Kuna Ravi Kumar: ఆముదాలవలస టీడీపీ ఎమ్మెల్యే కూన రవికుమార్ వ్యవహారం కొత్త మలుపు తిరిగిందా? ఈ వ్యవహారం వెనుక వైసీపీ నేతలున్నారా? వెలుగులోకి వచ్చిన వెంటనే ఎందుకు సదరు ఎమ్మెల్యే నోరు విప్పలేదు? పార్టీ హైకమాండ్ సీరియస్ కావడంతో ప్రిన్సిపల్ ఆడియో బయటపెట్టారు ఎమ్మెల్యే కూన రవికుమార్.
ప్రిన్సిపల్ సౌమ్య ఆరోపణల వ్యవహారం వెలుగులోకి వచ్చిన తర్వాత ఎమ్మెల్యే కూన రవికుమార్ తొలిసారి రియాక్ట్ అయ్యారు. అసలు జరిగింది ఏంటి? అన్నీ పూసగుచ్చి మరీ వివరించారు. తాను ఏ రకమైన వేధింపులు చేశాను? ఎప్పుడు చేశానని మీడియా ప్రశ్నిస్తే బాగుండేదన్నారు. శారీరక వేధింపులను అంటున్నారని, ఎప్పుడు, ఎక్కడ కలిశానని చెప్పాలన్నారు.
మానసిక వేధింపులను అంటున్నారని, ఎప్పుడైనా మాట్లాడితే తెలుస్తుందన్నారు. ప్రిన్సిపల్ సౌమ్య గురించి విద్యార్థులు, వారి తల్లిదండ్రుల నుంచి ఫిర్యాదులు వచ్చాయన్నారు. ఆ ఫిర్యాదులను జిల్లా అధికారులకు పంపించానన్నారు. అధికారులు విచారణ చేపట్టిన తర్వాత ట్రాన్సఫర్ చేశారన్నారు. తాను చెబితేనే ట్రాన్స్‌ఫర్ చేశారని అనుకుంటే ఎలాని సూటిగా ప్రశ్నించారు.
తానొక శాసనసభ్యుడని సమస్యలపై వచ్చిన ఫిర్యాదులను విచారణ చేయాలని అధికారులను ఆదేశించినట్టు చెప్పుకొచ్చారు. నిజమా? కాదా? అన్నది అధికారులు తేల్చుతారన్నారు. వైసీపీ నేతలతో కలిసి కుట్రలు పన్ని రోజుకో డ్రామాలు ఆడుతున్నట్లు వివరించారు. తాను ఏ రోజూ ఆమెతో మాట్లాడలేదన్నారు. రాత్రి ఏడు దాటితే ఏ ఒక్క అధికారిని తన ఆఫీసుకు పిలిపించనని తేల్చి చెప్పారు.
ALSO READ: బాబుకు ఝలక్.. ఆళ్ల నాని వైసీపీలకి వెళ్తున్నారా?
ఈ విషయంలో ఆమె ఆధారాలు చూపిస్తే బాగుంటుందన్నారు. ఆమె చేసిన ఆరోపణలు నిజమేనని నమ్మేస్తారా? పురుషులకు సమాజంలో రక్షణ లేదా? ఆమెదే క్యారెక్టరని, తనకు క్యారెక్టర్ లేదా? దీనిపై పోలీసుస్టేషన్‌కు వెళ్లి తాను ఫిర్యాదు చేయనున్నట్లు తెలిపారు. ఆమె చెప్పిన అన్నివిషయాలపై విచారణ చేయాలని కోరుతానన్నారు.
సౌమ్య, ఆమెకు సపోర్టు చేసిన నిలిచినవారిపైనా చర్యలు తీసుకుంటానని చెప్పకనే చెప్పారు. తన హక్కులకు భంగం కలిగే విధంగా చేసినందుకు పరువునష్టం దావా వేస్తానని హెచ్చరించారు. తాను అడిగిన ప్రశ్నలకు ఏమీ సమాధానం చెప్పలేదన్నారు. వీడియో కాన్ఫరెన్సులో మూడు నిమిషాల సేపు మాట్లాడనని గుర్తు చేశారు.
ఆ ఛానెల్ నిర్వహించిన డిబేట్‌లో పాల్గొన్న సదరు ఎమ్మెల్యే.. ప్రిన్సిపల్ మాట్లాడిన ఆడియో బయటపెట్టారు. మా జిల్లాలో ఇలాంటి వ్యవహారాలు చక్కబెట్టే నేతలు ఉన్నారన్నారు. ఎమ్మెల్యే మొదలు తనపై ఎలాంటి ఒత్తిడి తెచ్చినా బాగోదని ఆమె హెచ్చరించినట్టు ఆడియో ఉంది. తనపై ఆరోపణలు చేసినవారిపై ప్రివిలేజ్ కమిటీకి ఫిర్యాదు చేస్తున్నట్లు వెల్లడించారు.
బిగ్ టీవీతో టీడీపీ ఎమ్మెల్యే కూన రవికుమార్
KGVB ప్రిన్సిపాల్ సౌమ్య నాపై చేసిన ఆరోపణలన్నీ అవాస్తవం
ఆరోపణలు చేసినట్లు కాదు ఆధారాలు చూయించాలి
ఇప్పటివరకు నేను సౌమ్యని నేరుగా ఒక్కసారి కూడా కలవలేదు
రాత్రి 7 తర్వాత మహిళా అధికారులను నా కార్యాలయానికి రమ్మనను
ప్రజలు, విద్యార్థులు… https://t.co/IBP2JjvTyB pic.twitter.com/EWMQ8wwOnP
— BIG TV Breaking News (@bigtvtelugu) August 18, 2025