Vikrant Massey: బాలీవుడ్ హీరో విక్రాంత్ మాస్సే పేరు కన్నా 12th Fail హీరో అంటేనే జనాలు బాగా గుర్తుపడతారు. ఆ ఒక్క సినిమా తో యావత్ సినీ అభిమానుల మనసు దోచుకున్నాడు. ఆ మూవీ భారీ సక్సెస్ ను అందుకోవడం తో వరుస సినిమా ఆఫర్స్ ను అందుకొని బిజీగా సినిమాలను పూర్తి చేసే పనిలో ఉన్నాడు. ఇటీవల సబర్మతి రిపోర్ట్ అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకొచ్చారు. ఈ మూవీని మోడీ వంటి ప్రముఖులు కూడా చూసి అతని నటన పై ప్రశంసలు కురిపించారు. బాక్సాఫీస్ వద్ద కూడా పాజిటివ్ రెస్పాన్స్ వస్తోంది. అయితే.. ఇటీవల నటుడు విక్రాంత్ మాస్సే చేసిన పోస్ట్ నెట్టింట వైరల్‌గా మారింది. ఆ పోస్ట్ వల్ల తన అభిమానులే కాకుండా మూవీ లవర్స్ కూడా షాక్ అయ్యారు. దీంతో తన పోస్ట్ పై విక్రాంత్ మాస్సే తాజాగా క్లారిటీ ఇచ్చాడు. అతను ఏమన్నాడంటే..?
హీరో విక్రాంత్ మాస్సే మొన్నామధ్య తన ఇన్‌స్టా ఖాతా లో ఒక పోస్ట్‌ను పోస్ట్ చేశారు. ఇందులో’గత కొన్ని సంవత్సరాలు మీ నుంచి అపారమైన ప్రేమను పొందుతున్నాను. కానీ ఇప్పుడు నేను నా కుటుంబం, నా కోసం సమయం కేటాయించాల్సిన సమయం వచ్చింది. 2025 లో మిమ్మల్ని చివరిసారి కలుస్తాను. ‘ అని ఇంట్రెస్టింగ్ పోస్ట్ పెట్టారు. దీంతో విక్రాంత్ పోస్ట్ పై సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చలు జరిగాయి. ఇక ఈ పోస్ట్ తో కేవలం తన అభిమానులే కాదు. ఇండస్ట్రీ ప్రముఖులు కూడా షాక్ అయ్యారు. దీంతో విక్రాంత్ సినిమాలకు గుడ్ బై చెప్పినట్లు వార్తలు ఊపందుకున్నాయి.
విక్రాంత్ పోస్ట్ పై సినీ ప్రముఖులు కూడా స్పందించారు. హిట్ సినిమాలు తన అకౌంట్ లో ఉన్నా కూడా ఇలా చెయ్యడం ఏంటని ప్రశ్నలు కురిపించారు. ఈ టాపిక్ ఇండస్ట్రీలో చర్చ నీయాంశంగా మారింది. ఈ వార్తల పై హీరో తాజాగా స్పందించారు. తాను రిటైర్‌మెంట్ తీసుకోనని, కొంత కాలం విరామం కావాలని చెప్పాడు. ‘నేను యాక్టింగ్ కెరీర్ కు వీడ్కోలు పలకలేదు. నాకు నటించడం మాత్రమే తెలుసు. నటన నాకు అన్నీ ఇచ్చింది. నాకు కొంత కాలం విరామం కావాలి. నేను ఇంటిని, ఇంట్లో వారికి దూరంగా ఉంటాను.. నా ఆరోగ్యం కూడా చూసుకోవాలి కదా.. ఇప్పటి వరకు సినిమాలతో బిజీ అయ్యాను అందుకే ఈ బ్రేక్ తీసుకుంటున్నా.. నన్ను ఇంతగా అభిమానిస్తూ, ఆదరించిన మీ అందరికి ధన్యవాదాలు అని పోస్ట్ లో పేర్కొన్నాడు. కాస్త గ్యాప్ తీసుకొని రీ ఎంట్రీ ఇస్తానని చెప్పాడు. ఈ ప్రకటనతో ఆయన ఫ్యాన్స్ మాత్రమే కాదు. మూవీ లవర్స్ కూడా ఖుషీ అవుతున్నారు.. హీరో క్లారిటీ తో ఇండస్ట్రీలోని వాళ్లంతా ఊపిరి పీల్చుకున్నారు. అందుతున్న సమాచారం ప్రకారం.. ఒక ఏడాది పాటు సినిమాలకు బ్రేక్ తీసుకోనున్నాడని సమాచారం.. 2025 లో మళ్లీ సినిమాలను ప్రకటించే అవకాశాలు ఉన్నాయని తెలుస్తుంది.