పాటు త‌మిళం, మ‌ల‌యాళం, కన్నడ భాషల్లో ప్రేక్షకుల ముందుకురానుంది. మిస్ట్రరీ థ్రిల్లర్స్ ను ఇష్టపడే వారికి ఈ సినిమా చాలా బాగా నచ్చుతుంది. థియేటర్లలో చూడని ప్రేక్షకులు ఓటీటీలో చూసేయండి.

Read Also: పక్కింటి బాగోతాలను బైనాక్యులర్ తో చూస్తే… మిస్ అవ్వకుండా చూడాల్సిన మసాలా థ్రిల్లర్

Related News

Kotthapallilo Okappudu OTT: ఓటీటీ విడుదలకు సిద్ధమైన  కొత్తపల్లిలో ఒకప్పుడు… స్ట్రీమింగ్ ఎప్పుడంటే?

Conistable Kanakam: యాక్షన్ థ్రిల్లర్ గా కానిస్టేబుల్ కనకం… అంచనాలు పెంచిన ట్రైలర్!

OTT Movie : హీరోయిన్‌తో లవ్, స్టోరీలో మర్డర్ మిస్టరీతో ట్విస్ట్… చివరి 20 నిముషాలు డోంట్ మిస్

OTT Movie : అయ్య బాబోయ్… ఫ్యూచర్ ను చూడగలిగే సీరియల్ కిల్లర్… వీడిచ్చే మెంటల్ మాస్ ట్విస్టుకు బుర్ర పాడు

OTT Movie : అబ్బబ్బ అరాచకం అంటే ఇదేనేమో … ఒక్కడితో సరిపెట్టలేక ….

OTT Movie : పని మనిషితో రాసలీలలు… ఒకరి భార్యతో మరొకరు… అన్నీ అవే సీన్లు… లాస్ట్ ట్విస్ట్ హైలెట్ మావా

Big Stories

×