Trump on AFG vs PAK: ప్రపంచంలో ఏ దేశాల మధ్య ఉద్రిక్తతలు తలెత్తినా.. నేనున్నానంటున్నారు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్. యుద్ధం ఆపేస్తా, లక్షల మంది ప్రాణాలు కాపాడేస్తాను అంటున్నారు. తాజాగా ఆయన ఆఫ్ఘనిస్థాన్, పాకిస్తాన్ మధ్య వివాదంపై స్పందించారు. పాక్-ఆఫ్ఘన్ దేశాల మధ్య వివాదాన్ని పరిష్కరించాల్సి వస్తే అది తనకు చాలా “సులభమైన” పని అన్నారు.
శుక్రవారం ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీతో ద్వైపాక్షిక సమావేశం సందర్భంగా ప్రెసిడెంట్ ట్రంప్ మీడియాతో మాట్లాడారు. “పాకిస్తాన్ దాడి చేసిందో లేదా ఆఫ్ఘనిస్తాన్‌తో దాడి నాకు అర్థమైంది. వారి సమస్యను పరిష్కరించుకోవాల్సి వస్తే అది నాకు చాలా సులభం” అని ట్రంప్ అన్నారు. మరోసారి లక్షలాది మంది ప్రాణాలను కాపాడి, ఆఫ్ఘనిస్తాన్, పాకిస్తాన్ మధ్య వివాదాన్ని పరిష్కరించడంలో విజయం సాధిస్తానన్నారు.
“ప్రజలు ప్రాణాలు కాపాడడం నాకు ఇష్టం. నేను లక్షలాది మంది ప్రాణాలను కాపాడాను. ఈ యుద్ధంలో మనం విజయం సాధిస్తామని నేను భావిస్తున్నాను” అని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ పేర్కొన్నారు.
ఆఫ్ఘనిస్తాన్‌లోని ఉగ్రవాద స్థావరాలను లక్ష్యంగా చేసుకుని పాకిస్తాన్ తాజాగా వైమానిక దాడులకు పాల్పడింది. దీంతో కాల్పుల విరమణను పాకిస్తాన్ ఉల్లంఘించినట్లైంది. ఇటీవల ఇరుదేశాల మధ్య తాత్కాలిక కాల్పుల విరమణ అంగీకారం కుదిరింది. అయితే పాక్ తన వక్రబుద్ధిని మరోసారి నిరూపించుకుంటూ ఆప్ఘన్ పై ఎయిర్ అటాక్ చేసింది. దీంతో దోహాలో జరగనున్న కాల్పుల విరమణ చర్చలపై నీలి నీడలు ఏర్పడ్డాయి.
ఇస్లామాబాద్, కాబూల్ మధ్య రెండు రోజుల కాల్పుల విరమణను పొడిగించిన కొద్ది గంటల తర్వాత, పాక్ వైమానిక దాడులు ప్రారంభించిందని డాన్ పత్రిక శనివారం తెలిపింది.
"Pakistan attacked.. Afghanistan. Easy one for me to solve it..", says US President Donald Trump pic.twitter.com/vpXBZk6M84
— Sidhant Sibal (@sidhant) October 17, 2025
ఎనిమిది యుద్ధాలను ఆపినప్పటికీ నోబెల్ శాంతి బహుమతి దక్కకపోవడంపై అమెరికా అధ్యక్షుడు ట్రంప్ మరోసారి నిరాశ వ్యక్తం చేశారు. “నేను ఎనిమిది యుద్ధాలను ఆపానని మీకు తెలుసు, నేను ఇలా చెబితే ఫన్నీగా ఉంది. లాభం పొందిన తర్వాత, ప్రజలు దాని గురించి మరచిపోతారు” అని ట్రంప్ అన్నారు.
Also Read: Donald Trump: పాక్ డబ్బులకు ఆశపడి.. ట్రంప్ ఇండియా-అమెరికా సంబంధాలు దెబ్బతీశాడా?
“నేను ఒక సమస్యను పరిష్కరించిన ప్రతిసారీ, ఇంకో సమస్యను పరిష్కరిస్తే, మీకు నోబెల్ బహుమతి వస్తుందని చెబుతున్నారు. నాకు నోబెల్ బహుమతి రాలేదు. చాలా మంచి మహిళ ఆ బహుమతి అందుకున్నారు. ఆమె ఎవరో కూడా నాకు తెలియదు. నేను ప్రజల ప్రాణాలను కాపాడటం గురించి మాత్రమే ఆలోచిస్తారు” అని ట్రంప్ అన్నారు.