BigTV English

Home Remedies For HairFall: హెయిర్ ఫాల్‌తో బాధపడుతున్నారా.. ఈ చిట్కాలు ట్రై చేయండి

Home Remedies For HairFall: హెయిర్ ఫాల్‌తో బాధపడుతున్నారా.. ఈ చిట్కాలు ట్రై చేయండి

Home Remedies For Hair Fall: ప్రస్తుత కాలంలో హెయిర్ ఫాల్ అనేది ప్రతీ ఇంట్లో ఓ సమస్యగా మారింది. చిన్న పెద్ద అనే తేడా లేకుండా ప్రతీ ఒక్కరు హెయిర్ ఫాల్ బారిన పడుతున్నారు. ఈ తరుణంలో వెంట్రుకలు కొత్తగా రావడం కంటే ఉన్న వెంట్రుకలు ఊడకుండా ఉంటే చాలు అని భావిస్తున్నారు. అయినా కూడా మార్కెట్లో దొరికే షాంపులు, కండీషనర్ లు, నూనెలు, క్రీములు వంటివి తరచూ వాడడం వల్ల కూడా హెయిర్ ఫాల్ అయ్యే అవకాశాలు ఎక్కువగానే ఉంటాయి. అందువల్ల ఇంట్లో దొరికే హోం రెమెడీస్‌తో జుట్టును ధృడంగా, ఆరోగ్యంగా ఉంచుకోవచ్చు. ఆ వివరాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.


జుట్టును కేవలం నూనె, షాంపులు వంటివి వాడి మాత్రమే కాపాడుకోవచ్చని పొరపాటు పడుతుంటారు. కానీ, మంచి ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవడం వల్ల కూడా జుట్టు ఊడకుండా, బలంగా, ఆరోగ్యంగా ఉంచుకోవచ్చు. ఇందుకోసం విటమిన్లు, ప్రోటిన్లు అధికంగా ఉండే ఆహారాన్ని ఎంచుకోవాలి. జింక్, ఐరన్ వంటి ఖనిజాలు కూడా జుట్టును ఆరోగ్యంగా ఉంచి ఊడకుండా చేస్తుంది.

మసాజ్..


జుట్టుకు అన్నింటితో పాటు ముఖ్యంగా మసాజ్ అనేది చాలా అవసరం. మంచిగా జుట్టుకు నూనె రాసుకుని మసాజ్ చేయడం వల్ల జుట్టు ఊడకుండా ఉంటుంది. కుదుళ్లకు నూనెను పట్టించి, మాడుపై మసాజ్ చేయడం వల్ల వెంట్రుకలు బలంగా, కొత్తవి పెరిగేందుకు సహాయపడుతుంది. అంతేకాదు కుదుళ్ల వద్ద రక్తప్రసరణ జరిపేందుకు హెడ్ మసాజ్ తోడ్పడుతుంది. కనీసం రోజుకు నాలుగు నిమిషాలైనా నూనెను వేడి చేసి గొరువెచ్చగా ఉండే నూనెను జుట్టుకు పట్టించాలి.

ఎగ్ మాస్క్..

జుట్టుకు ఎగ్ మాస్క్ చాలా బాగా పనిచేస్తుంది. గుడ్డులో ఉంటే ప్రోటీన్లు, బయోటిన్, ఫోలేట్, విటమిన్ డీ,ఏ వంటివి జుట్టును ధృడంగా ఉంచేందుకు తోడ్పడుతాయి. స్కాల్ప్ కు గుడ్డును పట్టించి అరగంటపాటు అలాగే వదిలేయాలి. అనంతరం చల్లటి నీటితో తల స్నానం చేయడం ద్వారా జుట్టు మృదువుగా మారుతుంది.

కలబంద..

కలబందతో జుట్టుకు చాలా రకాల ప్రయోజనాలు ఉంటాయి. కలబందలో ఉండే సహజ మాయిశ్చరైజింగ్ లక్షణాలు పొడిబారిన వెంట్రుకలను రిపేర్ చేస్తాయి. దురద, చెమట నుంచి పాడైపోయిన జుట్టును రక్షిస్తుంది. కలబందలో ఉండే తేమ శాతం తలకు కండీషనర్‌గా పనిచేస్తుంది.

Related News

Raksha Bandhan Wishes 2025: రాఖీ పండగ సందర్భంగా.. మీ తోబుట్టువులకు శుభాకాంక్షలు చెప్పండిలా !

Tan Removal Tips: ముఖం నల్లగా మారిందా ? ఇలా చేస్తే.. క్షణాల్లోనే గ్లోయింగ్ స్కిన్

Cinnamon water: ఖాళీ కడుపుతో దాల్చిన చెక్క నీరు తాగితే.. మతిపోయే లాభాలు !

Junk Food: పిజ్జా, బర్గర్‌లు తెగ తినేస్తున్నారా ? జాగ్రత్త !

Health Tips: ఒమేగా- 3 ఫ్యాటీ యాసిడ్స్‌తో చర్మం, జుట్టుకు బోలెడు లాభాలు !

Broccoli Benefits: బ్రోకలీ తింటున్నారా ? అయితే ఈ విషయాలు తెలుసుకోండి

Big Stories

×