BigTV English

Niloufer Cafe Babu Rao: ప్లాట్‌ఫాంపై నిద్ర.. బట్టల షాప్‌లో పని.. చివరికి నిలోఫర్ కేఫ్‌కు యజమాని!

Niloufer Cafe Babu Rao: ప్లాట్‌ఫాంపై నిద్ర.. బట్టల షాప్‌లో పని.. చివరికి నిలోఫర్ కేఫ్‌కు యజమాని!

Niloufer Cafe owner Inspirational Story: శ్రమ నీ ఆయుధం అయితే, విజయం నీ బానిస అవుతుందనే మాట తరచుగా వింటూనే ఉంటాం. కష్టాన్ని నమ్ముకున్న వాళ్లు అప్పటికప్పుడు ఎదగకపోవచ్చు. కానీ, కచ్చితంగా ఏదో ఒకరోజు ఉన్నత స్థాయికి చేరుకుంటారు. అలా చేరుకున్న వ్యక్తే నీలోఫర్ కేఫ్ ల యజమాని బాబూరావు. ఒకప్పుడు అదే కేఫ్ లో చాయ్ కప్పులు కడిగిన ఆయన, ఇప్పుడు నగరంలో వెలసిన పదుల కేఫ్ లకు యజమానిగా మారిపోయారు. ఇదేదో ఓవర్ నైట్ జరిగిన మాయ కాదు. ఏండ్ల నాటి శ్రమ ఉంది. ఎన్నో నిద్రలేని రోజులు గడిపిన సందర్భాలున్నాయి. పని వాళ్లను ఇంటి వాళ్లుగా చూసుకుంటూ ఉన్నత స్థాయికి చేరిన వ్యక్తి బాబూరావు. ఇంతకీ బాబూరావు ఎవరు? ఆయన ప్రస్థానం ఎక్కడ మొదలయ్యింది? నీలోఫర్ కేఫ్ లో కప్పులు కడిగిన వ్యక్తి ఇప్పుడు యజమానికిగా ఎలా మారాడు? ఎందరికో స్ఫూర్తి ప్రదాతగా ఎలా నిలిచాడో ఇప్పుడు తెలుసుకుందాం..


హైదరాబాదీయులకు చాయ్ అంటే ఎంతో ఇష్టం. చాయ్ అంటే ఇష్టపడే వారికి నీలోఫర్ కేఫ్ గురించి పెద్దగా పరిచయం అవసరం లేదు. సుమారు 45 ఏండ్ల క్రితం హైదరాబాద్ నడిబొడ్డులో వెలిసిన ఈ చాయ్ కేఫ్ లో లక్షలాది మందికి కేరాఫ్ గా మారింది. ఇక్కడ దొరికే చాయ్ ఇంట్లో దొరికే చాయ్ కంటే ఎంతో టేస్టీగా ఉంటుందంటే, నీలోఫర్ గొప్పదనం ఏంటో తెలుసుకోవచ్చు. నీలోఫర్ కేఫ్ ను అంత అద్భుతంగా తీర్చిదిద్దారు యజమాని బాబూరావు.

ఫ్లాట్ ప్లారమ్ మీద నిద్ర, రైల్వే స్టేషన్ లో స్నానం


ఆదిలాబాద్ కు చెందిన బాబూరావు.. ఏదైనా సాధించాలనే తపనతో 1975లో హైదరాబాద్ కు బయల్దేరాడు. ఆదిలాబాద్ నుంచి టికెట్ లేకుండానే రైలు ఎక్కాడు. హైదరాబాద్ వచ్చిన తర్వాత నేరుగా ఒక బట్టల దుకాణంలో సేల్స్ మ్యాన్ గా పని చేయడం మొదలు పెట్టాడు. పైసా లేకుండా హైదరాబాద్ కు వచ్చిన ఆయన, ఉద్యోగం వచ్చిన తర్వాత కూడా 15 రోజుల పాటు ఫుట్ పాత్ మీదే పడుకున్నారు. నాంపల్లి స్టేషన్ లోని వెయిటింగ్ రూమ్ లో స్నానం చేసేవాడు.  బట్టల దుకాణంలో కొద్ది నెలల పాటు పని చేసిన ఆయన ఆ తర్వాత ఓ రెస్టారెంట్ కు మారాడు. అక్కడ ఓ ఫుడ్ అవుట్ లెట్ ఎలా రన్ చేయాలో నేర్చుకున్నాడు. ఆ రెస్టారెంట్ కు వచ్చిన ఓ కస్టమర్ కొత్త ప్రారంభించిన కేఫ్ లో బాగా సరిపోతాడని భావించి అక్కడ చేరాలని సూచించాడు.

నీలోఫర్ కేఫ్ లో వెయిటర్ గా చేరిన బాబూరావు

కస్టమర్ ఇచ్చిన సలహాతో బాబూరావు నీలోఫర్ కేఫ్ లో వెయిటర్ గా జాయిన్ అయ్యాడు. అక్కడ వెయిటర్ గానే కాకుండా కొన్నిసార్లు స్వీపర్‌ గానూ పని చేశాడు. కేఫ్ లో కప్పులు, పాత్రలు కూడా కడిగేవాడు. ఆ తర్వాత మంచి చాయ్ ఎలా తయారు చేయాలో నేర్చుకున్నాడు. ఆయనకు వస్తువులను అమ్మడంలోనూ అనుభవం ఉండటం కలిసి వచ్చింది. అతడి పనిని చూసి కేఫ్ యజమాని.. దాని బాధ్యతలను తనకే అప్పగించాడు. ఆ తర్వాత కొద్ది రోజులకు ఆ కేఫ్ ఆయనకే ఇచ్చాడు. 1978లో లక్డీకాపూర్ లో ఉన్న చిన్న కేఫ్ ను చేతుల్లోకి తీసుకున్న బాబూరావు, ఇప్పుడు హైదరాబాద్ లో నెలకొల్పిన అవుట్ లెట్ లకు యజమానిగా కొనసాగుతున్నాడు.

