Dementia: డిమెన్షియా అనేది అనేక మానసిక ఆరోగ్య సమస్యల కారణంగా వస్తుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. దీని వల్ల ఆలోచన, నిర్ణయాలు తీసుకోవడం, భాష, దిశానిర్దేశం వంటి సామర్థ్యాలపై ప్రభావం పడే అవకాశం ఉందని అంటున్నారు. సాధారణంగా అయితే వృద్ధుల్లోనే దీని వల్ల ఈ సమస్య ఎక్కువగా వచ్చే అవకాశం ఉందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.
డిమెన్షియాతో ఇబ్బంది పడుతున్న వారిలో జ్ఞాపక లోపం, భాష సమస్యలు, వ్యక్తిత్వ మార్పులు, దిశానిర్దేశం లోపం వంటి లక్షణాలు కనిపిస్తాయని వైద్య నిపుణులు చెబుతున్నారు. దీని వల్ల రోజువారీ జీవితంపై చెడు ప్రభావం పడే అవకాశం ఉందని అంటున్నారు. చాలా మందిలో ఈ సమస్యలు వ్యక్తి సామర్థ్యాలను తగ్గిస్తాయట.
డిమెన్షియాలో ప్రధానంగా మూడు రకాలు ఉంటాయని వైద్యులు చెబుతున్నారు. ఆల్జీమర్స్ డిమెన్షియాకు ప్రధాన కారణమని డాక్టర్లు చెబుతున్నారు. రక్త ప్రసరణ సమస్యల వల్ల ఏర్పడే దాన్ని వాస్క్యులర్ డిమెన్షియా అని పిలుస్తారట. లూయి బాడీ డిమెన్షియా వస్తే మానసిక స్థితి మార్పులు, హాల్యూసినేషన్లు వంటివి కనిపిస్తాయట.
ALSO READ: వంటగదిలో వీటిని ఎక్కువగా వాడుతున్నారా..?
డిమెన్షియా రావడానికి చాలా కారణాలు ఉంటాయని నిపుణులు చెబుతున్నారు. 65 సంవత్సరాల వయసు పైబడిన వారిలో డిమెన్షియా రిస్క్ ఎక్కువగా ఉంటుందట. మరికొందరిలో జన్యు వేరియంట్‌లో వచ్చే మార్పులు డిమెన్షియా రిస్క్‌ను పెంచుతాయి. అధిక రక్తపోటు, డయాబెటిస్, అధిక కొలెస్ట్రాల్ వంటివి డిమెన్షియా రిస్క్‌ను పెంచుతాయని ఆరోగ్య నిపుణులు వెల్లడిస్తున్నారు. మరికొందరిలో స్మోకింగ్, ఆల్కహాల్ తీసుకోవడం వల్ల డిమెన్షియా వచ్చే ఛాన్స్ ఉందని డాక్టర్లు పేర్కొంటున్నారు.
డిమెన్షియా రిస్క్‌ను తగ్గించుకోండిలా
డిమెన్షియా రిస్క్‌ను తగ్గించడానికి కొన్ని మార్గాలు ఉన్నాయని వైద్య నిపుణులు చెబుతున్నారు. ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవడం వల్ల కూడా ఈ సమస్య రాకుండా చేయొచ్చని నిపుణులు వెల్లడిస్తున్నారు. పుస్తకాలు చదవడం, పజిల్స్ చేయడం వంటి మానసిక వ్యాయామాలు చేస్తే మంచి ఫలితం వచ్చే అవకాశం ఉందట. అంతేకాకుండా రక్తపోటు, మధుమేహం వంటి సమస్యలతో ఇబ్బంది పడుతున్న వారి వీటిని తగ్గించుకోవడానికి ప్రయత్నించాలని నిపుణులు సూచిస్తున్నారు.
డిమెన్షియాను పూర్తిగా తగ్గించడం సాధ్యం కాదని డాక్టర్లు చెబుతున్నారు. కానీ, కొన్ని దీని రిస్క్‌ను తగ్గించేందుకు కొన్ని మార్గాలు ఉన్నాయని అంటున్నారు. రోగ్యకర జీవనశైలి, మానసిక వ్యాయామం, సామాజిక సంబంధాలు వంటి మార్గాలు డిమెన్షియా రిస్క్‌ను తగ్గించడంలో సహాయపడతాయట.
గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘బిగ్ టీవీ’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.