Samantha: సినీనటి సమంత(Samantha) ఇటీవల సినిమాలను కాస్త తగ్గించిన ఈమె క్రేజ్ మాత్రం తగ్గలేదని చెప్పాలి. ప్రస్తుతం సమంత పలు వెబ్ సిరీస్ లలో నటిస్తూ బిజీగా ఉన్నారు. అలాగే మా ఇంటి బంగారం అనే సినిమా షూటింగ్ పనులను కూడా త్వరలోనే ప్రారంభించబోతున్నట్లు ఇటీవల వెల్లడించారు.. ఇక సమంత ప్రస్తుతం ఇండస్ట్రీలో నటిగా మాత్రమే కాకుండా నిర్మాతగా కూడా కొనసాగుతున్న విషయం తెలిసిందే. ఇప్పటికే ఈమె నిర్మాణ సంస్థ నుంచి శుభం అనే సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇలా కెరియర్ పరంగా బిజీగా ఉండే సమంత సోషల్ మీడియాలో కూడా చాలా యాక్టివ్ గా ఉంటూ తనకు సంబంధించిన ప్రతి ఒక్క విషయాన్ని కూడా అభిమానులతో పరుచుకుంటారు.
తాజాగా సమంత ఢిల్లీలో ఎన్డీటీవీ నిర్వహించిన వరల్డ్ సమ్మిట్ లో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా సమంత తన వ్యక్తిగత విషయాల గురించి అభిమానులతో ఆసక్తికరమైన విషయాలను పంచుకున్నారు. సమంత వ్యక్తిగత జీవితం అలాగే వృత్తిపరమైన జీవితం ఒక తెరిచిన పుస్తకం లాంటిదని చెప్పాలి. ఈమెకు సంబంధించిన అన్ని విషయాలు ప్రేక్షకులు, అభిమానుల సమక్షంలోనే జరిగాయి. అయితే తాజాగా ఈ విషయం గురించి సమంత ఈ కార్యక్రమంలో మాట్లాడుతూ…నా జీవితంలో అన్ని విషయాలు ప్రజల సమక్షంలోనే జరిగాయని తెలియజేశారు.
నా పెళ్లి, విడాకులు(Divorce), అనారోగ్య సమస్యలు అన్ని పబ్లిక్ గానే జరిగాయి. ఆ సమయంలో నేను ఎన్నో ఇబ్బందులను ఎదుర్కొన్నాను. అదేవిధంగా ఆ సమయంలో నా గురించి ప్రతి ఒక్కరు వారికి తోచిన విధంగా జడ్జిమెంట్ ఇచ్చారని సమంత తెలిపారు. అయితే ఇలాంటి విషయాల్లో నేను కూడా ఎన్నో తప్పులు చేశాను ప్రతి విషయంలో నేను పర్ఫెక్ట్ అని చెప్పడం లేదని సమంత వెల్లడించారు. ఇలా నేను చేసిన తప్పుల నుంచి గుణపాఠం నేర్చుకొని ప్రస్తుతం బెటర్ గా ఉన్నాను అంటూ సమంత ఈ సందర్భంగా తన వ్యక్తిగత విషయాల గురించి చేసిన ఈ కామెంట్స్ ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి.
అలాంటి వ్యక్తిని ఎంపిక చేసుకోండి..
ఇక ఈ కార్యక్రమంలో భాగంగా మీ అభిమానులు కెరియర్ లేదా రిలేషన్షిప్ ఈ రెండింటిలో ఏదో ఒకటి ఎంపిక చేసుకోమంటే మీరు దేనిని ఎంపిక చేసుకుంటారనే ప్రశ్న కూడా ఎదురయింది. ఈ ప్రశ్నకు సమంత సమాధానం చెబుతూ.. కెరియర్, రిలేషన్షిప్ లో ఏది కావాలో మీరు ఎంపిక చేసుకోవాల్సిన పనిలేదని తెలిపారు. మీ లక్ష్యాలను, మీ అభిప్రాయాలను గుర్తించి ప్రోత్సహించే వ్యక్తిని ఎంచుకోండి అంటూ సలహా ఇస్తానని ఈమె చెప్పడంతో ఈ కామెంట్స్ కాస్త వైరల్ అవుతున్నాయి. ఇలాంటి వ్యక్తిని ఎంపిక చేసుకొనే విషయంలో సమంత పూర్తిగా ఫెయిల్ అయ్యానని ఈ సందర్భంగా చెప్పకనే చెప్పేశారు. ఏది ఏమైనా సమంత తన వ్యక్తిగత జీవితం గురించి ఇలా పబ్లిక్ గా చేసిన ఈ కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ప్రస్తుతం సమంత నాగచైతన్యకు విడాకులు ఇచ్చిన తర్వాత మరొక దర్శకుడు రాజ్ నిడుమోరి(Raj Nidumori)తో రిలేషన్ లో ఉన్నట్టు వార్తలు వస్తున్నాయి కానీ ఈ వార్తలపై ఈమె ఎక్కడ స్పందించలేదు.
Also Read: Radhika -Sarath Kumar: రాధిక గొప్పనటి..కానీ గుర్తింపు లేదు.. శరత్ కుమార్ కామెంట్స్ వైరల్!