Film industry:అద్భుతమైన నటన, అదృష్టం రెండూ కలగలిస్తే తమ ఉనికిని చాటుకోవడం మరింత సులభం అని నిరూపిస్తున్నారు ఎంతోమంది యంగ్ హీరోలు, హీరోయిన్లు. ఇప్పుడు ఆ జాబితాలోకి ప్రముఖ యంగ్ బ్యూటీ ప్రీతి ముకుందన్ కూడా వచ్చి చేరింది. 2024 లో వచ్చిన ‘ఓం భీమ్ బుష్’ అనే చిత్రంతో సినీ ప్రపంచానికి పరిచయమైన ఈమె.. తన నటనతో అందరిని ఆకట్టుకుంది. ఒకవైపు సినిమాలలో నటిస్తూనే.. మరొకవైపు హిప్ హాప్, సినీ జానపద, పాశ్చాత్య, సమకాలీన , ఫ్యూజన్, భరతనాట్యం వంటి విభిన్న రూపాలలో రాణిస్తూ.. వివిధ సాంస్కృతిక కార్యక్రమాల్లో తన నృత్య నైపుణ్యాలను ప్రదర్శించి అందరినీ ఆకట్టుకుంది. మోడలింగ్ తో పాటు టీవీ, వాణిజ్య ప్రకటనలలో , వార్తా ప్రకటనలో కూడా రాణించిన ఈమె.. సౌత్ ఇండియా యాడ్ ఫిలిం పరిశ్రమలో కూడా గుర్తింపు పొందింది.
అలా తన టాలెంట్ తో అందరినీ అబ్బురపరుస్తున్న ఈమె.. మంచు విష్ణు ప్రెస్టేజియస్ మూవీ కన్నప్ప సినిమాలో హీరోయిన్ గా అవకాశాలు అందుకొని.. ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అయితే ఈ సినిమా ద్వారా ప్రీతి ముకుందన్ తన టాలెంట్ ను నిరూపించుకున్నప్పటికీ.. అనుకున్నంత స్థాయిలో గుర్తింపు లభించలేదు. అయితే ఈమె నటనను గుర్తించిన పలువురు దర్శకులు అవకాశాలు కల్పిస్తూ.. ఈమెకు స్టార్ స్టేటస్ ను అందిస్తున్నారు. ఈ క్రమంలోనే ఈమె ఇటీవల అర్జున్ సరసన బ్లాస్ట్ సినిమాలో హీరోయిన్గా నటించి అదరగొట్టేసింది. ప్రస్తుతం అధర్వ మురళి , కయాదు లోహర్ జంటగా నటించిన రొమాంటిక్ కమింగ్ ఆఫ్ ఏజ్ డ్రామా ‘ఇదాయం మురళి’ చిత్రంలో కీలకపాత్ర పోషిస్తుంది. జూలై 10వ తేదీన ప్రేక్షకుల ముందుకు రాబోతున్న నేపథ్యంలో ఇటీవల ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించగా.. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చిన డైరెక్టర్ అట్లీ ఒక షాకింగ్ విషయాన్ని బయటపెట్టి అందరిని ఆశ్చర్యపరిచారు.
also read:వేధించేవాడు.. అహంకారపు మాటలు భరించలేకపోయా.. అంజలి షాకింగ్ కామెంట్!
తాజాగా అట్లీ మాట్లాడుతూ..” ప్రీతి ముకుందన్ డాన్స్, యాక్టింగ్ స్టైల్ నాకు ఎంతగానో నచ్చుతాయి. అందుకే అల్లు అర్జున్ హీరోగా చేస్తున్న రాకా సినిమాలో ఈమె కోసం ప్రత్యేకంగా ఒక పాత్రను డిజైన్ చేశాను. ఈ క్యారెక్టర్ కోసం ఆమెను సంప్రదించగా.. ఆమె అప్పటికే దర్శకుడు ఆకాష్ తెరకెక్కిస్తున్న ఇదాయం మురళి సినిమాకి డేట్స్ ఇవ్వడం వల్ల ఈ ఆఫర్ ను సున్నితంగా తిరస్కరించింది. అయితే నేను ఆమెతో సరే నా నెక్స్ట్ ప్రాజెక్ట్ లో మనిద్దరం కలిసి పనిచేద్దామని అన్నాను ” అంటూ అట్లీ తెలిపారు. మొత్తానికి అయితే అల్లు అర్జున్ రాకా సినిమాలో బంగారం లాంటి ఛాన్స్ మిస్ చేసుకుందని అభిమానులు కూడా ఫీలవుతున్నారు.
ఒకవేళ ఈ ఇదాయం మురళి సినిమా ఈమెకు గుర్తింపును అందిస్తే.. ఆ బాధ ఉండదని, ఒకవేళ బెడిసికొట్టింది అంటే మాత్రం ఆ బాధ ఎప్పటికీ ఉంటుందనే కామెంట్లు కూడా వ్యక్తం అవుతున్నాయి. ప్రీతి రిజెక్ట్ చేసిన పాత్రలో మలయాళ బ్యూటీ ఫెమినా జార్జ్ ను ఎంపిక చేశారు. ఇందులో అల్లు అర్జున్ సరసన దీపికా పదుకొనే హీరోయిన్గా నటిస్తుండగా..అటు రష్మిక మందన్నతో పాటు మరో ముగ్గురు హీరోయిన్లు నటిస్తున్నట్లు సమాచారం.