Preston College Students: జనగామ పట్టణంలోని ప్రెస్టన్ జూనియర్ కాలేజ్‌లో విద్యార్థుల మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. సీనియర్లు తమకు గౌరవం ఇవ్వడం లేదని ఫస్ట్ ఇయర్ విద్యార్థులుపై దాడి చేశారు. సీనియర్లు జూనియర్లను చితకబాదడంతో పాటు, దాడి తీవ్రతకు బట్టలు చిరిగిపోయేలా ఒకరిపై ఒకరు దాడి చేసుకున్నారు. ఈ ఘటనలో ఇద్దరు జూనియర్ విద్యార్థులకు గాయాలు అయ్యాయి.
పొట్టు పొట్టు కొట్టుకున్న ఇంటర్ విద్యార్థులు..
ప్రస్తుతం ఈ ఘటనకు సంబంధించిన వీడియో దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. వీడియోలో క్లాస్ రూమ్‌లో యూనిఫాం ధరించిన విద్యార్థులు ఒకరినొకరు కొట్టుకుంటూ, పంచ్‌లు, కిక్‌లతో దాడి చేస్తున్న దృశ్యాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. సీనియర్లు గ్రూపుగా జూనియర్లపై పడి, తీవ్రంగా హింసాత్మకంగా వ్యవహరించినట్లు తెలుస్తోంది.
గౌరవం ఇవ్వడం లేదని కొట్టడం ఎంట్రా..
తెలంగాణలో గత కొన్ని నెలలుగా ఇలాంటి ర్యాగింగ్ సంఘటనలు బాగా పెరుగుతున్నాయి.. ముఖ్యంగా ఇంటర్, డిగ్రీ స్థాయిలో.. ఈ ఘటనలు జరుగుతున్నాయి. అయితే, ఈ ప్రత్యేక ఘటనలో సీనియర్లు “గౌరవం” పేరుతో దాడి చేయడం ఆందోళనకరం. కాలేజ్ యాజమాన్యం ఇంకా అధికారికంగా స్పందించలేదు, కానీ విద్యార్థుల తల్లిదండ్రులు, స్థానికులు తీవ్రంగా ఖండిస్తున్నారు.
Also Read: నిజామాబాద్‌లో దారుణం.. కానిస్టేబుల్‌ను పొడిచి పొడిచి చంపిన దొంగ..!
ఇద్దరు జూనియర్ విద్యార్థులకు గాయాలు
గాయపడిన ఇద్దరు జూనియర్లు స్థానిక ఆసుపత్రులలో చికిత్స పొందుతున్నట్లు తెలిపారు. విద్యార్థులు, తల్లిదండ్రులు.. ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు చేపట్టాలని, నిందితులపై చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు..
కాలేజీలో విద్యార్థుల ఘర్షణ..
జూనియర్లను చితకబాదిన సీనియర్లు
జనగామ టౌన్ లోని ప్రెస్టన్ జూ.కాలేజీలో ఘటన
ఇంటర్ ఫస్ట్ ఇయర్ విద్యార్థులు తమకు గౌరవం ఇవ్వడం లేదని దాడి చేసిన సెకండ్ ఇయర్ విద్యార్థులు
దాడిలో గాయపడ్డ ఇద్దరు జూనియర్ ఇంటర్ విద్యార్థులు pic.twitter.com/ocCiBVI5mO
— BIG TV Breaking News (@bigtvtelugu) October 17, 2025