Rohit- Apoorva : అగ్నిపరీక్ష సీజన్ 2లో సత్తా చాటి జడ్జెస్ మన్ననలను పొంది.. అభిమానుల చేత ఆదరాభిమానాలు సొంతం చేసుకొని బిగ్ బాస్ సీజన్ 10 లోకి కామనర్ కేటగిరీలో అడుగు పెట్టారు రోహిత్ నాయుడు (Rohit Naidu). ఇక మధ్యలో అపూర్వ హౌస్ లోకి వచ్చింది. అయితే అపూర్వ హౌస్ లోకి అడుగుపెట్టిన తొలివారమే కెప్టెన్ గా బాధ్యతలు చేపట్టి ఆ తర్వాత వారమే హౌస్ నుండి ఎలిమినేట్ అయింది. ఇక రోహిత్ నాయుడు దాదాపు 8 వారాలపాటు హౌస్ లో కొనసాగారు. ప్రేక్షకుల అభిమానాన్ని సొంతం చేసుకున్నారు. రోహిత్ టైటిల్ విజేత అవుతారని, ఆఖరికి సినీ నటుడు కౌశల్ మండా కూడా తన రివ్యూలో తెలిపారు అంటే రోహిత్ పర్ఫామెన్స్ హౌస్ లో ఏ విధంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. అలాంటి రోహిత్ ని అనూహ్యంగా హౌస్ నుండి ఎలిమినేట్ చేయడంతో అభిమానులు జీర్ణించుకోలేకపోయారు. సీక్రెట్ రూమ్ లో ఉంచారని, మళ్ళీ హౌస్ లోకి తీసుకొస్తారంటూ పెద్ద ఎత్తున వార్తలు వినిపించాయి. అటు బిగ్ బాస్ కూడా రోహిత్ ను మళ్ళీ తీసుకోవాలనే ప్రయత్నాలు చేసినా రోహిత్ దీనికి ఒప్పుకోలేదు.
ఇక అలా అపూర్వ, రోహిత్ ఇద్దరూ హౌస్ నుండి ఎలిమినేట్ అయ్యారు. ఎవరికి వారు పలు ఇంటర్వ్యూలు ఇస్తూ బిజీగా మారిపోయారు. అయితే తాజాగా ‘ఆదివారం విత్ స్టార్ మా పరివారం’ నిర్వాహకులు అగ్నిపరీక్ష 2 లో టాప్ 15 లో ఉన్న కంటెస్టెంట్స్ తో సక్సెస్ పార్టీ నిర్వహించారు. ప్రస్తుతం అమన్ హౌస్ లో ఉండడంతో మిగిలిన 14 మంది ఈ పార్టీలో పాల్గొన్నారు. ఇకపోతే ఆదివారం ప్రసారమయ్యే ఈ ఎపిసోడ్ కి సంబంధించిన లేటెస్ట్ ప్రోమోని నిర్వాహకులు విడుదల చేయగా.. సరదాగా సాగిన ఈ ప్రోమో పర్సనల్స్ వరకు వెళ్ళింది. బిగ్ బాస్ లో ఉన్నామనుకున్నారో ఏమో తెలియదు కానీ అపూర్వ హద్దులు దాటింది.
దాంతో రోహిత్ కూడా రెచ్చిపోయారు. ఇద్దరు ఒకరికొకరు దూషించుకోవడం చూస్తుంటే ..”ఇది బిగ్ బాస్ కాదురా బై.. మీరు ఇలా కొట్టుకోవడానికి.. ఈ ప్రతాపం అక్కడ చూపించాల్సింది?” అంటూ కామెంట్లు చేస్తున్నారు.ప్రముఖ యాంకర్ శ్రీముఖి హోస్ట్ గా వ్యవహరిస్తున్న ఆదివారం విత్ స్టార్ మా పరివారం లేటెస్ట్ ప్రోమోలో నామినేషన్ టాస్క్ నిర్వహించారు. అందులో అపూర్వ మాట్లాడుతూ.. “నేను ఈ మనిషి వల్ల చాలా చాలా బాధపడ్డాను. అతనే రోహిత్” అంటూ నామినేట్ చేసింది.
also read: బిగ్ బాస్ లోకి రాకముందు రోహిత్ నాయుడు జీతం ఎంతో తెలుసా?
అయితే ఇక్కడ వరకు సరదాగా సాగినా.. ఆ తర్వాత అపూర్వ మాట్లాడుతూ..” జనాలలో వచ్చిన ఒపీనియన్ ఏమిటంటే.. చపాతి పిండి చేయడం ఒక ఆర్ట్ అయితే రోహిత్ ఒక ఆర్టిస్టు అని.. నేను ఏ రెస్పెక్ట్ అయితే ఎక్స్పెక్ట్ చేశానో అది మీరు నాకు ఇవ్వలేదు” అంటూ నామినేట్ చేసింది. ఇక రోహిత్ తన డిబేట్లో భాగంగా “ఎంత దిగజారిన పరిస్థితి అయినా ఆ సిచువేషన్ ను ఈమె కేర్ చేయదు” అన్నాడు. దీనికి అపూర్వ..” పనికిరాదు, వేస్ట్ , వీక్ , వీకెస్ట్ ఇవన్నీ తీసి పడేయడం ఫస్ట్ నుంచి మనకున్నదే” అంటూ రోహిత్ పై కామెంట్లు చేసింది.
దీనికి రోహిత్ మండిపడుతూ.. “ఈ ఎక్స్ట్రాలు మాట్లాడకు.. నువ్వు నాకన్నా ముందు వెళ్లిపోయావు.. జనాలు ఎత్తి కొట్టి బయటకు పంపించారు..” అని ఫైర్ అయ్యాడు. దీనికి అపూర్వ..” నన్ను ఎత్తి కొట్టలేదు.. నిన్ను ఛీ అని బయటకు పంపించారు ” అంటూ ఫైర్ అయింది. అలా ఇద్దరి మధ్య వాగ్వాదం పీక్స్ కి చేరిపోయింది. ఏది ఏమైనా వీళ్ళిద్దరూ ఇది బిగ్ బాస్ అనుకున్నారో ఏమో కానీ మరోసారి మాటలతో రెచ్చిపోయారు.