నెలకు రూ. 25 లక్షల ట్యాక్స్

ఏ ప్రాంతంలో నీలోఫర్ కేఫ్ ఏర్పాటు చేస్తే, ఆ ప్రాంత ప్రజల అభిరుచికి అనుగుణంగా చాయ్ అందిస్తారు. ఆటో డ్రైవర్ ఇష్టపడే కడక్ ఛాయ్ కి ఈ కేఫ్ లో రూ. 10 నుంచి రూ. 15 ఉంటుంది. ప్రొషెషనల్స్ కు ఒక కప్పుడు టీకి రూ. 100 వరకు చెల్లిస్తారు. నీలోఫర్ కేఫ్ లోని ప్రతి ఐటెమ్ ను బాబూరావు రుచి చూసిన తర్వాతే కస్టమర్లు అందిస్తారు. తనకు నచ్చిన తర్వాతే అందుబాటులో ఉంచుతారు. పరిమాణం కంటే నాణ్యత ముఖ్యం అని నమ్ముతాడు బాబురావు. కొన్నిసార్లు నష్టాలు వచ్చినప్పటికీ నాణ్యత విషయంలో రాజీ పడలేదంటాడు ఆయన. ఆధునిక సాంకేతిక పరాజ్ఞానాన్ని కొనసాగిస్తూనే కస్టమర్లకు కొత్తదాన్ని అందించాలనే ఆలోచన చేస్తానన్నాడు బాబూరావు. నీలోఫర్ మెయిన్ బ్రాంచ్ లక్డీకాపూల్ లో ఉండగా, హిమాయత్ సాగర్, బంజారాహిల్స్, రాయదుర్గంలో అవుట్ లెట్ లు ఉన్నాయి. అన్ని సెంటర్లు ఎప్పుడూ కస్టమర్లతో కిటకిటలాడుతుంటాయి. ఆయన నెలలకు సుమారు రూ. 25 లక్షలు జీఎస్టీ చెల్లిస్తారంటే, ఏస్థాయిలో బిజినెస్ సాగుతుందో అర్థం చేసుకోవచ్చు. ఆయన కేఫ్ లలో సుమారు 690 మంది పని చేస్తున్నారు. వారందరికీ రోజూ ఉచితంగా భోజనం అందిస్తారు బాబూరావు.

ఎన్నో సేవా కార్యక్రమాలు

నీలోఫర్ కేఫ్ లో ప్రతి రోజు మిగిలిపోయిన బ్రెడ్, బిస్కెట్లను పేదవారికి పంచుతాడు. వాళ్ల నాన్న కోరిక మేరకు పలు సేవా కార్యక్రాలు నిర్వహిస్తున్నాడు. ఒకప్పుడు క్యాన్సర్ పేషెంట్ల బంధువులకు సాయపడిన ఆయన, ప్రస్తుతం రోజూ 500 మందిఇ టిఫిన్, 300 మందికి భోజనాలు అందిస్తున్నారు. సాయం చేయడం వల్ల ఇంకా ఎక్కువ లాభం పొందుతారే తప్ప నష్టం ఉండదంటారు బాబూరావు. పైసా లేకుండా హైదరాబాద్ లో అడుగు పెట్టి, ఇప్పుడు తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకన్న బాబూరావు నిజంగా ఎంతో మందికి స్ఫూర్తి కలిగిస్తున్నారు.

Read Also: ఆ రోజంతా ఫ్రీ.. ఛాయ్ లవర్స్ కు నీలోఫర్ కేఫ్ క్రేజీ ఆఫర్!

Related News

FASTag Annual Pass: టోల్ రీచార్జ్ టెన్షన్‌కు గుడ్‌బై.. ఆగస్టు 15 నుంచి FASTag పాస్ రెడీ!

Srisailam Road Project: హైదరాబాద్‌ నుండి శ్రీశైలంకు కొత్త రూట్.. జస్ట్ 45 నిమిషాల్లో యమ స్పీడ్ దారి ఇదే!

Ganga Bridge: ఆసియాలోనే అద్భుతం.. 10 కి.మీ పొడవైన గంగా వంతెన.. ఇది వేరే లెవల్ బాస్!

Trains Cancelled: భారీ వర్షాలు.. పట్టాల మీదికి నీళ్లు, 5 రోజుల పాటు 10 రైళ్లు రద్దు!

Namo bharat Train: అది లోకల్ ట్రైన్ కాదురా అయ్యా, నమో భారత్!

Indian Railways: ఆ టైమ్‌లో టీటీఈ.. ప్రయాణీకులను అస్సలు డిస్టర్బ్ చేయకూడదు, అలా చేస్తే దబిడి దిబిడే!

Big Stories

×