BigTV English
Advertisement

OTT Movie : ఐఎండీబీలో 5.9 రేటింగే… కలెక్షన్లు మాత్రం 7000 కోట్లు… థియేటర్లలో దుమ్మురేపిన హాలీవుడ్ మూవీ ఓటీటీలోకి

OTT Movie : ఐఎండీబీలో 5.9 రేటింగే… కలెక్షన్లు మాత్రం 7000 కోట్లు… థియేటర్లలో దుమ్మురేపిన హాలీవుడ్ మూవీ ఓటీటీలోకి

OTT Movie : థియేటర్లలో బాక్స్ లు బద్దలు కొట్టిన ఓ హాలీవుడ్ సైన్స్ ఫిక్షన్ యాక్షన్ మూవీ ఓటీటీలో కి వస్తోంది. ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా కలెక్షన్ల పరంగా రికార్డ్ సృష్టించింది. 7600 కోట్లకుపైగా వసూలు చేసి దమ్మున్న సినిమా అని నిరూపించుకుంది. ఈ సినిమా పేరు అందరికీ సుపరిచితమే. దీని పేరు జురాసిక్ వరల్డ్ రీబర్త్. 1993లో తొలిసారి జురాసిక్ పార్క్ మూవీ వచ్చి అప్పట్లో ఒక సెన్సేషన్ అయింది. డైనోసర్ ని కంటికి రుచి చూపించిన మూవీ ఇది. ఆ తర్వాత మరో ఆరు సినిమాలు ఈ ఫ్రాంఛైజీ నుంచి వచ్చాయి. చివరి సారిగా వచ్చిన మూవీ జురాసిక్ వరల్డ్ రీబర్త్. ఈ సినిమా ఈ ఏడాది జులై 2న థియేటర్లలో రిలీజ్ అయింది. నాలుగు నెలల తర్వాత ఇప్పుడు ఓటీటీలోకి స్ట్రీమింగ్ కు వస్తోంది. ఈ సినిమా ఏ ఓటీటీలోకి రాబోతోంది ? దీని కథ ఏమిటి ? అనే వివరాల్లోకి వెళ్తే ..


ఏ ఓటీటీలో స్ట్రీమింగ్ అంటే

‘జురాసిక్ వరల్డ్ రీబర్త్’ మూవీని గారెత్ ఎడ్వర్డ్స్ డైరెక్ట్ చేశాడు. ఇందులో స్కార్లెట్ జాన్సన్, మహర్షల అలీ, జొనాథన్ బెయిలీ, రూపర్ట్ ఫ్రెండ్ ప్రధాన పాత్రల్లో నటించారు. ఈ సినిమా 2025 జులై 2న థియేటర్లలో రిలీజైంది. ఇది 2022 లో వచ్చిన ‘Jurassic World Dominion’ సినిమాకి సీక్వెల్. ఇప్పటికే ఈ మూవీ అమెజాన్ ప్రైమ్ వీడియోలో రెంటల్ విధానంలో స్ట్రీమింగ్ అవుతోంది. అయితే నవంబర్ 14 నుంచి జియో హాట్‌స్టార్ ఓటీటీలో తెలుగు, తమిళం, హిందీ భాషల్లో ఫ్రీ గా స్ట్రీమింగ్ కానుంది. అయితే ఇన్ని కోట్లు వసూలు చేసిన ఈ సినిమాకి ఐఎండీబీలో 5.9 రేటింగే ఉండటం విశేషం.

Read Also : ఫ్రెండ్స్ తో గర్ల్ ఫ్రెండ్ ను పంచుకునే సైకో… ముగ్గురూ కలిసి ఒకే అమ్మాయితో… ఆ పిల్ల రివేంజ్ చూస్తే గూస్ బంప్స్


స్టోరీలోకి వెళ్తే

ఈ స్టోరీ ‘Jurassic World Dominion’ 5 సంవత్సరాల తర్వాత మొదలవుతుంది. ప్రపంచంలో డైనోసార్స్ దాదాపు అంతమవుతుంటాయి. మోడరన్ వాతావరణం వాటికి సరిపోవడం లేదు. లాస్ట్ డైనోసార్స్ ఒక దూరపు ప్రాంతంలో ఉండే ఐలాండ్‌లో ఉంటాయి. అది పాత Jurassic Park ల్యాబ్ సైట్. అందులోకి జోరా అనే స్పెషల్ ఆపరేషన్స్ లీడర్, Dr. Henry అనే డైనో ఎక్స్‌పర్ట్, Duncan అనే ఎక్స్-మిలిటరీ మ్యాన్ టీమ్‌గా ఐలాండ్‌కి వెళ్తారు. ఇప్పడు వీళ్ళ ముందు ఉన్న లక్ష్యం 3 పెద్ద డైనోసార్స్ (టైటానోసారస్, స్పినోసారస్, మ్యూటెంట్ T-Rex) నుండి DNA తీసుకోవడం. ఎందుకంటే ఆ డైనో DNAతో క్యాన్సర్ లాంటి డిసీజెస్ క్యూర్ చసే మెడిసన్ తయ్యారు చేయవచ్చని తెలుసుకుంటారు. ఇప్పుడ ఐలాండ్‌లో డైనోసార్స్ మరింత డేంజరస్ గా ఉంటాయి. ఈ టీమ్ DNA తీసుకోవడానికి ట్రై చేస్తుంది. కానీ డైనోసార్స్ దాడి చేస్తాయి. ఇంతలో ఒక ఫార్మా కంపెనీ డైనోసార్స్‌ను DNA ని ఇల్లీగల్ పనులకు ఉపయోగిస్తున్నట్లు తెలుస్తుంది. దీంతో టీమ్ మధ్య గొడవలు మొదలవుతాయి. చివరికి డైనోసార్స్‌ DNA ని ఆ ఫార్మా కంపెనీ దక్కించుకుంటుందా ? ఈ క్లైమాక్స్ ఎలా ఉంటుంది ? అనే విషయాలను, హాలీవుడ్ సైన్స్ ఫిక్షన్ యాక్షన్ మూవీని చూసి తెలుసుకోండి.

 

Related News

Dude OTT: ఓటీటీ విడుదలకు సిద్ధమైన డ్యూడ్.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?

OTT Movie : పెళ్ళైన వాడితో పాల గ్లాసు యవ్వారం… హెబ్బా పటేల్ లేటెస్ట్ రొమాంటిక్ థ్రిల్లర్

OTT Movie : మర్డర్ మిస్టరీ నుంచి సూపర్ హీరో దాకా… ఈ వారం ఒక్కో ఓటీటీలో ఒక్కో జానర్లో మోస్ట్ అవైటెడ్ తమిళ థ్రిల్లర్లు

OTT Movie : ఒంటరి పిల్ల ఒంటిపై చెయ్యేసి పాడు పని… ట్విస్టులతో మతిపోగొట్టే మలయాళ మూవీ

OTT Movie : పొలిటీషియన్ కూతురి మర్డర్ కు స్కెచ్… క్రైమ్ – కామెడీ కలగలిసిన ఇంట్రెస్టింగ్ డార్క్ కామెడీ థ్రిల్లర్

Thalavara OTT: బొల్లి వ్యాధితో బాధపడే హీరో.. అవమానాలు.. ఛీత్కారాలు.. కట్ చేస్తే!

Kantara 1 OTT: థియేటర్లలో ఉండగానే ఓటీటీకి కాంతార 1.. కారణం చెప్పిన నిర్మాత

Big Stories

×