Shoaib Akhtar On Babar Azam: పాకిస్తాన్ మాజీ కెప్టెన్ బాబర్ ఆజం (Babar Azam) వరుసగా విఫలమవుతున్న సంగతి తెలిసిందే. టెస్టులతో పాటు వన్డేలలో కూడా అట్టర్ ఫ్లాఫ్ అవుతున్నాడు. దాదాపు రెండు సంవత్సరాలుగా సెంచరీ నమోదు చేయలేదు. దీంతో 2027 వన్డే వరల్డ్ కప్ జట్టులో బాబర్ ఆజంకు అవకాశం రాబోదని చర్చ జరుగుతోంది. ఇలాంటి క్రమంలో పాకిస్తాన్ మాజీ ఫాస్ట్ బౌలర్ షోయబ్ అక్తర్ (Shoaib Akhtar ) సంచలన వ్యాఖ్యలు చేశాడు. వరుసగా విఫలమవుతున్న బాబర్ ఆజం డ్రామాలు ఆడుతున్నాడని మండిపడ్డాడు. ఫామ్ కోల్పోయిన బాబర్ ఆజం.. దాని పైన ఫోకస్ చేయకుండా సింపతీ కోసం చూస్తున్నాడని మండిపడ్డాడు.
అందరూ ఒంటరి చేశారని.. పాకిస్తాన్ క్రికెట్ బోర్డును విలన్ చేసే ప్రయత్నం చేస్తున్నట్టు షోయబ్ అక్తర్ నిప్పులు చెరిగాడు. అందుకే డ్రెస్సింగ్ రూమ్ లో కూడా దీనంగా కూర్చుంటూ నాటకాలు ఆడుతున్నాడని ఓ రేంజ్ లో రెచ్చిపోయాడు. ఇలాంటి ఓవరాక్షన్ పక్కకు పెట్టి మంచి హెడ్ కోచ్ ను చూసుకో అంటూ హితువు పలికాడు. అప్పుడైనా ఫామ్ మెరుగుపడి.. అద్భుతంగా ఆడగలుగుతావని సూచనలు చేశాడు. లేకపోతే బాబర్ ఆజం కెరీర్ క్లోజ్ కావడం గ్యారెంటీ అంటూ వార్నింగ్ ఇచ్చాడు. దీంతో బాబర్ ఆజం పై షోయబ్ అత్తర్ చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి.
ఫామ్ లేక సతమతమవుతున్న బాబర్ ఆజంను ఉద్దేశించి షోయబ్ అక్తర్ సంచలన వ్యాఖ్యలు చేశాడు. ఫామ్ లేని సమయంలో సింపతీ కోసం బాబర్ ఆజం అనవసరంగా ప్రయత్నిస్తున్నాడని మండిపడ్డాడు. అలా కాకుండా… గౌతమ్ గంభీర్ లాంటి మంచి కోచ్ ను పెట్టుకోవాలని సూచనలు చేశాడు. అలాంటి కోచ్ ఉంటే బాబర్ ఆజం గాడిలో పడతాడని వ్యాఖ్యానించాడు. దాని పైన ఫోకస్ చెయ్యాలని… అనవసరంగా టైం వేస్ట్ చేయకూడదని కోరాడు.
ఇప్పటికైనా మించి పోయింది ఏమీ లేదని.. మంచి కోచ్ ను నియామకం చేసుకొని ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని వెల్లడించాడు. అవసరం అనుకుంటే తాను కూడా బాబర్ ఆజంకు సహాయం చేస్తానని బంపర్ ఆఫర్ ఇచ్చాడు. ఇప్పటినుంచి పికప్ అందుకుంటేనే 2027 వన్డే వరల్డ్ కప్ లో బాబర్ ఆజం ఆడతాడని వ్యాఖ్యానించాడు. లేకపోతే పాకిస్తాన్ క్రికెట్ జట్టులో బాబర్ ఆజం స్థానం గల్లంత కావడం గ్యారెంటీ అని హెచ్చరించాడు. దీంతో షోయబ్ అక్తర్ చేసిన వ్యాఖ్యలు వైరల్ గా మారాయి.