E-Paper
Advertisement

Venuswamy : ఎన్టీఆర్ నుంచి రాజమౌళి వరకు.. సెలబ్రిటీల జోస్యం చెప్పిన వేణుస్వామి..

Venuswamy : ఎన్టీఆర్ నుంచి రాజమౌళి వరకు.. సెలబ్రిటీల జోస్యం చెప్పిన వేణుస్వామి..
Advertisement

Venuswamy : ప్రముఖ జ్యోతిష్యుడు వేణు స్వామి గురించి ప్రత్యేకంగా పరిచయాలు అవసరం లేదు.. ఈ మధ్య సోషల్ మీడియాలో ఈయన పేరు ఎక్కువగా వినిపిస్తుంది. ఒకప్పుడు కేవలం జ్యోతిషం మాత్రమే చెప్పేవాడు. కానీ ఈ మధ్య సెలబ్రిటీలు అలాగే రాజకీయ నాయకుల జాతకాలు చెప్తూ ఒక్కసారిగా ఫేమస్ అయిపోయాడు. ముఖ్యంగా హీరో హీరోయిన్ల జాతకాలు గురించి పలు సందర్భాలలో బయటపెట్టి సోషల్ మీడియాలో హైలెట్ అయ్యాడు.. ఎప్పుడు ఏదో ఒక వివాదంలో ఇరుక్కుంటున్న వేణు స్వామి తాజాగా టాలీవుడ్ ఇండస్ట్రీలోని పలువురు ప్రముఖుల జాతకాన్ని బయటపెట్టాడు.. ఎన్టీఆర్ నుంచి రాజమౌళి వరకు అందరి జాతకాలు చెప్పి ఒక్కసారిగా వార్తల్లో నిలిచాడు. మరి ఆలస్యం ఎందుకు? ఏ స్టార్ జాతకం ఎలా ఉందో ఒకసారి ఇక్కడ చూసేద్దాం..

వేణు స్వామి చెప్పిన ప్రముఖుల జాతకాలు ఇవే..

వేణు స్వామి ఏ ఇంటర్వ్యూకు అటెండ్ అయిన అందులో అందరి గురించి ఎన్నో విషయాలను పంచుకుంటారు.. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆయన ఒక్కోక్క స్టార్ పై ఒక్కో పదంతో అభివర్ణిస్తూ తన అభిప్రాయాన్ని వెల్లడించారు. ముందుగా విజయ్ దేవరకొండను ‘కష్టపడే వ్యక్తి’.. పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ఒక కారణజన్ముడు. అలాగే సమంత ఒక ‘ఫైటర్’.. అదేవిధంగా చిరంజీవి ‘ కష్టపడి పైకి వచ్చిన కారణ ‘, మెగాపవర్ స్టార్ రామ్ చరణ్‌ను ‘వంశాన్ని నమ్ముకోకుండా కష్టాన్ని నమ్ముకున్న వ్యక్తి’గా ప్రశంసించారు.. రాజమౌళిని ‘కారణ జన్ముడు’గా అభివర్ణించగా, మహేష్ బాబును ‘అందగాడు’.. జూనియర్ ఎన్టీఆర్ మంచి నటుడు మాత్రమే కాదు నాయకత్వ లక్షణాలున్న వ్యక్తి ముఖ్యమంత్రిగా అయ్యే అవకాశాలు కూడా ఉన్నాయి అని పేరు స్వామి ప్రశంసలు కురిపించారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గురించి కూడా వేణు స్వామి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రిగా తన బాధ్యతలను కరెక్టుగా నెరవేరుస్తున్నారు.. ఒక్క మాటలో చెప్పాలంటే పర్ఫెక్ట్ పొలిటిషన్ అని అన్నారు. అందరిని ఇలా ప్రశంసలతో పొగిడేసారు. ప్రస్తుతం ఈ ఇంటర్వ్యూ వీడియో సోషల్ మీడియాలో బాగా వరులు అవుతుంది. ఈ వీడియోని చూసిన అభిమానులు ఈయనపై ప్రశంసలు కురిపిస్తున్నారు..

Advertisement

Also Read :‘ మేఘసందేశం’ సీరియల్ లవర్స్ కు షాకింగ్ న్యూస్.. కృష్ణ ప్రసాద్ అవుట్..

సెలబ్రిటీలతో వేణుస్వామి పూజలు..

ప్రముఖ సెలబ్రిటీల వేణు స్వామి గురించి ఎంత చెప్పినా తక్కువే.. ఇండస్ట్రీలోని సినిమా హీరో హీరోయిన్ల తో పూజలు చేయించడంతో ఒక్కసారిగా వేణు స్వామి స్టార్ జ్యోతిష్యుడు అయ్యాడు. ఇకపోతే ఈయన చేసే పూజల వల్ల చాలామంది జీవితం మారిందని కొందరు ఆయనను నమ్ముతున్నారు. ఇటీవల కాలంలో స్టార్ హీరోయిన్లు సైతం ఆయనతో పూజలు చేయించుకోవడానికి క్యూ కడుతున్నారు. ఈమేరకు ఆయన క్రేజ్ మరింత పెరిగింది.. ఆయన పై ట్రోల్స్ ఎదురవుతున్నా కూడా సెలబ్రిటీలు మాత్రం ఆయనతో పూజలు చేస్తున్నారు.. ఇక ఈ మధ్య సినీ నటి ప్రగతి కూడా పూజలు చేయించింది. అది కాస్త వైరల్ అయ్యింది. ఇప్పుడు మరోసారి ఇలా సెలబ్రిటీల జాతకాలు చెప్పి వార్తల్లో హైలెట్ అయ్యాడు..

Related News

20 ఏళ్ల తర్వాత కెమెరా ముందుకు తమన్.. ‘బాయ్స్’ డ్రమ్మర్ రీఎంట్రీ ఫిక్స్!

30 ఏళ్ల పాటు ప్రపంచానికి కనిపించకుండా బతికిన మహానటి మిస్టరీ !

జీ5 నుంచి ‘సత్లుజ్’ అవుట్..ది కాశ్మీర్ ఫైల్స్’లా ఎందుకు చూడరంటూ పంజాబ్ ఫైర్ !

ఒడిషా సూపర్ స్టార్ టాలీవుడ్ ఎంట్రీ.. మైండ్ బ్లోయింగ్ కాన్సెప్ట్‌తో వస్తున్న ‘అంతర్యామి’!

16 ఏళ్ళ వయసులో ఎన్‌సీసీ క్యాంప్‌లో ప్రేమ.. అనసూయ రియల్ లైఫ్ బయోపిక్!

నన్ను క్షమించండి’ అంటూ జయం రవి ఎమోషనల్…మైనస్‌ అయిన కెరీర్ ప్లస్ అయ్యేనా?

‘జన నాయగన్’ సెన్సార్ అప్‌డేట్‌.. ఆ రూమర్స్ నమ్మొద్దన్న నిర్మాతలు!

Big Stories

Advertisement
×