BigTV English

TS Politics: సీఎం రేవంత్‌రెడ్డితో హరీశ్‌రావు మీటింగ్.. ఏంటి సంగతి?

TS Politics: సీఎం రేవంత్‌రెడ్డితో హరీశ్‌రావు మీటింగ్.. ఏంటి సంగతి?

TS Politics: రేవంత్‌రెడ్డి vs కల్వకుంట్ల ఫ్యామిలీ. ఉప్పు-నిప్పు. పచ్చగడ్డి వేస్తే భగ్గు. మాటల్లేవ్. మాట్లాడుకోవడాలు లేవ్. విమర్శలు, తిట్లే. అలా గ్యాప్ వచ్చేసింది అంతే. రాజకీయంగా బద్ద శతృత్వం. కనిపిస్తే కస్సుబుస్సే. అసలు వాళ్లు ఎదురుపడేదేలే. మాజీ సీఎం కేసీఆర్‌ కాలు జారి పడి.. తుంటి సర్జరీ చేయించుకుని హాస్పిటల్ బెడ్ మీద ఉన్నాప్పుడు.. ముఖ్యమంత్రి హోదాలో రేవంత్‌రెడ్డి వెళ్లి ఆయన్ను పరామర్శించారు. రేవంత్ వస్తున్నారని తెలిసి.. ఆ టైమ్‌లో అక్కడ లేకుండా ముఖం చాటేశారు కేటీఆర్. సంతోశ్‌ కుమార్ రావే.. సీఎంను రిసీవ్ చేసుకున్నారు. గడిచిన పదేళ్లలో రేవంత్ అండ్ కల్వకుంట్ల మెంబర్స్ ఫేస్ టు ఫేస్ కలుసుకున్న సందర్భాలు దాదాపు లేవనే చెప్పాలి. అయితే.. హరీశ్‌రావు మాత్రం అలా కాదు. కాస్త డిఫరెంట్.


రాజకీయం, లౌక్యం తెలిసిన నాయకుడు హరీశ్‌రావు. అందుకే ఆ పార్టీకి ట్రబుల్ షూటర్. సీఎం రేవంత్‌రెడ్డిపై పలు అంశాల్లో విమర్శలు చేస్తున్నా.. తాటిచెట్టు అంత పెరిగాడు.. బిల్లారంగా అంటూ రేవంత్ మాటల మంటలు రాజేస్తున్నా.. వాళ్లు ఎదురుపడితే మాత్రం కూల్ కూల్‌గానే ఉంటారు. బీఏసీ మీటింగ్స్‌లో మంచిగానే మాట్లాడుకుంటారు. హాయ్, బాయ్ వరకు వాళ్ల రిలేషన్ బానే ఉందంటారు.

లేటెస్ట్‌గా హరీశ్‌రావు.. ఎమ్మెల్యే పద్మారావుతో కలిసి అసెంబ్లీలోని సీఎం ఛాంబర్‌లో రేవంత్‌రెడ్డితో భేటీ అయ్యారు. 15 నిమిషాలు మాట్లాడుకున్నారు. నియోజకవర్గాల్లో అధికారులు ప్రోటోకాల్ పాటించడం లేదని.. ప్రతిపక్ష నేతలను పట్టించుకోవట్లేదని కంప్లైంట్ చేశారు. ఇలా సీఎం ఛాంబర్‌కు వెళ్లి.. వాళ్ల ప్రాబ్లమ్స్ చెప్పడం మామూలు విషయమే అయినా.. వెళ్లింది హరీశ్‌రావు కాబట్టి కాస్త ఇంట్రెస్టింగ్. ఇలాంటి పద్దతుల్లో కేటీఆర్ మరీ పూర్. కనీసం బావను చూసైనా బావమరిది నేర్చుకుంటే మంచిదేమో.


Also Read : హరీశ్ దెబ్బకు రోడ్డున పడ్డ కేటీఆర్!

మరోవైపు, మాజీ మంత్రి, మేడ్చల్ ఎమ్మెల్యే మల్లారెడ్డి కుటుంబ సమేతంగా సీఎం రేవంత్ రెడ్డిని కలిశారు. మెడికల్ కాలేజ్ సీట్ల పెంపు కోసం సీఎంను కలిసినట్లు మల్లారెడ్డి అల్లుడు, మల్కాజ్‌గిరి ఎమ్మెల్యే మర్రి రాజశేఖరరెడ్డి చెప్పారు.

రీజన్ ఏదైనా ఇలా వరుసబెట్టి బీఆర్ఎస్ నేతలు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డిని కలవడం మాత్రం పొలిటికల్ గుసగుసలకు ఛాన్స్ ఇస్తోంది. రేవంత్ అందరివాడు అనిపించుకుంటున్నారు. ఒకప్పుడు సెక్రటేరియట్‌లోకి ఎవరికీ అనుమతి ఉండేది కాదు. పోలీసులను పెట్టి అడ్డుకునేవారు. ధర్నా చౌక్ సైతం ఎత్తేసిన చరిత్ర గులాబీ పార్టీది. అలాంటిది ఇటీవల సచివాలయంలో ధర్నాలు చేసేందుకు కూడా అనుమతిస్తున్నారంటే.. అసలైన ప్రజాపాలన అంటే ఇదేగా! అధికారులు, సామాన్యులు, రాజకీయ నేతలు, ఆ పార్టీ, ఈ పార్టీ అనే తేడా లేకుండా సీఎం రేవంత్‌రెడ్డి అందరికీ అందుబాటులో ఉంటున్నారు. అయినా, సోషల్ మీడియాలో కారు కూతలు మాత్రం ఆపట్లేదు. రేవంత్‌కు పాలనలో పట్టు లేదంటూ వికృత ప్రచారం చేయిస్తున్నారు. తాను తలుచుకుంటే పోలీసులతో కేటీఆర్ ఇంటి తలుపులు పగలగొట్టి, వీపు పగలగొట్టి.. లోపలేయడం ఎంత పని? అంటున్నారు. ఎన్నైనా అనుకోండి.. నా టెంపర్‌మెంట్‌ మాత్రం మార్చుకోనంటూ.. సూటిగానే చెప్పేస్తున్నారు సీఎం. ప్రస్తుతానికి తాను తెలంగాణ డెవలప్‌మెంట్ పై మాత్రమే ఫోకస్ పెట్టి.. రోజుకు 18 గంటలు పని చేస్తున్నానంటూ క్లారిటీ ఇస్తున్నారు.

Related News

Bandi Sanjay: కేటీఆర్ కు ఉన్న అతి తెలివి నాకెక్కడ? – బండి సంజయ్

Hyderabad floods: హైదరాబాద్‌ ఇక మునగదు.. సీఎం రేవంత్ రెడ్డి అదిరి పోయే ప్లాన్ ఇదే!

Bandi Sanjay: వావి వరుసలు లేకుండా వారి ఫోన్లు ట్యాపింగ్ చేశారు.. బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు

Weather News: రాష్ట్రంలో అతిభారీ వర్షం.. ఈ 12 జిల్లాల్లో దంచుడే దంచుడు.. పిడుగులు కూడా..?

Weather Update: వర్షపాతాన్ని ఎలా కొలుస్తారు ? రెడ్, ఆరెంజ్, ఎల్లో అలెర్ట్‌కు అర్థం ఏంటి ?

Sunil Kumar Ahuja Scam: వేల కోట్లు మింగేసి విదేశాలకు జంప్..! అహూజా అక్రమాల చిట్టా

Big Stories

×