BigTV English
Advertisement

Zepto: మహిళకు ఐ-పిల్ పేరుతో అలాంటి మెసేజ్, నిప్పులు చెరుగుతున్న నెటిజన్లు

Zepto: మహిళకు ఐ-పిల్ పేరుతో అలాంటి మెసేజ్, నిప్పులు చెరుగుతున్న నెటిజన్లు

Zepto Message: నిత్యవసర సరుకులను డెలివరీ చేసే సంస్థ జెప్టో తాజాగా ఓ మహిళకు పంపించిన మెసేజ్ తీవ్ర దుమారం రేపింది. సోషల్ మీడియా వేదికగా నెటిజన్లు ఓ రేంజ్ లో ఫైర్ అయ్యారు. వెంటనే స్పందించిన జెప్టో జరిగిన పొరపాటుకు చింతిస్తున్నట్లు వెల్లడించింది. సదరు మహిళకు క్షమాపణలు చెప్పింది. ఇంతకీ అసలు ఏం జరిగిందంటే?


‘మిస్ యు పల్లవి‘ అంటూ ఐ-పిల్ మెసేజ్

బెంగళూరుకు చెందిన పల్లవి పరీక్ అనే మహిళకు ‘ఐ మిస్ యూ పల్లవి’ అంటూ గర్భనిరోధక మాత్ర ఐ-పిల్ చెప్పినట్లుగా జెఫ్టో నోటిఫికేషన్ పంపించింది. ఆ మెసేజ్ చూసి సదరు మహిళ షాక్ అయ్యింది. వెంటనే స్క్రీన్ షాట్ తీసి సోషల్ మీడియాలో షేర్ చేసింది. జెస్టో కంపెనీతో పాటు దానికి కస్టమర్ సర్వీస్ కు ట్యాగ్  చేస్తూ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. “ప్రియమైన జెస్టో.. మీరు పంపించిన మెసేజ్ చాలా తప్పుగా ఉంది. నేను ఎప్పుడూ మీ దగ్గర ఎమర్జెన్సీ ఐ పిల్ ఆర్డర్ చేయలేదు. ఒకవేళ నేను చేసినా ఐ పిల్ కు నన్ను మిస్ కావాల్సిన అవసరం లేదు. నాకూ దాన్ని మిస్ అవ్వాల్సిన అవసరం అంతకన్నా లేదు. అయినా, నేను గర్భనిరోధక మాత్రలు తీసుకోవాల్సి అవసరం ఉందని మీరు భావిస్తున్నారా? నేను ఎప్పుడూ ఆర్డర్ పెట్టని గర్భనిరోధక మాత్ర గురించి నాకు మెసేజ్ రావడం ఏంటి?. మెసేజ్ అనేది సున్నితంగా, కామెడీగా ఉంటే కొంత లాజిక్ ఉంటుంది. కానీ, నైతిక హద్దులను దాటడం ఏమాత్రం సరికాదని గుర్తుంచుకోవాలి. నాకు జెప్టో మీద ఎలాంటి కోపం లేదు. ఈ అనుచిత మెసేజ్ పట్ల తప్ప. జెప్టో డెలివరీ చేసే నిత్యవసరాల మీద నేనూ ఆధారపడతాను” అని పల్లవి రాసుకొచ్చింది.


పల్లవికి క్షమాపణలు చెప్పిన జెస్టో

పల్లవి సోషల్ మీడియాలో షేర్ చేసిన పోస్టు వైరల్ అకావడంతో జెస్టో కంపెనీ వెంటనే స్పందించింది. జరిగిన పొరపాటుకు క్షమాపణలు చెప్పింది. “హే పల్లవి, మేం కన్ఫ్యూజ్ అయ్యాం. ఈ మెసేజ్ చాలా అనాలోచితమైనది. హానికరమైనది కూడా. జరిగిన పొరపాటుకు చింతిస్తున్నాం. మమ్మల్ని క్షమించండి. మళ్లీ ఇలాంటి పొరపాటు జరగదు. మీకే కాదు, మరెవరికీ ఇలాంటి మెసేజ్ వెళ్లకుండా జాగ్రత్తలు తీసుకుంటాం” అని వెల్లడించింది.

జెస్టో తీరుపై నెటిజన్ల తీవ్ర ఆగ్రహం

అటు జెస్టో కంపెనీ పల్లవికి క్షమాపణలు చెప్పినప్పటికీ సోషల్ మీడియాలో నెటిజన్లు ఈ అంశంపై తీవ్ర స్థాయాలో చర్చకు తెరలేపారు. ఆయా సంస్థలు మ్యాన్ పవర్ ను కాకుండా ఆర్టిఫీషియల ఇంటెలీజెన్స్ ను నమ్ముకుంటే ఇలాంటి ఘటనలే జరుగుతాయంటూ మండిపడుతున్నారు. కంపెనీలు మహిళలకు పంపే మెసేజ్ ల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలంటున్నారు. పల్లవికి ఎదురైన పరిస్థితి మరెవరికీ ఎదురు కాకూడదని మరికొంత మంది కామెంట్ చేశారు. కంపెనీ క్షమాపణలు చెప్పాక చర్చ అవసరం లేదని మరికొంత మంది అభిప్రాయపడ్డారు.

Read Also: అబ్బాయిలూ.. ‘పడక గది’లో చతికిల పడుతున్నారా? ఈ ఫుడ్స్‌కు కాస్త దూరంగా ఉండండి బాస్!

Tags

Related News

Rainbow Puri: రెయిన్‌బో పూరీ..ఇలా తయారు చేసుకుని తింటే అదిరిపోయే టేస్ట్

Kothmira Pachadi: నోరూరించే కొత్తిమీర పచ్చడి.. సింపుల్‌గా ఇలా తయారు చేయండి !

Criticism: పదే పదే మిమ్మల్ని విమర్శిస్తున్నారా.. సానుకూల ధోరణే సరైన పరిష్కారం!

Mental Health: ఈ లక్షణాలు మీలో ఉంటే.. మానసిక ఆరోగ్యం దెబ్బతిన్నట్లే ?

Air Pollution: పిల్లల్లో ఈ సమస్యలా ? వాయు కాలుష్యమే కారణం !

Cinnamon: దాల్చిన చెక్కను ఇలా వాడితే.. పూర్తిగా షుగర్ కంట్రోల్

Surya Namaskar benefits: సర్వరోగాలకు ఒకటే పరిష్కారం.. ఆరోగ్యంతో పాటు సమయమూ ఆదా!

Feeding Mistakes: ఉఫ్ ఉఫ్ అని ఊదుతూ అన్నం తినిపిస్తున్నారా.. నిపుణులు ఏమంటున్నారంటే?

Big Stories

×