OTT Movie : క్రైమ్ థ్రిల్లర్ జానర్ లో వస్తున్న సినిమాలు ఇప్పుడు బాగా ట్రెండ్ అవుతున్న విషయం తెలిసిందే. వీటిని ఆడియన్స్ కూడా ఇంట్రెస్టింగ్ గా చూస్తున్నారు. ఎప్పుడు ఏం జరుగుతుందో అనే టెన్షన్ తో, ఈ సినిమాలను చూస్తూ ఎంటర్టైన్ అవుతుంటారు ప్రేక్షకులు. ఇక సీరియల్ కిల్లర్ సినిమాల విషాయానికి వస్తే, ఈ సినిమాలు నెక్స్ట్ లెవెల్ లో ఉంటాయి. ఇప్పుడు మనం చెప్పుకోబోయే సినిమాలో కిల్లర్, ఒక రచయిత నవల ఆధారంగా హత్యలు చేస్తుంటాడు. ఈ సినిమా రీసెంట్ గానే ఓటీటీలో అడుగు పెట్టింది. దీని పేరు ఏమిటి ? ఏ ఓటీటీలో ఉంది ? అనే వివరాల్లోకి వెళ్తే.
‘ముథల్ పక్కం’ (Muthal Pakkam) ఒక తమిళ క్రైమ్ థ్రిల్లర్ సినిమా. అనీష్ ఆష్రఫ్ దీనికి దర్శకత్వం వహించారు. ఇందులో వేట్రి సుడ్లే, షిల్పా మంజునాథ్, మాగేష్ దాస్, తంబి రామయ్య ప్రధాన పాత్రల్లో నటించారు. ఈ సినిమా 2025 ఆగస్ట్ 1న థియేటర్లలో విడుదల అయింది.
అక్టోబర్ 17 నుంచి ఆహా తమిళ్ లో స్ట్రీమింగ్ కి వచ్చింది. దీనికి IMDbలో 8.1/10 రేటింగ్ ఉంది.
చెన్నైలో ఫేమస్ క్రైమ్ నవల రైటర్ ఒక రోజు అనుమానస్పద స్థితిలో మరణిస్తాడు. దీంతో అతని కొడుకు విక్రమ్ చెన్నైకు వస్తాడు. తన తండ్రి మరణం తర్వాత విక్రమ్ షాక్‌లోకి వెళ్తాడు. ఆతరువాత తన తండ్రి రాసిన నవలలు రియల్ లైఫ్ ఇన్‌స్పిరేషన్ అని తెలుస్తుంది. ఇక్కడ మరో క్రైమ్ మొదలవుతుంది. సీరియల్ మర్డర్స్ జరుగుతుంటాయి. పోలీస్ ఇన్స్పెక్టర్ బంబుల్ ఈ కేస్‌ను సాల్వ్ చేయలేకపోతాడు. విక్రమ్ తన స్కిల్స్ యూజ్ చేసి, కిల్లర్ ని పట్టుకోవడానికి ఇన్స్పెక్టర్‌కు హెల్ప్ చేస్తాడు.
Read Also : అమాయకులు అనుకున్నారా అడ్డంగా బుక్.. భలే కేడీలు ఈ తాతా మనవడు.. ఫ్యామిలీ అంతా కలిసి చూడాల్సిన మూవీ