E-Paper
Advertisement

వేధించేవాడు.. అహంకారపు మాటలు భరించలేకపోయా.. అంజలి షాకింగ్ కామెంట్!

వేధించేవాడు.. అహంకారపు మాటలు భరించలేకపోయా.. అంజలి షాకింగ్ కామెంట్!
Advertisement

Anjali:ప్రముఖ తెలుగు అమ్మాయి అంజలి (Anjali )గురించి పరిచయాలు ప్రత్యేకంగా అవసరం లేదు..చదువుకుంటున్న సమయంలోనే షార్ట్ ఫిలిమ్స్ ద్వారా కెరియర్ మొదలుపెట్టిన ఈమె.. జీవా సరసన తమిళంలో ఒక చిత్రంలో నటించి వెండితెరకు పరిచయమైంది. అదే తెలుగులో వచ్చిన డేర్. 2006లో ఫోటో సినిమాతో స్వప్న పాత్రతో అందరికీ దగ్గరైన అంజలి.. 2007లో ప్రేమలేఖ రాశా సినిమాతో సంధ్యగా కనిపించింది. అయితే ఇవేవీ ఈమెకు గుర్తింపును అందించలేదు. ఆ తర్వాత షాపింగ్ మాల్ సినిమాలో చక్కని ప్రతిభ కనబరిచి తన నటనతో అందరినీ అబ్బుర పరిచింది. అది చూసిన డైరెక్టర్ మురగదాస్ 2011లో జర్నీ సినిమాలో అవకాశం ఇచ్చారు. మధుమతి గా డామినేటింగ్ క్యారెక్టర్ తో అందరినీ ఆశ్చర్యపరిచింది.

ప్రేమ పేరుతో వేధించాడు..

ఇక తర్వాత 2013లో సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు సినిమాలో కనిపించి ఈ తెలుగింటి అమ్మాయి అందరిని మురిపించింది. అమాయకంగా కనిపిస్తూనే..కల్లాకపటం ఎరుగని చిలిపి అమ్మాయిలా అందరి హృదయాలను దోచుకుంది. ఇక అలా తెలుగు , తమిళ్ అంటూ వరుస సినిమాలు చేస్తూ బిజీగా మారిన అంజలి.. ఎక్కువగా తమిళంలోనే సినిమాలు చేస్తున్న విషయం తెలిసిందే. ఇక ప్రస్తుతం ఈమె కోలీవుడ్ స్టార్ హీరో విశాల్ సరసన మగుడం అనే చిత్రంలో నటిస్తోంది. ఈ చిత్రాన్ని తెలుగులో మకుటం పేరిట రిలీజ్ చేస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా ప్రమోషన్స్ లో బిజీగా ఉన్న ఈమె తనను ఒక వ్యక్తి చాలా దారుణంగా వేధించేవాడని, అహంకారపు మాటలు తనను ఇబ్బంది పెట్టాయని, ఇక భరించలేక రాఖీ కడితే అతడు రియాక్షన్ చూసి తన షాక్ అయ్యాను అంటూ తెలిపింది అంజలి. మరి అసలు విషయం ఏమిటో ఇప్పుడు చూద్దాం..

అహంకారపు మాటలు తట్టుకోలేకపోయా..

Advertisement

అంజలి మాట్లాడుతూ..” నేను స్కూల్ డేస్ లో చదువుకునేటప్పుడు నా క్లాస్మేట్ ఒకతను నా వెంటపడేవాడు. ఏడవ తరగతి నుంచి పదవ తరగతి వరకు నాకు లవ్ ప్రపోజల్ చేస్తూనే ఉన్నాడు. నేను పట్టించుకోలేదు. ప్రేమించమని, పెళ్లి చేసుకోమని బ్రతిమలాడేవాడు.. ఒప్పుకోకపోతే సరికి వేధించడం మొదలుపెట్టాడు. ఒకరోజు నా దగ్గరికి వచ్చి నువ్వు రాఖీ కట్టి చూడు అంటూ నన్ను బెదిరించాడు. ఇక అతడి అహంకారపు మాటలు నేను తట్టుకోలేకపోయాను. వెంటనే రాఖీ తీసుకొచ్చి కట్టేశాను. ఇక పీడ వదిలింది ఇతడు నాకు కనపడడు అని అనుకునే లోపే నాకు షాక్ ఇచ్చాడు. వెంటనే రాఖీ తీసేసి నేను నీకు బ్రదర్ ని కాలేను. నేను కన్నన్ ను మాత్రమే అని చెప్పి అక్కడి నుంచి వెళ్లిపోయాడు. ఇక అప్పటినుంచి మళ్ళీ నాకు కనిపించలేదు అంటూ అంజలి చెప్పుకొచ్చింది.

also read:బ్యాన్ చేసినా బలుపు తగ్గలేదు. ప్రకాష్ రాజ్ తీరుపై మరో నటుడు షాకింగ్ కామెంట్!

ప్రేమ , పెళ్లి రూమర్స్ పై అంజలి క్లారిటీ..

Advertisement

ఇకపోతే ఇండస్ట్రీలో తనపై వచ్చిన రూమర్స్ కి కూడా అంజలి స్పందించింది. నిజానికి నేను ఎవరితోనూ ఎలాంటి రిలేషన్ లో లేను. కానీ పలువురు హీరోలతో రిలేషన్ లో ఉన్నట్లు వార్తలు వచ్చాయి. అవి చూసి అప్పుడు బాధపడ్డాను. కానీ ఇప్పుడు లైట్ తీసుకుంటున్నాను. నేను ఒకరి పేరు చెబితే మీరు ఇంకొక పేరు అడుగుతున్నారు. అందుకే నేను ఎవరి పేరు చెప్పదలచుకోలేదు. ప్రస్తుతం నా జీవితంలో ఎవరూ లేరు” అంటూ అంజలి తెలిపింది. మొత్తానికైతే సినిమా ప్రమోషన్స్ లో భాగంగా ఎన్నో విషయాలను పంచుకుంటుంది అంజలి. ఇకపోతే ఈ మకుటం చిత్రానికి విశాల్ హీరోగా నటించడమే కాకుండా దర్శకత్వం కూడా వహిస్తున్నారు.

Related News

కన్నప్ప బ్యూటీ బాగా బిజీ.. మరీ ఈ క్రేజ్ ఏంటి గురూ!

బ్యాన్ చేసినా బలుపు తగ్గలేదు. ప్రకాష్ రాజ్ తీరుపై మరో నటుడు షాకింగ్ కామెంట్!

Upcoming Movies in Theater : ఈ వారంలో థియేటర్లలోకి రాబోతున్న సినిమాలు ఇవే..డోంట్ మిస్..

Venuswamy : ఎన్టీఆర్ నుంచి రాజమౌళి వరకు.. సెలబ్రిటీల జోస్యం చెప్పిన వేణుస్వామి..

20 ఏళ్ల తర్వాత కెమెరా ముందుకు తమన్.. ‘బాయ్స్’ డ్రమ్మర్ రీఎంట్రీ ఫిక్స్!

30 ఏళ్ల పాటు ప్రపంచానికి కనిపించకుండా బతికిన మహానటి మిస్టరీ !

జీ5 నుంచి ‘సత్లుజ్’ అవుట్..ది కాశ్మీర్ ఫైల్స్’లా ఎందుకు చూడరంటూ పంజాబ్ ఫైర్ !

Big Stories

Advertisement
×