BigTV English

Puja Flowers: మీరు పూజించే దేవతను బట్టి పువ్వులను ఎంపిక చేసుకోవాలి, ఏ దేవతకు ఏ పువ్వులు?

Puja Flowers: మీరు పూజించే దేవతను బట్టి పువ్వులను ఎంపిక చేసుకోవాలి, ఏ దేవతకు ఏ పువ్వులు?

Puja Flowers: హిందూ శాస్త్రంలో పూజలో పువ్వులు ఎంతో ముఖ్యమైనవి. ఆచారాలు, వేడుకల్లో పువ్వులు ప్రధాన పాత్రను పోషిస్తాయి. చిన్న పండుగల నుండి పెద్ద వేడుకల వరకు అన్నింట్లోనూ పువ్వులు ఉండాల్సిందే. దేవతల ఆశీర్వాదం అందుకోవడానికి పువ్వులను సమర్పిస్తారు. పువ్వులు సమర్పించడం అనేది కేవలం పూజలో లేదా ఆచారంలో ఒక భాగం మాత్రమే కాదు, దేవుడితో కనెక్ట్ అయ్యే మార్గంగా కూడా చెప్పుకుంటారు. ప్రతి పువ్వుకు ప్రత్యేకమైన ఆధ్యాత్మిక శక్తి ఉంటుంది. పువ్వులో దేవతలు కొలువుంటారని ప్రతి దేవుడికి ఇష్టమైన పువ్వులు ఉంటాయని అంటారు. మీరు పూజ చేసే దేవుళ్లను బట్టి వారికే సమర్పించాల్సిన పువ్వులను ఎంపిక చేసుకోవాలి.


విష్ణువుకు కమలం
శ్రీమహావిష్ణువు చేతిలో తామర పువ్వు తోనే కనిపిస్తాడు. తామర పువ్వులను విష్ణువు ఎంతో ప్రేమిస్తాడని చెబుతారు. కమలం పువ్వు దైవత్వానికి, స్వచ్ఛతకు, జ్ఞానోదయంతో ముడిపడి ఉండే అందమైన పుష్పం తామర. ఈ పువ్వుకు ఆధ్యాత్మికతకు ఎంతో అనుబంధం ఉంది. కమలం మురికి నీటిలో వికసిస్తుంది. అలాగే మానవులు కూడా ఎలాంటి పరిస్థితుల్లోనైనా వికసించాలని చెప్పడమే కమలం పువ్వు ఉద్దేశం. విష్ణువును పూజించేటప్పుడు మీరు కమలంతో పూజ చేసి చూడండి. మీకు ఉత్తమ ఫలితాలు తగ్గుతాయి.

గణేశునికి బంతి పువ్వు
భారతదేశంలో దొరికే పువ్వుల్లో బంతి పువ్వు ముఖ్యమైనది. దీన్ని ఇంటిని అలంకరించేందుకు ఎక్కువగా వాడుతూ ఉంటారు. బంతి పువ్వులను ముఖ్యంగా గణేశుడు పూజలో అర్పిస్తారు. పసుపు, నారింజరంగు కలిసి ఉండే ఈ పువ్వు చూడగానే ఎంతో ప్రసన్నంగా అనిపిస్తుంది. సానుకూల శక్తికి ఇది చిహ్నంగా భావిస్తారు. విజయానికి శ్రేయస్సు ప్రతికూల శక్తులను తొలగించడానికి ఈ గణేశుడికి బంతి పువ్వులను వాడతారు. కాబట్టి వినాయక పూజలో కచ్చితంగా బంతిపూలు ఉండేలా చూసుకోండి.


సరస్వతీ దేవి
చదువును, జ్ఞానాన్ని అందించే దేవత సరస్వతీ దేవి. స్వచ్ఛతకు ఈమె ప్రతిరూపంగా చెప్పుకుంటారు. జ్ఞానాన్ని, కళలను, సృజనాత్మకతను అందించే దేవత ఈమె. మీరు సరస్వతి దేవిని పూజించాలనుకుంటే పవిత్రమైన దేవ గన్నేరు పువ్వులతో పూజించండి. ఈ పువ్వులకు సరస్వతికి దేవికి ఎంతో అనుబంధం ఉంది. సరస్వతీ పూజ సమయంలో దేవగన్నేరు నేర్పులు ఉన్న సమర్పించడం వల్ల భక్తులలో ఏకాగ్రతా, జ్ఞానం, కళాత్మక సామర్థ్యాలు పెరుగుతాయి.

