Hero Vishal Start PodCost: హీరో విశాల్ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. తమిళ్, తెలుగులో ఎన్నో చిత్రాల్లో నటించి స్టార్ హీరోగా గుర్తింపు పొందారు. ముఖ్యంగా యాక్షన్ సీన్స్‌లో విశాల్ పర్ఫామెన్స్ నెక్ట్స్ లెవెల్ అనేట్టుగా ఉంటాయి. అయితే చాలా మంది హీరోలు యాక్షన్ సీన్స్‌ని డూప్తో చేస్తుంటారనే విషయం తెలిసిందే. చిన్న చిన్న ఫైట్ సీన్స్‌ని వారే స్వయంగా చేసుకుంటారు. కానీ, కాస్తా బిగ్ ఫైట్ అయితే మాత్రం డూప్ని పెట్టుకుంటారు. అయితే విశాల్ మాత్రం యాక్షన్ సీన్స్ కూడా స్వయంగా చేస్తారు. ఎంతపెద్ద స్టంట్, యాక్షన్ అయినా తనే స్వయంగా నటిస్తాడు.
ఒకప్పుడు బ్యాక్ టూ బ్యాక్ సినిమాలతో అలరించిన విశాల్ ప్రస్తుతం సినిమాలు చాలా తగ్గించాడు. నిర్మాతగా మారి మూవీస్ నిర్మిస్తున్నారు. అయితే ఈ మధ్య తరచూ ఆయన వివాదాల్లో నిలుస్తున్న సంగతి తెలిసిందే. ఇదిలా ఉంటే త్వరలోనే విశాల్ కొత్త జీవితం ప్రారంభించబోతున్నాడు. నటి సాయి ధన్సికతో ఏడడుగులు వేయబోతున్నాడు. ఇటీవల ఆమెను నిశ్చితార్థం చేసుకున్న విశాల్ ఎప్పుడెప్పుడు పెళ్లి కబురు చెబుతాడా అని ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ క్రమంలో విశాల్ ఓ గుడ్‌న్యూస్ చెప్పాడు. పెళ్లి కంటే ముందు మరో కొత్త జర్నీ మొదలుపెట్టబోతున్నాడ. త్వరలోనే ‘యువర్స్ ఫ్రాంక్లీ విశాల్’ పేరుతో పాడ్‌కాస్ట్ స్టార్ట్ చేయబోతున్నాడు. ఈ విషయం చెబుతూ తన గురించి పలు ఆసక్తికర విషయాలను పంచుకున్నాడు.
ఇందుకు సంబంధించిన ప్రొమోని తాజాగా విడుదల చేశాడు. ఈ ప్రోమోలో విశాల్ మాట్లాడుతూ.. “ఇప్పటి వరకు నేను నా ఏ సినిమాల్లోనూ డూప్ లేకుండ నటించారు. కష్టమైన స్టంట్, ఫైయిల్ సీన్స్‌లోనూ నేనే స్వయంగా నటించారు. అందువల్ల తరచూ నేను ప్రమాదాల బారిన పడేవాడిని. దీంతో నా శరీరానికి దాదాపు 119 కుట్లు పడ్డాయి‘ అంటూ చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం విశాల్ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. ఇది చూసి అతడి ఫ్యాన్స్ అంతా షాక్ అవుతున్నారు. ఇండస్ట్రీలో ఇలాంటి గొప్ప నటులు అరుదుగా ఉన్నారని, అందులో విశాల్ మొదటి వరుసలో ఉన్నాడంటూ అతడిపై ప్రశంసలు కురిపిస్తున్నాయి. సినిమా పట్ల అతడి డెడికేషన్కు ఈ మాటలే నిదర్శనమంటూ కొనియాడుతున్నారు.
Also Read: Pavala Shyamala: ప్రముఖ నటి దీనస్థితి.. తీవ్ర అనారోగ్యంతో ఆస్పత్రిలో చేరిన పావల శ్యామల
ఇదిలా ఉంటే ఈ ఏడాదితో విశాల్ ఇండస్ట్రీలో 21 సంవత్సరాలు పూర్తి చేసుకున్నారు. ఇటీవల ఆయన 21ఏళ్ల సెలబ్రేషన్స్ కూడా జరుపుకున్నాడు. 2004 సెప్టెంబర్ 10న విడుదలైన ‘చెల్లమే’ చిత్రంతో ఆయన నటుడిగా అడుగుపెట్టారు. ఈ సందర్భంగా ఆయన తన అభిమానులకు, శ్రేయోభిలాషులకు కృతజ్ఞతలు తెలుపుతూ ఒక ప్రకటన విడుదల చేశారు. తన ఎదుగుదలకు కారణమైన తల్లిదండ్రులు, గురువు యాక్షన్ కింగ్ అర్జున్, దర్శకులు, నిర్మాతలు, సాంకేతిక నిపుణులు, మీడియా మిత్రులకు పేరు పేరునా విశాల్ ధన్యవాదాలు తెలిపారు. అభిమానుల ప్రేమ, ప్రోత్సాహమే తనను నడిపిస్తున్న బలమని తన పోస్టులో పేర్కొన్నారు.