Prakash Raj: తెలుగు చలనచిత్ర పరిశ్రమలో విలక్షణ నటుడిగా, తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును సొంతం చేసుకున్న ప్రకాష్ రాజ్ (Prakash Raj) ఒకవైపు సినిమాలలో కీలకపాత్రలు పోషిస్తూనే.. మరొకవైపు విలన్ పాత్రలతో ఆకట్టుకుంటున్నారు. కెరియర్ పరంగా అందరి దృష్టిని ఆకట్టుకుంటున్న ప్రకాష్ రాజ్.. అనవసరంగా సోషల్ మీడియాలో రాజకీయ నాయకులను టార్గెట్ గా చేసుకొని విమర్శలు గుప్పిస్తూ ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు అంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. ముఖ్యంగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ను టార్గెట్ గా చేసుకొని.. ఆయన ఎక్కడ ఏం మాట్లాడినా సరే దానిని కాంట్రవర్సీగా సృష్టిస్తూ వార్తల్లో నిలుస్తున్నారు అంటూ ఇటు పవన్ కళ్యాణ్ అభిమానులు కూడా మండిపడుతున్నారు.
ఇదిలా ఉండగా.. గత పది రోజులుగా ప్రముఖ జర్నలిస్టు, యూట్యూబర్ ప్రశ్నా రావణ్ ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ను బహిరంగంగా బూతులు తిడుతూ విమర్శించడంపై ఆగ్రహించిన పోలీసులు ప్రశ్నా రావణ్ ను అరెస్టు చేసిన విషయం తెలిసిందే. పలుమార్లు ప్రశ్నా రావణ్ కి బెయిల్ ఇచ్చినప్పటికీ పదేపదే అతనిపై కేసులు నమోదవడం అందరికీ తెలిసిందే. అయితే ఇప్పుడు ఆయనను 18 రోజుల పాటు రిమాండ్ కు తరలించింది కోర్టు. ఇక ఎప్పుడైతే ప్రశ్నా రావణ్ ని అరెస్టు చేశారో ..ఇక అప్పటినుంచి సోషల్ మీడియా ప్రకాష్ రాజ్ సంధించే ప్రశ్నలు తరచూ వివాదాలకు దారి తీస్తున్నాయి. పైగా పవన్ కళ్యాణ్, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడులను టార్గెట్ చేస్తూ వరుస వీడియోలు విడుదల చేస్తూ రాజకీయంగా ఇటు సినీవర్గాలలో దుమారం రేపుతున్నారు.
ఈ నేపథ్యంలోనే మొన్నటికి మొన్న ప్రముఖ నిర్మాత బండ్ల గణేష్ కూడా కౌంటర్ ఇచ్చారు. ప్రకాష్ రాజ్..” నీ వైఖరి చూస్తుంటే అసహ్యం వేస్తోంది. అర్థం లేని విమర్శలు చేస్తున్న నువ్వు.. నీ మనస్సాక్షిని ప్రశ్నించుకో” అంటూ తనదైన శైలిలో కౌంటర్ ఇచ్చారు. అంతేకాదు కొంతమంది ప్రముఖుల నుండి తెలుగు సినీ పరిశ్రమ నుండి పూర్తిగా ప్రకాష్ రాజ్ ను బహిష్కరించాలని డిమాండ్ కూడా వినిపిస్తోంది. అయితే ఇలాంటి సమయంలో గతంలో సనాతన ధర్మం, హిందూ మతంపై ప్రకాష్ రాజ్ చేసిన కొన్ని వివాదాస్పద వ్యాఖ్యలను తప్పుబడుతూ సీనియర్ నటుడు శివకృష్ణ ఒక ఇంటర్వ్యూలో మాట్లాడిన పాత వీడియో మళ్లీ తెరపైకి వచ్చి వార్తల్లో నిలిచింది.
శివ కృష్ణ మాట్లాడుతూ..” గతంలో ప్రకాష్ రాజ్ ప్రవర్తన మితిమీరినప్పుడు తెలుగు ఇండస్ట్రీ పెద్దలంతా కలిసి ఆయనను ఇండస్ట్రీ నుంచి బహిష్కరించారు. అప్పట్లో ఒక నిర్దిష్ట సామాజిక వర్గాన్ని ఉద్దేశించి ప్రకాష్ రాజ్ అనుచిత వ్యాఖ్యలు చేసినప్పుడు మేమంతా ఏకమై ఆయనపై నిషేధం విధించాము. ఆ సమయంలో నట సామ్రాట్ అక్కినేని నాగేశ్వరరావు కూడా నియమ నిబంధనల ప్రకారం చట్టబద్ధంగా ముందుకు వెళ్ళమని మాకు పూర్తి మద్దతు ప్రకటించారు. స్టార్ హీరో నాగార్జున కూడా ప్రకాష్ రాజ్ చేసిన తప్పును ఏమాత్రం సహించలేదు. ఇక ప్రకాష్ రాజ్ ను బ్యాన్ చేయడంతో స్వయంగా మా ఇంటికి వచ్చి తప్పు తెలుసుకొని నన్ను వదిలేయండి అంటూ వేడుకున్నారు.. నాడు అంతలా దిగివచ్చిన వ్యక్తి ఈరోజు మళ్లీ హిందూ మతాన్ని, సనాతన ధర్మాన్ని టార్గెట్ గా చేసుకొని ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతుంటే.. ఎందుకు ఇండస్ట్రీ మౌనంగా ఉందో అర్థం కావడం లేదు” అంటూ ఆయన ప్రశ్నించారు.
also read:‘గ్లోబల్ ఓరల్ క్యాన్సర్ ట్రస్ట్’.. డాక్టర్ దిలీప్ అనూహ్య పోరాటం!
ప్రకాష్ రాజ్ పై యాక్షన్ తప్పదా?
అహంకారంతో హిందూ సెంటిమెంట్లను గాయపరుస్తున్న ప్రకాష్ రాజ్ ను వెంటనే టాలీవుడ్ నుండి బహిష్కరించాలి.. నాటి మేటి నటుల మద్దతుతో ప్రకాష్ రాజ్ పై జరిగిన యాక్షన్ ను నేటి ఆయన తీరును ఎండగడుతూ శివకృష్ణ చేసిన ఘాటు వ్యాఖ్యల వీడియో ఇప్పుడు సోషల్ మీడియాను కుదిపేస్తోంది. మరి అప్పటి లాగే ఇప్పుడు కూడా టాలీవుడ్ పెద్దలు స్పందించి ప్రకాష్ రాజు పై యాక్షన్ యాక్షన్ తీసుకోవాలని నెటిజన్స్ కోరుతున్నారు.