Match Fixing threat IPL 2025: ఇండియన్ ప్రీమియర్ లీగ్ { IPL 2025} 18 వ సీజన్ రసవత్తరంగా సాగుతోంది. క్రికెట్ ప్రేమికులకు ఫుల్ ఎంటర్టైన్మెంట్ అందిస్తోంది. విజయం కోసం అన్ని జట్లు పోరాడుతుండడంతో మ్యాచ్ లు ఉత్కంఠభరితంగా సాగుతున్నాయి. ఇంతలో ఓ ఆశ్చర్యకరమైన వార్త వెలుగులోకి వచ్చింది. బీసీసీఐ ఇచ్చిన తాజా ఆదేశాలు సంచలనం రేపుతున్నాయి.
Also Read: Dhanashree Verma: బెడ్ రూం వీడియో షేర్ చేసిన ధన శ్రీ.. మరీ ఇంత హాట్ గా
గతంలో మ్యాచ్ ఫిక్సింగ్ లకు పాల్పడ్డ ఓ వ్యక్తి ఐపీఎల్ ఆటగాళ్లు, ఫ్రాంచైజీలకు చేరువయ్యే ప్రయత్నాలు చేస్తున్నాడని భారత క్రికెట్ నియంత్రణ మండలి {బీసీసీఐ} అన్ని ఫ్రాంచైజీలకు కీలక ఆదేశాలు జారీచేసింది. ముందస్తు చర్యల్లో భాగంగా ఐపీఎల్ ఆడుతున్న ప్లేయర్లు, జట్ల యాజమానులు, సహాయక సిబ్బంది, కామెంటేటర్లకు కీలక సూచనలు చేసింది. హైదరాబాద్ కి చెందిన ఓ బడా వ్యాపారవేత్త ఫిక్సింగ్ కి గట్టిగా ప్రయత్నాలు చేస్తున్నట్లు వెల్లడించింది. ఒకవేళ అలాంటి ఘటనలు చోటు చేసుకుంటే వెంటనే తమ దృష్టికి తీసుకురావాలని బీసీసీఐ అవినీతి నిరోధక భద్రత విభాగం { ఏసీఎస్యు} సూచించింది.
ప్లేయర్లతో పాటు వారి కుటుంబ సభ్యులతో సన్నిహితంగా మెలుగుతూ.. వారికి నగదు లేదా ఖరీదైన బహుమతులు ఇవ్వడం ద్వారా వారిని ఆకర్షించుకునే ప్రయత్నాలు జరగవచ్చని ఆందోళన వ్యక్తం చేసింది. ఐపీఎల్ లోని 10 జట్లకు ఈ హెచ్చరికలు జారీ చేసింది. దీంతో ఐపీఎల్ లో ఈ ఫిక్సింగ్ ఆరోపణలపై పోలీసులు ఆరా తీస్తున్నారు. ఆధారాలు ఇవ్వాలని పోలీసులు బీసీసీఐని కోరారు. హైదరాబాద్ కి చెందిన ఆ బడా వ్యాపారవేత్త ఎవరు అనేదానిపై పోలీసులు చాకచక్యంగా ఆరా తీస్తున్నారు.
బిసిసిఐ, ఐసీసీ, స్థానిక క్రికెట్ క్లబ్ లతో కాంటాక్ట్ లో ఉన్న వ్యక్తులపై అనుమానం వ్యక్తం చేస్తున్నారు పోలీసులు. అంతేకాకుండా హైదరాబాద్ కి చెందిన ఐదుగురు బడా వ్యాపారవేత్తలను పోలీసులు అనుమానిస్తున్నారు. ఇప్పటికే కొంతమందిని ఆ వ్యాపారవేత్త కాంటాక్ట్ అయి ఉండవచ్చని అనుమానిస్తున్నారు. దీంతో క్రికెట్ అభిమానులు సైతం ఆ వ్యాపారవేత్త ఎవరు అనేదానిపై పెద్ద ఎత్తున చర్చించుకుంటున్నారు. ఆ వ్యాపారవేత్త గతంలోనూ ఇలాంటి అవినీతి కార్యకలాపాలకు పాల్పడ్డాడని, ఈ నేపథ్యంలో ఐపీఎల్ తో ప్రత్యక్షంగా, పరోక్షంగా సంబంధం ఉన్న ప్రతి ఒక్కరిని ఏసిఎస్యు హెచ్చరించింది.
Also Read: Backfoot No Ball: వివాదంగా మారిన స్టార్క్ నో బాల్…. అంబానీ కుట్రలు చేశాడని ఆరోపణలు
వీరాభిమానిగా నటిస్తూ తరచు ఆటగాళ్లకు దగ్గరయ్యేందుకు ప్రయత్నించడం అతడికి అలవాటు అని, అలా వీలుకాకపోతే ప్లేయర్ల కుటుంబాలకు లేదా సన్నిహితులు, స్నేహితులు, బంధువుల ద్వారా కూడా ప్రయత్నాలు చేస్తాడని బీసీసీఐ హెచ్చరించింది. విదేశాలలో ఉండే వారిని సైతం ఇందుకోసం సంప్రదించే అవకాశం ఉన్నందున సోషల్ మీడియాలో కూడా అప్రమత్తంగా ఉండాలని సూచించింది. ఆ వ్యాపారవేత్త జట్టు సభ్యులు బస చేస్తున్న హోటల్లలో, మ్యాచ్ జరుగుతున్న స్టేడియాలలో కనిపించాడని పేర్కొంది. ఈ నేపథ్యంలో అతడితో జాగ్రత్తగా ఉండాలని సూచించింది. ఇలా బుకింగ్ వలలో చిక్కుకొని భవిష్యత్తును పాడు చేసుకోవద్దని బీసీసీఐ హితవు పలికింది.