ఉమ్మెత్త
ఉమ్మెత్త పువ్వుల్లాగే ఉమ్మెత్త మొక్కకు ముళ్ళతో కూడిన గుండ్రటి బంతుల్లాంటివి వికసిస్తాయి. ఇవి శివునికి ఎంతో ఇష్టమైనవి. వీటిని ధాతురా అని పిలుస్తారు. సముద్ర మథనం సమయంలో శివుడు హాలాహలం అనే విషాన్ని తాగినప్పుడు శివుడి చెమట నుంచే ఈ ధాతురాలు ఉద్భవించాయని చెబుతారు. అందుకే శివుడికి ఇది ఎంతో ఇష్టమని అంటారు. వీటితో శివునికి పూజ చేస్తే ఎంతో మంచిది.

కాళీమాతకు మందారాలు
ఎర్రటి మందార పువ్వులు అంటే కాళీమాతకు ఎంతో ఇష్టం. కాళీమాత చెడు శక్తుల నుంచి మనుషులను, విశ్వాన్ని కాపాడుతుంది. ఆమె దైవిక శక్తి పెరగడానికి మందార పువ్వులతో పూజ చేస్తే ఎంతో మంచిది. ఈ పువ్వులు ప్రాణ శక్తితో ముడిపడి ఉంటాయి. వీటిని కాళీమాతకు అర్పించడం వల్ల రక్షణ, బలం వంటివి లభిస్తాయని ఎంతోమంది నమ్ముతారు.

మల్లెపూలు
శ్రీమహావిష్ణువు అవతారమైన రాముడికి మల్లె పువ్వులు అంటే ఎంతో ప్రేమ. అలాగే రాముడికి కమలాలను కూడా సమర్పిస్తారు. మల్లెపూలు తెల్లగా ఉంటాయి. ఈ స్వచ్ఛతకు దయకు, చిహ్నంగా భావిస్తారు. మల్లెపువ్వు నుంచే వచ్చే సువాసన ప్రశాంతమైన వాతావరణంలో సృష్టిస్తుంది. అందుకే రామున్ని పూజించేటప్పుడు మల్లెపూలు కచ్చితంగా ఉండేలా చూసుకోండి.

Also Read: మోక్షద ఏకాదశి రోజు ఈ పూజ చేస్తే.. ఆర్థిక బాధలు తొలగిపోతాయ్

శ్రీకృష్ణునికి గులాబీ
ప్రేమకు, ఆనందానికి ప్రియమైన దేవుడు శ్రీకృష్ణుడు. బృందావనవాసుల మనసుల్లో ఆనందం నింపిన వ్యక్తి ఈయన. శ్రీకృష్ణుడి లీలలు ఎంత చెప్పుకున్నా తక్కువే. శ్రీకృష్ణుడిడిని భక్తితో, ప్రేమతో పూజించే వారు గులాబీలను కచ్చితంగా సమర్పించాలి. ముఖ్యంగా జన్మాష్టమి అంటే శ్రీకృష్ణుడి జన్మదినం నాడు ఆయనకు గులాబీలను సమర్పించి పూజ చేస్తే ఎంతో మంచిది.

Related News

Heart Problems: రాత్రిపూట తరచూ గురక.. నిర్లక్ష్యం చేస్తే తీవ్రమైన 5 ఆరోగ్య సమస్యలు

Thyroid Disease: థైరాయిడ్ ఉన్న వారు.. పొరపాటున కూడా ఇవి తినొద్దు !

Easy Egg Recipes: ఎగ్స్‌తో తక్కువ టైంలో.. సింపుల్‌గా చేసే బెస్ట్ రెసిపీస్ ఇవే !

Dondakaya Fry: పక్కా ఆంధ్రా స్టైల్ దొండకాయ ఫ్రై.. ఇలా చేస్తే సూపర్ టేస్ట్

Health tips: గుండెల మీద ఎవరైనా కూర్చొన్నట్లు అనిపిస్తోందా? దానిని ఏమంటారో తెలుసా?

Navratri Fasting: నవరాత్రి ఉపవాస సమయంలో.. ఈ ఫుడ్ తింటే ఫుల్ ఎనర్జీ !

Fast Eating: టైం లేదని వేగంగా తింటున్నారా ? ఎంత ప్రమాదమో తెలిస్తే ఈ రోజే మానేస్తారు !

Dates Benefits: డైలీ రెండు ఖర్జూరాలు తింటే ? బోలెడు లాభాలు !

Big Stories

×