Bollywoodగత కొంతకాలంగా చలనచిత్ర పరిశ్రమలో నటీనటుల మరణం అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు. కొంతమంది వృద్ధాప్య కారణాల వల్ల మరణిస్తే. మరికొంతమంది అనారోగ్య సమస్యలతో మరణిస్తున్నారు.. ఈ క్రమంలోనే ఇప్పుడు కూడా ఒక సీనియర్ నటుడు అనారోగ్య సమస్యలతో తుది శ్వాస విడిచారు. గత కొంతకాలంగా హాస్పిటల్ లో చికిత్స పొందుతున్న ఆయన కన్ను మూసినట్లు కుటుంబ సభ్యులు వెల్లడించారు. మరి ఆయన ఎవరు అనే విషయానికొస్తే.. అమీర్ ఖాన్(Aamir Khan) హీరోగా నటించిన ‘3 ఇడియట్స్’ సినిమాలో ప్రొఫెసర్ పాత్ర పోషించిన అచ్యుత్ పోత్దార్(Achyut potdar)(91).. అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఈయన థానేలోని జూపిటర్ హాస్పిటల్ లో చికిత్స తీసుకుంటున్నారు. పరిస్థితి విషమించడంతో తుది శ్వాస విడిచారు.
నటుడుగానే కాదు..
తన అద్భుతమైన నటనతో విలక్షణ నటుడిగా పేరు సొంతం చేసుకున్న అచ్యుత్ మరణ వార్త విని అభిమానులు తట్టుకోలేకపోతున్నారు. ముఖ్యంగా స్టార్ సెలబ్రిటీలు కూడా ఈయన మరణానికి సంతాపం తెలియజేస్తూ వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలుపుతున్నారు. అచ్యుత్ నటుడు గానే కాకుండా భారత సాయుధ దళాలలో కూడా పనిచేశారు.. నాలుగు దశాబ్దాల సినీ కెరియర్ లో 125కి పైగా హిందీ, మరాఠీ చిత్రాలలో నటించారు.
అచ్యుత్ సైన్యాధికారి కూడా..
1934 ఆగస్టు 22న మధ్యప్రదేశ్లోని జబల్పూర్ మరాఠీ బ్రాహ్మణ కుటుంబంలో జన్మించారు. ఆయన తన బాల్యాన్ని మధ్యప్రదేశ్లోని ఇండోర్లో గడిపారు. 1961లో ఆర్థిక శాస్త్రంలో మేజర్ తో మొదటి ర్యాంకుతో పోస్ట్ గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన ఈయన.. ఆ తర్వాత విశ్వవిద్యాలయ పథకాన్ని కూడా అందుకున్నారు. మధ్యప్రదేశ్ లోని రేవాలో ప్రొఫెసర్గా బాధ్యతలు చేపట్టిన తర్వాత భారత సైన్యంలో చేరారు. అక్కడి నుండి 1967లో కెప్టెన్ గా పదవీ విరమణ చేసిన ఈయన ఇండియన్ ఆయిల్ లో దాదాపు 25 సంవత్సరాల పాటు ఎగ్జిక్యూటివ్ గా పనిచేసి 58 సంవత్సరాల వయసులో పదవీ విరమణ పొందారు.
సినిమా మీద మక్కువతోనే ఇండస్ట్రీకి..
ఇండియన్ ఆయిల్ లో పనిచేస్తున్నప్పుడే నాటకాలలో పాల్గొనేవారు. వారి సాంస్కృతిక కార్యక్రమాలకు ఆతిథ్యం కూడా ఇచ్చేవారు. బాలీవుడ్లో తన క్యారెక్టర్ పాత్రలకు ప్రసిద్ధి చెందిన ఈయన 44 సంవత్సరాల వయసులోనే సినీ పరిశ్రమలోకి అడుగుపెట్టారు. సైనిక నేపథ్యం నుండి వచ్చిన ఈయన కార్పొరేట్ ప్రపంచంలో సంవత్సరాలు గడిపారు. ఈయన నటించిన చిత్రాల విషయానికొస్తే.. దబాంగ్, ఫెరారీ కి సవారి, 3 ఇడియట్స్ వంటి చిత్రాలలో నటించారు.. ముఖ్యంగా 26 నాటకాలు, 45 ప్రకటనలలో పని చేసిన ఈయన… 96 సీరియల్స్ లో కూడా నటించారు. ఒకవైపు నటుడిగా మరొకవైపు సైనిక వృత్తిని కొనసాగిస్తూ తన జీవితాన్ని గొప్పగా మలుచుకున్నారు. ఏదేమైనా అచ్యుత్ లాంటి ఒక గొప్ప వ్యక్తిని ఇప్పుడు ఇండస్ట్రీ కోల్పోవడంతో.. పలువురు ఈయన మరణానికి సంతాపం తెలియజేస్తున్నారు.