Varun Dawan : ఈ మధ్యకాలంలో ఇండస్ట్రీలోని స్టార్ హీరోలు అందరూ కూడా వ్యవసాయ భూములను కొనుగోలు చేసి వ్యవసాయాన్ని చేయాలని అనుకుంటున్నారు. కోలీవుడ్ హీరో మాధవ్ నుంచి నిన్న బాలీవుడ్ హీరో వరుణ్ ధావన్ వరకు ప్రతి ఒక్కరూ వ్యవసాయ భూములను కొనుగోలు చేస్తూ అందరికీ ఆదర్శంగా నిలుస్తున్నారు. కొందరు హీరోలు ఆస్తులను కొనుగోలు చేయడము లేదా పలు వ్యాపారాలలో పెట్టుబడులు పెట్టడం చేస్తూ ఉంటే.. మరికొందరు మాత్రం ఇలా వ్యవసాయాన్ని మెరుగుపరిచేందుకు ఆలోచన మొదలుపెడుతున్నారు. బాలీవుడ్ స్టార్ హీరో వరుణ్ ధావన్ వ్యవసాయ భూమిని కొనుగోలు చేయడంతో పాటు తన సంతోషాన్ని వ్యక్తం చేస్తూ ఒక వీడియోని రిలీజ్ చేశారు.. ఆ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతుంది. ఇంతకీ అందులో వరుణ్ ధావన్ ఏం చెప్పారో ఇప్పుడు ఒకసారి తెలుసుకుందాం..
బాలీవుడ్ ఇండస్ట్రీలో వరుస సినిమాలతో తనకంటూ ప్రత్యేక ఇమేజ్ ని సంపాదించుకున్న స్టార్ హీరో వరుణ్ ధావన్ తెలుగు ప్రేక్షకులకు సుపరిచితమే.. బాలీవుడ్ లో వరుసగా సినిమాలు చేస్తూ బిజీగా ఉన్న ఈ హీరో.. సోషల్ మీడియాలో కూడా హైపర్ యాక్టివ్గా ఉంటూ తన గురించి ఆసక్తికర విషయాలను పంచుకుంటూ వస్తుంటాడు.. ఈ క్రమంలో తాజాగా తన ఇంస్టాగ్రామ్ వేదికగా ఒక వీడియోని రిలీజ్ చేశాడు. ఆ వీడియోలో సినిమాల సక్సెస్‌లు, బాక్సాఫీస్ రికార్డుల కంటే తనకు ఇదే గొప్ప అచీవ్‌మెంట్ అని అన్నారు..కొత్తగా కొనుగోలు చేసిన భూమిలో వర్షాన్ని ఆస్వాదిస్తూ.. వేడి వేడి ఛాయ్, బిస్కెట్లు తింటున్న వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఆ వ్యవసాయ భూమిలో తాను వేసిన పంటను చూపిస్తూ తీసిన వీడియో ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతుంది..
వరుణ్ దావన్ సినిమాల విషయానికొస్తే..
బాలీవుడ్ ఇండస్ట్రీలో బ్యాక్ టు బ్యాక్ సినిమాలలో నటిస్తూ ప్రత్యేక ఇమేజ్ను సంపాదించుకున్న వరుణ్ ధావన్ అందరికీ తెలిసే ఉంటుంది.. ఇటీవల కాలంలో ఈయన నటించిన సినిమాలు బాక్స్ ఆఫీస్ వద్ద పాజిటివ్ టాక్ ని అందుకున్నాయి.. ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టిన నాటి నుంచి నేటి వరకు తన సినిమాలతో జనాలని విపరీతంగా కట్టుకున్నాడు ఈ బాలీవుడ్ హీరో.. ప్రస్తుతం వరుసగా సినిమాలు చేస్తూనే మరోవైపు వాణిజ్య ప్రకటనలు కూడా చేస్తూ రెండు చేతుల సంపాదిస్తున్నాడు. ఒక్కో సినిమాకు ఈయనకు కోట్లల్లో రెమ్యూనరేషన్ రావడంతో ఇలా వ్యవసాయ భూములను అలాగే పలు వ్యాపారాలలోనూ ఇన్వెస్ట్ చేస్తూ వస్తున్నారని టాక్.. ఇక వరుణ్ తో పాటుగా బాలీవుడ్ లోని పలువురు ప్రముఖులకు ఇలానే భూములను కొనుగోలు చేయడం లేదా మొక్కల పెంపకం లాంటి పనులను చేస్తూ వస్తున్నారు.. మరి నెక్స్ట్ ఏ హీరో ఆ లిస్ట్ లోకి చేరతాడో చూడాలి.. ప్రస్తుతం ఈ హీరో చేతిలో రెండు భారీ ప్రాజెక్టులు ఉన్నట్లు సమాచారం..
?igsh=Z3YxOWZtdmZvOTcx
Also Read :‘రాకా’ విలన్ కు రెమ్యూనరేషన్ అన్ని కోట్లా..? రిస్క్ అవసరమా..?