BigTV English

K ramp Twitter Review: ‘కే ర్యాంప్’ ట్విట్టర్ రివ్యూ.. కిరణ్ అబ్బవరంకి మరో హిట్ పడినట్లేనా..?

K ramp Twitter Review: ‘కే ర్యాంప్’ ట్విట్టర్ రివ్యూ.. కిరణ్ అబ్బవరంకి మరో హిట్ పడినట్లేనా..?
Advertisement

K ramp Twitter Review: టాలీవుడ్ యంగ్ హీరో కిరణ్ అబ్బవరం గురించి ప్రత్యేకంగా పరిచయాలు అవసరం లేదు. గత ఏడాది ‘క’ సినిమాతో భారీ విజయాన్ని సొంతం చేసుకున్నారు. ఇప్పుడు ‘కే- ర్యాంప్ ‘ మూవీతో ప్రేక్షకుల ముందుకు వచ్చేసాడు. యూత్ రొమాంటిక్ ఎంటర్టైన్మెంట్గా తెరకెక్కింది. డైరెక్టర్ జైన్స్ నాని తెరకెక్కించిన ఈ మూవీని రాజేష్ దండ, శివ బొమ్మకు నిర్మించారు.. దీపావళి కానుకగా ఇవాళ ఈ సినిమా భారీ అంచనాల నడుమ థియేటర్లోకి వచ్చేసింది.. ఈ మూవీ ప్రమోషన్స్ లో హీరో చాలా గొప్పగా చెప్పాడు. అంతేకాదు ఈ సినిమా నుంచి రిలీజ్ అయిన ప్రతి అప్డేట్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్నాయి. మరి ఇవాళ థియేటర్ లోకి వచ్చిన సినిమా ఆ అంచనాలను రీచ్ అయిందో లేదో.. జనాలనుంచి రెస్పాన్స్ ఎలా ఉందో ఒకసారి తెలుసుకుందాం..


కే ర్యాంప్ మూవీ ఫస్ట్ ఆఫ్ కన్నా సెకండ్ ఆఫ్ చాలా బాగుంది. డిజార్డర్‌తో కూడిన క్యారెక్టరైజన్ సీన్లలో కామెడీ ఫుల్లుగా వర్కువుట్ అయింది. కుమార్ అబ్బవరం తన పెర్ఫార్మెన్స్‌తో మనసు దోచుకొంటాడు.. సెంటిమెంట్ సీన్లు ఈ సినిమాకి హైలెట్ గా మారుతాయి. క్లైమాక్స్ప ర్వాలేదని అనిపిస్తుంది.. ఓవరాల్‌గా డీసెంట్ ఎంటర్‌టైనర్. ఈ సినిమాకు నా రేటింగ్ 2.5/5 అని ఓ నెటిజన్ ట్వీట్ చేశాడు.

కే ర్యాంప్ మూవీ ఫస్టాఫ్ చాలా బాగుంది. ఇంటర్వెల్ మైండ్ బ్లోయింగ్‌గా ఉంటుంది. సెకండాఫ్‌లో ఎంటర్‌టైన్‌మెంట్ సూపర్.. క్లైమాక్స్ మంచి మెసేజ్ తో కూడినట్లు ఉంటుంది. ఇక హీరోయిన్ పర్ఫామెన్స్ కూడా ఈ సినిమాలో హైలెట్గా నిలుస్తుంది. నరేష్, వెన్నెల కిషోర్ ట్రాక్ చాలా బాగుంటుందని కామెంట్ చేశారు.

కే ర్యాంప్ మూవీ ఫస్ట్ హాఫ్ సూపర్ ఉంది. కామెడీ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటుంది. సినిమా మొత్తం బెస్ట్ ఎంటర్టైనర్ గా ఎంటర్టైన్మెంట్ చేస్తుంది. ఇంటర్వెల్లో మైండ్ బ్లాక్ అయ్యే ట్విస్ట్ ఉండడంతో ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అవుతుంది అంటూ మరో నెటిజన్ కామెంట్ చేశారు.

కే ర్యాంప్ మూవీ ప్రేక్షకులను బాగా ఎంటర్టైన్మెంట్ చేస్తుంది. కాలేజీ ఎపిసోడ్స్ బాగా చిత్రీకరించారు. ఎగ్జామ్ ఎపిసోడ్, రెడ్ షీట్ ఎపిసోడ్స్ హైలెట్. ఇంటర్వెల్ బ్లాక్ టెర్రిఫిక్. సెకండాఫ్‌ల నాన్ స్టాప్ కామెడీ ఉంటుంది. ముఖ్యంగా హాస్పిటల్ సీన్ బాగుంటుంది. వెన్నెలకిషోర్, నరేష్ కాంబినేషన్‌లో వచ్చే సీన్లు అదిరిపోయాయి.. సినిమా ఫాదర్ సెంటిమెంటు హైలెట్ అనే చెప్పాలి.. మొత్తానికి సినిమా బ్లాక్ బస్టర్ అవుతుందని మరో నెటిజన్ కామెంట్ చేశారు..

మొత్తానికి కిరణ్ అబ్బవరం కు కే ర్యాంప్ మూవీ తో మరో హిట్ పడేలా కనిపిస్తుంది. మొదటి షో తో పాజిటివ్ టాక్ ని అందుకున్న ఈ మూవీ.. జనాల నుంచి మంచి రెస్పాన్స్ రావడంతో కలెక్షన్లు కూడా పెరిగే అవకాశం ఉందని తెలుస్తుంది. క సినిమాతో బ్లాక్ బస్టర్ అందుకున్న ఈ హీరో ఈ మూవీ తో మరో హిట్ సినిమాని తన ఖాతాలో వేసుకునేలా కనిపిస్తుంది. ప్రస్తుతానికైతే పబ్లిక్ టాక్ పాజిటివ్ గా ఉండడంతో సినిమాపై అంచనాలు పెరుగుతున్నాయి. మరి కలెక్షన్లు కూడా పెరుగుతాయేమో చూడాలి..

Related News

KRamp Movie Review : కె ర్యాంప్ రివ్యూ

Dude Movie Review: ‘డ్యూడ్’ మూవీ రివ్యూ: సారీ డ్యూడ్ ఇట్స్ టూ బ్యాడ్

Telusu kada Review : ‘తెలుసు కదా’ రివ్యూ : కష్టం కదా

Dude Twitter Review: ‘డ్యూడ్’ ట్విట్టర్ రివ్యూ.. సినిమా ఎలా ఉందంటే..?

Mitra Mandali Review : ‘మిత్రమండలి’ మూవీ రివ్యూ.. చిత్ర హింసే

ARI Movie Review : ‘అరి’ మూవీ రివ్యూ.. గురి తప్పింది

Kantara Chapter 1 Movie Review : కాంతార చాప్టర్ 1 రివ్యూ

Big Stories

×