Pavala Shyamala Hospitalised: వృద్ధాప్యం జీవితం అంటే అన్ని భారాలు పోయి హ్యాపీ జీవించడం. పెళ్లి , పిల్లలు అంటూ అరవై ఏళ్లు కష్టపడ్డ వారు బాధ్యతలన్ని తీరి విశ్రాంతి తీసుకునే వయసు ఇది. ఇంట్లో అయిన అనాథాశ్రమమైన వయసు పైబడిన వారు జీవితమిది. కానీ, నటి పావలా శ్యామల జీవితం ఇది కాదు. వృద్ధాప్యంలో కూడా ఆమెను బాధ్యతలు, కష్టాలు, ఆర్థిక పరిస్థితులు వెంటాడుతుననాయి. ఆమె దీన పరిస్థితి గురించి తెలిసిందే. వృద్ధాప్యంలో ఉన్న ఆమెను కష్టాలను, ఆర్థిక పరిస్థితులు వెంటాడుతున్నాయి. దీంతో తరచూ ఆమె ఆర్థిక సాయిం కావాలని అర్థిస్తున్నారు.
అయితే కొంతమంది ఇండస్ట్రీ ప్రముఖుల స్పందించి తోచినంత చేయూత ఇస్తున్నారు. కానీ, అవి ఆమె పరిస్థితిని మార్చలేకపోతున్నాయి. కొంతకాలానికి మళ్లీ ఆర్థిక సాయం కోసం ఎదురుచూడాల్సిన పరిస్థితులు వస్తున్నాయి. కోంతకాలంగా ఇదే రిపీట్ అవుతుంది. అద్దె ఇంట్లో ఉంటున్న ఆమె ఇటీవల అనాథాశ్రమానికి మారింది. వృద్ధాప్యంతో కనీసం నిలిచిన కూడా నిలబడలేని ఆమెకు కూతురి బాధ్యత ఉంది. ఈ వయసులో ఒకరి సపోర్టు తీసుకోవాల్సిన శ్యామల.. తన ఫిజికల్లీ ఛాలెంజ్డ్ కూతురికి అండగా ఉండాల్సిన పరిస్థితి. ప్రస్తుతం కూతురితో కలిసి అనాథాశ్రమంలో ఉంటున్న శ్యామల ఆరోగ్యం మరింత క్షీణించింది. తాజాగా అనారోగ్యంతో ఆస్పత్రిలో చేరింది. కనీసం రోజులు గడవలేని పరిస్థితుల్లో ఉన్న ఆమెకు ఇప్పుడు వైద్య ఖర్చలు కూడా తోడయ్యాయి.
ఆర్థికంగా కుదేలైన శ్యామలను పరిస్థితులే కాదు.. ఆరోగ్యం కూడా సహాకరించడం లేదు. తీవ్ర అస్వస్థతి తాజాగా ఆమె ఆస్పత్రిలో చేరింది. దీంతో మరోసారి ఆర్థిక సాయం కోసం ఆమె చేతులు చాచుతోంది. తరచూ ఇండస్ట్రీ ప్రముఖులను ఆమె సాయం ఆర్జించింది. కానీ, ఆమె ఆశించిన స్థాయిలో ఎవరూ ముందుకు రాలేదు. దీంతో ఇప్పుడైన తన పరిస్థితి కనికరించి పెద్ద మనసు చేసుకోవాలని వేడుకుంటోంది. తన కూతురు కూడా తీవ్రమైన ఆరోగ్య సమస్యలతో మంచానికే పరిమితమైపోవడంతో, శ్యామల మనసు మరింతగా విరిగిపోయింది. ‘ఇప్పుడైనా ఎవరో మనసున్నవాళ్లు నా కూతురికి, నాకు అండగా నిలుస్తారని ఆశిస్తున్నా‘ అంటూ ఆమె ఆస్పత్రి బెడ్‌పై నుంచి విజ్ఞప్తి చేస్తుంది.
సాయం కోసం తన బ్యాంక్ ఖాతా నెంబర్ కూడా ఇచ్చింది. సాయం చేయాలని అనుకునే వారు ఈ అకౌంట్ నెం తోచినంత సాయం చేయాలని పావల శ్యామల ఆర్జిస్తోంది. సాయం చేసే వారు Neti Shyamala : 98491 75713 నంబర్‌లో సంప్రదించవచ్చు. అకౌండ్ డిట్రైయిల్స్ (Neti (hyamala, Account No :52012871059, IFSC CODE : SBIN0020458, Jubilee Hills Branch, state Bank of India. Hyderabad). నటిగా ఆమె ఎన్నో సినిమాల్లో నటించి అలరించారు. క్యారెక్టర్ ఆర్టిస్టుగా కామెడియన్గా వెండితెరపై నటించి ఎంతోమందిని నవ్వించింది. కామెడీ, భావోద్వేగం రెండింటిని కలగలపి నటించిన అరుదైన నటీమణుల్లో ఆమె ఒకరు. అమ్మ, అమ్మమ్మ పాత్రల్లో ఒదిగి నటించారు. వందలకు పైగా సినిమాల్లో నటించిన ఆమె చివరి జీవితం ఇలా కష్టాలు, సమస్యలతో సాగడం చూస్తుంటే హృదయం బరువెక్కుతోంది.