Phanindra Narsetti: తెలుగు ఫిలిం ఇండస్ట్రీ లో ఉన్న యంగ్ డైరెక్టర్స్ లో ఫణీంద్ర నరిశెట్టి ఒకరు. మధురం అనే షార్ట్ ఫిలిం తోనే అద్భుతమైన గుర్తింపును సాధించుకున్నాడు ఫణీంద్ర. ఆ రోజుల్లో ఆ షార్ట్ ఫిలిం ఒక సంచలనం అని చెప్పాలి. ఇప్పటికీ కూడా ఆ షార్ట్ ఫిలిం కి ఒక సపరేట్ ఫ్యాన్ బేస్ ఉంది. కేవలం ఆ షార్ట్ ఫిలిం వలనే మను అనే క్రౌడ్ ఫండెడ్ సినిమాను చేయగలిగాడు ఫణీంద్ర.
మను సినిమాతో తెలుగు ఫిలిం ఇండస్ట్రీకి దర్శకుడుగా ఎంట్రీ ఇచ్చాడు. ఈ సినిమా కమర్షియల్ సక్సెస్ సాధించలేదు. కానీ ఇప్పటికీ ఆ సినిమాకి సంబంధించి కొంతమంది అభిమానులు ఉన్నారు. ఇక రీసెంట్ గా 8 వసంతాలు సినిమాతో మరోసారి ప్రేక్షకులు ముందుకు వచ్చాడు ఫణీంద్ర. బాక్స్ ఆఫీస్ వద్ద ఈ సినిమా డీసెంట్ హిట్ గా నిలిచింది. ఊహించిన స్థాయిలో డబ్బులు రాకపోయినా కూడా విపరీతమైన ప్రశంసలు ఈ సినిమాకి వచ్చాయి. ఇప్పటికి చాలామంది ఈ సినిమాను ప్రశంసిస్తూ సోషల్ మీడియా వేదిక పోస్టులు పెడుతూ ఉంటారు.
అవార్డులు తీసుకోను
ఫణీంద్ర తీసిన 8 వసంతాలు సినిమా నెట్ఫ్లిక్స్ లో విడుదలైంది. ప్రస్తుతం ఈ సినిమాను పలువురు చూడడం మొదలుపెట్టారు. ఈ తరుణంలో పలు రకాల ఇంటర్వ్యూస్ లో పాల్గొంటున్నాడు ఫణీంద్ర. అయితే అవార్డ్స్ గురించి కొన్ని రకాల ఆసక్తికర కామెంట్స్ చేశాడు. నాది అమీర్ ఖాన్ దారి. ఒక సంఘం, ఒక వర్గం ఇచ్చిన అవార్డ్స్ ను నేను తీసుకోను. ప్రేక్షకులు కంటే అవార్డ్స్ ఏమీ గొప్పవి కావు. ఇప్పుడు కమలహాసన్ ఉన్నాడు. అతని ప్రతిభను మనం ఏ ఆస్కార్ అవార్డుతో కొలమానం చేయగలం. నాకు ఇష్టమైన డైరెక్టర్ క్రిస్టఫర్ నోలెన్ ఉన్నారు. అతనికి ఆస్కార్ వచ్చిందని నేను ఇష్టపడటం లేదు. ముందు నుంచి అతని వర్క్ నాకు ఇష్టం. అలానే ప్రేక్షకులు ముందు ఏవి ఎక్కువ కాదు. నేను అవార్డుల కంటే కూడా ప్రేక్షకుడికి ఎక్కువ గౌరవాన్ని ఇస్తున్నాను అంటూ తెలిపాడు.
రీసెంట్ టైమ్స్ లో వైరల్
ఫణీంద్ర విషయానికి వస్తే ఒకప్పుడు ఎవరికీ అందుబాటులో ఉండేవాడు కాదు. 8 వసంతాలు సినిమా ఇంటర్వ్యూలో మణిరత్నం సినిమాను చాలామంది కామెంట్ చేస్తున్నారు వాళ్లకు ఏం అర్హత ఉంది. అనే ఒక మాట వలన బాగా పాపులర్ అయిపోయాడు. అక్కడితో తనను అర్హత స్టార్ అనడం కూడా మొదలుపెట్టారు అని ఆ సినిమా ఈవెంట్ లో తెలిపాడు. ఆ తర్వాత ఒక ప్రముఖ జర్నలిస్ట్ కాశీలో రేప్ సీన్ పెట్టడం ఏంటి అని అడిగారు. ఆ ప్రెస్ మీట్ లో దర్శకుడు ఫణీంద్ర లేకపోవడం వలన తర్వాత పలు రకాల ఇంటర్వ్యూస్ లో క్లారిటీ ఇచ్చాడు. అక్కడితో ఫణీంద్ర బాగా ఫేమస్ అయ్యాడు. ఇప్పటికీ కూడా కొన్ని విషయాల్లో ఫణీంద్ర చేసిన కామెంట్స్ వైరల్ గా మారుతున్నాయి. అందులో ఈ అవార్డ్స్ కు సంబంధించిన విషయం కూడా ఒకటి.
Poyi ra Mawa Song : థియేటర్స్‌లో దుమ్ము లేపిన ‘పోయి రా మావా’ ఫుల్ వీడియో సాంగ్ వచ్చేసింది