Ram Gopal Varma : టాలీవుడ్ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ గురించి ప్రత్యేకంగా పరిచయాలు అవసరం లేదు. ఒకప్పుడు వరుసగా హిట్ సినిమాలను తెరకెక్కించిన ఈయన ఈ మధ్య వరుస విభాగాలతో ఇరుక్కుంటున్నారు.. తనకు సంబంధం లేని విషయాల్లో కూడా తల దురుస్తూ నిత్యం వాత్రలో నిలుస్తూ వస్తున్నాడు రాంగోపాల్ వర్మ. ఇటీవల రాజకీయాల్లో కూడా ఈయన విమర్శలు చేయడం మొదలుపెట్టాడు. రాజకీయ నాయకులకు కూడా నేరుగా కౌంటర్ లిస్టు సోషల్ మీడియాలో పోస్ట్లు పెడుతూ వస్తున్నాడు. ఇప్పటికే ఈ విషయాలపై ఎన్నోసార్లు ఆయనపై పోలీస్ కేసులు కూడా నమోదైన విషయం తెలిసిందే. తాజాగా మరోసారి ఆయనపై పోలీస్ కేసు నమోదు అయింది. అందుకు కారణం హిందూ దేవుళ్ళపై ఆయన చేసిన అనుచిత వ్యాఖ్యలే.. అసలు ఏం జరిగింది. ఎందుకు వర్మపై పోలీస్ కేసు నమోదయింది అన్నది ఇప్పుడు మనం వివరంగా తెలుసుకుందాం..
సినీ వివాదాస్పద దర్శకుడు రాంగోపాల్ వర్మ పై తూర్పు గోదావరిలో పోలీస్ కేసు నమోదు అయ్యింది. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న రామ్ గోపాల్ వర్మ హిందూ దేవుళ్ళపై, ఇండియన్ ఆర్మీ ని, ఆంధ్రులను దూషించేలా మాట్లాడాడు. ఇంటర్వ్యూ వీడియో వైరల్ అవడంతో రాంగోపాల్ వర్మపై హిందువులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అలాంటి మాటలు మాట్లాడిన వ్యక్తిపై కఠిన చర్యలు తీసుకోవాలని రాజమండ్రి త్రీ టౌన్ పోలీస్ స్టేషన్ లో రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు మేడా శ్రీనివాస్ ఫిర్యాదు పై కేసు నమోదు చేశారు.. అంతేకాదు అతనిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.
Also Read: ‘కే ర్యాంప్’ ట్విట్టర్ రివ్యూ.. కిరణ్ అబ్బవరంకి మరో హిట్ పడినట్లేనా..?
రాంగోపాల్ వర్మ ఇంటర్వ్యూ తీసుకున్న యాంకర్ స్వప్న పై కూడా కేసు నమోదు అయినట్లు తెలుస్తుంది. వెంటనే వారిద్దరిని అరెస్ట్ చేయాలంటూ ఫిర్యాదులు పేర్కొన్నారు.. 487/2025, U/s 196 (1), 197(1) 353, 354,299 R/w (3) Bns Act, కింద కేసు నమోదు అయ్యింది..
వెంటనే వీరిద్దరినీ అదుపులోకి తీసుకొని క్షమాపణ చెప్పించాలంటూ వాళ్ళు డిమాండ్ చేస్తున్నారు.. తనపై ఇలాంటివి గతంలో ఎన్నో కేసులు నమోదయ్యాయి. కానీ రాంగోపాల్ వర్మ మాత్రం వీటిని పెద్దగా పట్టించుకున్నట్లు లేదు. మరి ఇప్పుడు హిందువులకు ఆగ్రహం తెప్పించిన ఈ ఘటనపై కేసు నమోదయింది. ఈ ఇష్యు పై ఆర్జీవి ఎలా రియాక్ట్ అవుతారు చూడాలి.. ఏమైనా సరే వర్మపై మరోసారి కేసు నమోదవడంతో టాలీవుడ్ ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది..