Bigg Boss 10:బిగ్ బాస్ సీజన్ 10 లో వైల్డ్ కార్డు ఎంట్రీస్ వచ్చిన తర్వాత బయట విషయాలను లోపల ప్రస్తావిస్తున్నారు అనే మాటలు గట్టిగా వినిపిస్తున్న విషయం తెలిసిందే. అయితే హౌస్ బయట స్నేహితులుగా ఉన్న సెలెబ్రిటీలు మాత్రం ఇప్పుడు హౌస్ లోకి వచ్చిన తర్వాత అదే ఫ్రెండ్షిప్ మైంటైన్ చేస్తామంటే కుదరదు. గేమ్ కోసం అన్నింటిని పక్కన పెట్టాల్సిందే అంటూ తన మైండ్ గేమ్ తో అందర్నీ ఆశ్చర్యపరుస్తున్నారు త్రిగుణ్ (Trigun) . ఈ క్రమంలోనే స్నేహం పేరిట త్రిగుణ్ ను వర్షిణి (వర్షిణి) మ్యానుపులేట్ చేస్తోంది అని కొంతమంది కామెంట్లు చేస్తుంటే.. మరికొంతమంది ఆమె నిజమైన స్నేహం అనుకుంటుంది కానీ ఆట కోసం స్నేహాన్ని కూడా పక్కన పెడతాడని ఆమె మాత్రం ఏమి ఊహించి ఉంటుంది అంటూ కూడా కామెంట్లు చేస్తున్నారు.
ఇకపోతే గత రెండు మూడు టాస్కులలో స్నేహాన్ని కూడా పక్కనపెట్టి తన ఆటతీరుతో ముందుకు వెళ్లారు త్రిగుణ్.ఇదే సమయంలో కొంతమంది త్రిగుణ్ కి కూడా సపోర్టుగా నిలిచారు. స్నేహం అనేది బయట మాత్రమే ఇక్కడ కాంపిటీషన్ ఉంది. ఇలాంటి సమయంలో స్నేహం పనికిరాదు అంటూ కూడా కామెంట్లు చేస్తున్నారు. ఇదంతా ఇలా ఉండగా హౌస్ లో వీరిద్దరి మధ్య జరుగుతున్న సంభాషణలు అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తున్నాయి. ప్రస్తుతం నామినేషన్ వార్ హీటెక్కిస్తున్న విషయం తెలిసిందే. ఇలాంటి సమయంలో వర్షిణి “నువ్వు ఒక జూనియర్ ఆర్టిస్ట్” అంటూ చేసిన కామెంట్లు ఆమెను అవమాన భారంతో తలదించుకునేలా చేశాయి. మరి అసలేం జరిగిందో ఇప్పుడు చూద్దాం.
ఒకవైపు నామినేషన్ వార్ గట్టిగా సాగుతుంటే.. మరొకవైపు అదే నామినేషన్ లో భాగంగా శ్వేత తన వంతులో ముఖేష్ – అమన్ ను నామినేట్ చేసింది. ఇక్కడ ముఖేష్ కు గట్టి కారణాలు చెప్పి నామినేట్ చేసింది. టాస్క్ లో ముఖేష్ చేసిన తప్పును ఆమె చెప్పినప్పుడు, శివ ప్రస్తావన తీసుకొచ్చాడు ముఖేష్ దీంతో శివ వచ్చి నన్ను ముందుకు వచ్చి, మోచేయి చూపించి కొట్టేంత పని చేశాడని, ముఖేష్ ఆటలో న్యాయం లేదని చెప్పాడు. దీనికి త్రిగుణ్ కూడా వంత పాడి ముఖేష్ కు కౌంటర్ ఇచ్చాడు. ఇక శ్వేతా రెండవ నామినేషన్ లో చెప్పిన కారణానికి చాలా రఫ్ గా సమాధానమిచ్చాడు అమన్. ఎవరేమనుకున్నా.. నేను నా ఆట ఆడుతాను. ఎవరికి నచ్చినా.. నచ్చకపోయినా పర్వాలేదు అంటూ కామెంట్ చేశాడు. అయితే ఈ సమయంలో శ్వేతా కి కూడా త్రిగుణ్ మద్దతు ఇచ్చాడు.
also read:పెళ్లి పీటలెక్కిన ‘ఇంటింటి గృహలక్ష్మి’ దివ్య – విక్రమ్.. ఫోటోలు వైరల్!
ఇకపోతే శ్వేత నామినేషన్ లో అమన్ డిఫెండ్ చేస్తుండగా మధ్యలో వర్షిణి చేయి పైకెత్తి మాట్లాడబోయింది. దీంతో వెంటనే త్రిగుణ్ ఆమెకు కౌంటర్ ఇచ్చాడు. జూనియర్ ఆర్టిస్టులతో మాట్లాడడం ఏంటి? అంటూ వెటకారం చేశాడు దీంతో వర్షిణి మొహంలో బాధ కనిపించింది. అసలే బయట ఫ్రెండ్స్.. ఇక్కడ కంటెస్టెంట్స్.. అయినా సరే తనను పట్టించుకోలేదు అని వర్షిని ఒకవైపు బాధపడుతుంటే.. త్రిగుణ్ మొహమాటం లేకుండా ఆమెను జూనియర్ ఆర్టిస్ట్ అనడంతో ఆమె ముఖంలో ఆ బాధ స్పష్టంగా కనిపించింది. ఏది ఏమైనా స్నేహితుడే అవమానించడంతో వర్షిణి అభిమానులు త్రిగుణ్ పై గుర్రుగా ఉన్నారు.