BigTV English

Youthful Glow: ఎప్పటికీ యవ్వనంగా ఉండాలా? డైలీ, ఈ యాంటీ ఏజింగ్ ఫుడ్స్ తింటే చాలు.. వయస్సే తెలియదు

Youthful Glow: ఎప్పటికీ యవ్వనంగా ఉండాలా? డైలీ, ఈ యాంటీ ఏజింగ్ ఫుడ్స్ తింటే చాలు.. వయస్సే తెలియదు

Top Anti Aging Foods: వయసు పెరుగుతున్న కొద్దీ చర్మం మెరుపు తగ్గుతుంది. నెమ్మదిగా కళ తప్పుతుంది. వృద్ధాప్యాన్ని ఎవరూ ఆపలేకపోయినా, కొన్ని ఫుడ్స్ తీసుకోవడం వల్ల వృద్ధాప్య ఛాయలను కంట్రోల్ చేసుకునే అవకాశం ఉంది. ముఖ్యంగా యాంటీ ఏజింగ్ ఫుడ్స్ తీసుకోవడం వల్ల చర్మ ఆరోగ్యం మెరుగవుతుంది. నిర్దిష్ట పోషకాలతో కూడిన ఫుడ్స్ ఫ్రీ రాడికల్స్‌ తో పోరాడటంతో పాటు, కొల్లాజెన్‌ ఉత్పత్తి ని పెంచుతాయి. ఫలితంగా మెరిసే చర్మం సొంతం అవుతుంది.


అందమైన చర్మం కోసం తీసుకోవాల్సిన టాప్ యాంటీ ఏజింగ్ ఫుడ్స్

బ్లూబెర్రీస్


బ్లూ బెర్రీస్ లో విటమిన్లు C, E లాంటి యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి ప్రీ రాడికల్స్ ను కంట్రోల్ చేయడంతో పాటు పొల్యూషన్ నుంచి చర్మాన్ని కాపాడుతాయి. చర్మం ముడతలను తగ్గించి, చర్మ కాంతిని పెంచుతాయి.

గ్రీన్ టీ

గ్రీన్ టీలోని కాటెచిన్స్, పాలీఫెనాల్స్ సమృద్ధిగా ఉంటాయి. ఇవి చర్మ కణాలను UV కిరణాల నుంచి కాపాడుతాయి. రెగ్యులర్ గా గ్రీన్ టీ తాగడం వల్ల అకాల వృద్ధాప్యం నుంచి బయటపడే అవకాశం ఉంటుంది.

డార్క్ చాక్లెట్

డార్క్ చాక్లెట్లలోని ఫ్లేవనాయిడ్స్ చర్మానికి రక్త ప్రసరణను పెంచుతాయి. సన్ డ్యామేజ్ నుంచి చర్మాన్ని కాపాడుతాయి. కనీసం 70% కోకో ఉన్న ఛాక్లెట్స్ తీసుకోవడం వల్ల మరింత చర్మకాంతి లభిస్తుంది.

తాజా ఆకుకూరలు

తాజా ఆకుకూరలు చర్మం మెరుపును అందిస్తాయి. బచ్చలికూర, పాలకూరలో ఫోలేట్‌ తో పాటు విటమిన్లు A, C, K పుష్కలంగా ఉంటాయి.  ఈ పోషకాలు సెల్ రిపేర్, కొల్లాజెన్ ఉత్పత్తిని పెంచుతాయి. చర్మానికి మరింత అందాన్ని తీసుకొస్తాయి.

 అవోకాడో

అవకాడోలోని హెల్తీ ఫ్యాట్స్, విటమిన్లు E, C  చర్మాన్ని ఆరోగ్యంగా మార్చుతాయి. చర్మం తేమను పెంచి మృదువుగా మార్చుతాయి. మోనోశాచురేటెడ్ ఫ్యాట్స్ చర్మానికి కావాలసిన పోషణను అందిస్తూ హెల్తీగా మార్చుతాయి.

అవిసె గింజలు

అవిసె గింజలలోని ఒమేగా -3 ఫ్యాటీ ఆమ్లాలు చర్మానికి నేచురల్ ఆయిల్స్ అందిస్తాయి. చర్మం మంటను తగ్గించడంలో కీలక పాత్ర పోషిస్తాయి.  ఈ గింజలను రెగ్యులర్ గా తీసుకోవడం వల్ల హైడ్రేషన్ మెరుగవుతుంది. చర్మం ముడతలు మాయం అవుతాయి.

చేపలు

ఒమేగా -3 ఫ్యాటీ ఆమ్లాలు అధికంగా ఉండే సాల్మన్, మాకేరెల్, సార్డినెస్ లాంటి చేపలను తినడం వల్ల చర్మం కాంతివంతంగా మారుతుంది. ఒమేగా-3 కొవ్వు ఆమ్లాలు కొల్లాజెన్ ఉత్పత్తిని ప్రోత్సహిస్తాయి. చర్మాన్ని ముడతలు లేకుండా కాపాడుతాయి.

పసుపు

పసుపులోని కర్కుమిన్ లో శక్తివంతమైన యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు ఉంటాయి.  ఇవి ఆక్సీకరణ ఒత్తిడి నుంచి చర్మాన్ని కాపాడుతాయి. చర్మం మంటను తగ్గిస్తాయి.  చర్మానికి కాంతిని అందిస్తాయి.

వృద్ధాప్యం అనేది కామన్ అయినా, తినే ఆహారం చర్మం ఆరోగ్యాన్ని నిర్ణయిస్తుంది. ఆహారంలో ఈ యాంటీ ఏజింగ్ సూపర్‌ ఫుడ్స్ తీసుకోవడం వల్ల చర్మం యవ్వనంగా, ప్రకాశవంతంగా మారుతుంది.

Read Also:గంజి వచ్చేలా అన్నం వండి ఆనీళ్లను ప్రతిరోజూ తాగండి, మీరు ఊహించని ప్రయోజనాలు కలుగుతాయి

Related News

Parenting Tips: పిల్లల అరుపులు ఎలా అర్థం చేసుకోవాలి? తల్లిదండ్రులకు అవసరమైన సమాచారం

Chapati: నిజమా.. చపాతి అలా తింటే ఆరోగ్యానికి ప్రమాదమా..?

Hair Loss: ఈ విటమిన్ లోపమే.. జుట్టు రాలడానికి కారణమట !

Ajwain Water Benefits: వాము నీరు తాగితే.. ఈ ఆరోగ్య సమస్యలు పరార్ !

Fact Check: నవ్వితే కళ్ల నుంచి నీరు వస్తుందా? అయితే కారణం ఇదీ?

Skin Whitening Tips: ఛాలెంజ్, ఈ టిప్స్ పాటిస్తే.. 7 రోజుల్లోనే నిగనిగలాడే చర్మం

Big Stories

×