ఇవాళ ఉదయం ఓ చైనీస్ విమానంలో మంటలు చెలరేగగా, మధ్యాహ్నం సమయంలో బంగ్లాదేశ్ విమనాశ్రయంలో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదం ధాటికి ఎయిర్ పోర్టు అంతా దట్టమైన పొగలు కమ్ముకున్నాయి. ఈ నేపథ్యంలో అన్ని విమాన సర్వీసులను నిలిపివేస్తున్నట్లు ఎయిర్ పోర్టు అధికారులు వెల్లడించారు. ప్రస్తుతం మంటలను అదుపు చేసేందుకు అగ్నిమాపక సిబ్బంది ప్రయత్నాలు చేస్తున్నట్లు చెప్పారు. మంటలు కంట్రోల్ అయ్యాక విమాన రాకపోకలపై నిర్ణయం తీసుకుంటామని అధికారులు తెలిపారు.
బంగ్లాదేశ్ రాజధాని ఢాకాలోని హజ్రత్ షాజలాల్ అంతర్జాతీయ విమానాశ్రయంలోని కార్గో టెర్మినల్ లో ఇవాళ(శనివారం) మధ్యాహ్నం భారీ అగ్నిప్రమాదం సంభవించడంతో అధికారులు అన్ని విమాన కార్యకలాపాలను నిలిపివేశారు. దిగుమతి చేసుకున్న వస్తువులను నిల్వ చేసే విమానాశ్రయంలోని కార్గో విలేజ్ లో 2:30 గంటల ప్రాంతంలో మంటలు చెలరేగాయి. ఒక్కసారిగా మంటలు విజృంభించాయి. ఈ మంటల ధాటికి కార్గో విలేజ్ లోని వస్తువులన్నీ కాలిపోయాయి. ఎయిర్ పోర్టు అంతటా మంటల ధాటికి దట్టమైన నల్లటి పొగలు కమ్ముకున్నాయి. విమానాశ్రయంలో జరిగిన అగ్ని ప్రమాద స్థలాన్నిఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఎండీ మసుదుల్ హసన్ మసుద్ పరిశీలించారు. మంటలను ఆర్పేందు అత్యవసర చర్యలు తీసుకుంటున్నట్లు వెల్లడించారు.
ఇంటర్ సర్వీసెస్ పబ్లిక్ రిలేషన్స్ (ISPR) వెల్లడించిన వివరాల ప్రకారం.. బంగ్లాదేశ్ పౌర విమానయాన అథారిటీ, అగ్నిమాపక సర్వీస్, బంగ్లాదేశ్ వైమానిక దళానికి చెందిన రెండు అగ్నిమాపక విభాగాలు ఎయిర్ పోర్టులో మంటలను అదుపులోకి తెచ్చేందుకు ప్రయత్నిస్తున్నాయి. మంటలను అదుపు చేయడంలో సహాయపడటానికి నేవీ కూడా ఈ ఆపరేషన్ లో చేరిందని మీడియా వెల్లడించింది. ఈ అగ్ని ప్రమాదం నేపథ్యంలో ప్రస్తుతం, అన్ని ల్యాండింగ్‌లు, టేకాఫ్‌లు నిలిపివేయబడ్డాయని ఎయిర్ పోర్టు అధికారులు తెలిపారు. పరిస్థితిని నిశితంగా పరిశీలిస్తున్నట్లు తెలిపారు. అగ్నిప్రమాదం అదుపులోకి వచ్చిన తర్వాత, దీనికి కారణం ఏంటి? ఎంతమేర నష్టం జరిగింది? అనే విషయాల మీద క్లారిటీ వస్తుందని వెల్లడించారు.
Massive fire at Hazrat Shahjalal International Airport, Dhaka.
This is baaaad. May Allah save Bangladesh pic.twitter.com/rJTN2Yl23a
— TPS (@thepeaceseekr) October 18, 2025
Right Now in Hazrat Shahjalal International Airport 🙂🙂🤕
📌 18 October,2025 pic.twitter.com/x5RPrKeRSD
— Arafath (@Arafath023) October 18, 2025
Read Also: గాల్లో ఉండగా విమానంలో మంటలు, భయంతో వణికిపోయిన ప్రయాణీకులు!