BigTV English

Seamantham: గర్భిణీలకు ఏడో నెలలోనే ఎందుకు సీమంతం చేస్తారంటే.. ఇదీ అసలు విషయం!

Seamantham: గర్భిణీలకు ఏడో నెలలోనే ఎందుకు సీమంతం చేస్తారంటే.. ఇదీ అసలు విషయం!

Seamantham In 7th Month: ప్రతి స్త్రీ తల్లి కావాలని ఎంతగానో ఆశ పడుతుంది. తొలిసారి ప్రెగ్నెన్సీ అయ్యే మహిళ ఆనందం గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. గర్భధారణ అనేది తన జీవితంలో ఓ వరంగా భావిస్తుంది. తమ ప్రేమకు ప్రతిరూపంగా పుట్టబోయే బిడ్డ కోసం ఎన్నో కలలుకంటుంది. పురిటి నొప్పుల బాధ భరించలేనిదని తెలిసినా, ప్రాణాలను పణంగా పెట్టి బిడ్డకు జన్మను ఇవ్వాల్సి ఉంటుందని తెలిసినా ఆనందంగా స్వీకరిస్తారు. తన పేగు తెంచుకుని పుట్టే బిడ్డ కోసం ఎంతగానో ఎదురుచూస్తుంటారు.


తొమ్మిది నెలల పాటు బిడ్డను కడుపులో మోస్తూ తల్లి ఎన్నో కలలు కంటుంది. తొమ్మిది నెలల పాటు ఎంతో జాగ్రత్తగా ఉంటుంది. కుటుంబ సభ్యులు కూడా వారిని అపురూపంగా చూసుకుంటారు. ఆరోగ్యకరమైన బిడ్డ పుట్టేలా తల్లికి ఆరోగ్యరమైన ఫుడ్ పెట్టడంతో పాటు సంతోషంగా ఉండేలా చూసుకుంటారు. అదే సమయంలో తల్లి, బిడ్డ క్షేమాన్ని కోరుకుంటూ పెద్దలు సీమంతం వేడుక నిర్వహిస్తారు. గర్భం దాల్చిన ఏడో నెలలో ఈ కార్యక్రమాన్ని జరిపిస్తారు. లేదంటే తొమ్మిదో నెలలో ఈ వేడుకను చేస్తారు. ఎవరు, ఏ నెలలో చేసినా, తల్లి సౌభాగ్యం, బిడ్డ క్షేమంగా ఉండటమే ఈ వేడుక ప్రధాన ఉద్దేశం.

ఏడో నెలలోనే సీమంతం ఎందుకు?


సీమంతాన్ని ప్రతి భర్తా, తన భార్యకు దగ్గరుండి ఈ వేడుకను నిర్వహిస్తారు. ప్రస్తుత ముత్తైదువలు అంతా చేరి ఈ వేడుకను ఘనంగా జరుపుతారు. గర్భం దాల్చిన తన కూతురు కాళ్లకు పసుపు రాసి, నుదుటిన కుంకుమ పెట్టి, చేతికి గాజులు తొడిగి ఒడిలో చలిమిడి పెడుతుంది. అత్తగారు కొత్త చీర పెడుతుంది. చక్కటి తినుబండారాలు, పూలు, పండ్లను ఒడిలో నింపుతారు. తల్లిదండ్రులు, అత్తమామలు, భర్త, ముత్తైదువులు గాజులు తొడిగి ఆశీర్వచనాలు అందిస్తారు.  ఈ వేడుకని ఏడవ నెలలో చేస్తే మంచిదని అందరూ భావిస్తారు. బిడ్డ జన్మకు మరో రెండు నెలల సమయంలో ఉండటంతో ఈ కాలంలో ఆమె మరింత సంతోషంగా ఉండాలనే భావనతో ఈ వేడుక నిర్వహిస్తారు. ఈ సంతోషం బిడ్డకు ఎంతో మేలు కలిగిస్తుందని భావిస్తారు.

సీమంతం రోజు తొడిగే గాజులు ఎంతో ప్రత్యేకం  

సీమంతం వేడుకలో ముద్దైదువులంతా కలిసి  గర్భవతికి గాజులు తొడిగి పండంటి బిడ్డకు జన్మనివ్వాలని ఆశీర్వదిస్తారు. ఈ గాజులు తొడగడం వెనుక ఎంతో శాస్త్రీయత ఉందంటారు పెద్దలు. గర్భిణీలకు గర్భకోశంపై ఎక్కువగా జీవనాడుల ఒత్తిడి అవసరం అవుతుంది.. చేతి నరాలకు, గర్భకోశం దగ్గర ఉన్న నరాలకు దగ్గరి సంబంధం ఉంటుంది. అందుకే, చేతులకు ఎక్కువ మొత్తంలో గాజులు తొడుగుతారు.ఈ గాజులు గర్భకోశం దగ్గర ఉన్న జీవనాడులపై ఒత్తిడి కలిగించి సుఖ ప్రసవం జరిగేలా చేస్తుంది. సీమంతం వేడుక వెనుక జాతక ప్రభావం కూడా ఉంటుందని అధికారులు భావిస్తారు. బిడ్డ జాతకం ప్రభావం తల్లిదండ్రుల మీద పడకూడదని ముగ్గురి క్షేమాన్ని కోరుకుంటూ ఈ వేడుకను నిర్వహిస్తారు. దోషాలకు శాంతి జరిపించే దిశగా.. తల్లికి మంచి ఆరోగ్యం, తండ్రికి ఆర్థిక వృద్ధి, బిడ్డకు పీడలు లేకుండా ఉండాలని ఆకాంక్షిస్తూ సీమంతం జరుపుతారు. ఈ వేడుకను మహిళ తన జీవితాంతం మర్చిపోకుండా మధుర జ్ఞాపకాలను ఎప్పటికీ నెమరు వేసుకుంటుంది.

Read Also: ప్లాట్‌ఫాంపై నిద్ర.. బట్టల షాప్‌లో పని.. చివరికి నిలోఫర్ కేఫ్‌కు యజమాని!

Tags

Related News

Heart Problems: రాత్రిపూట తరచూ గురక.. నిర్లక్ష్యం చేస్తే తీవ్రమైన 5 ఆరోగ్య సమస్యలు

Thyroid Disease: థైరాయిడ్ ఉన్న వారు.. పొరపాటున కూడా ఇవి తినొద్దు !

Easy Egg Recipes: ఎగ్స్‌తో తక్కువ టైంలో.. సింపుల్‌గా చేసే బెస్ట్ రెసిపీస్ ఇవే !

Dondakaya Fry: పక్కా ఆంధ్రా స్టైల్ దొండకాయ ఫ్రై.. ఇలా చేస్తే సూపర్ టేస్ట్

Health tips: గుండెల మీద ఎవరైనా కూర్చొన్నట్లు అనిపిస్తోందా? దానిని ఏమంటారో తెలుసా?

Navratri Fasting: నవరాత్రి ఉపవాస సమయంలో.. ఈ ఫుడ్ తింటే ఫుల్ ఎనర్జీ !

Fast Eating: టైం లేదని వేగంగా తింటున్నారా ? ఎంత ప్రమాదమో తెలిస్తే ఈ రోజే మానేస్తారు !

Dates Benefits: డైలీ రెండు ఖర్జూరాలు తింటే ? బోలెడు లాభాలు !

Big Stories

×