Gambhir: ఇంగ్లాండ్ చేతిలో మూడో టీ20లో చిట్టిగా ఓడిపోయిన తర్వాత టీమిండియా హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ కు (Gautam Gambhir) జ్ఞానోదయం అయినట్లు తెలుస్తోంది. 15 ఏళ్ల కుర్రాడు వైభవ్ సూర్యవంశీని పక్కకు పెట్టి… మళ్లీ వరల్డ్ కప్ హీరో సంజు శాంసన్ ను తీసుకువస్తానని తాజాగా నిర్వహించిన ప్రెస్ మీట్ వేదికగా ప్రకటించారు హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్. అనవసరంగా 15 ఏళ్ల కుర్రాడు వైభవ్ సూర్య వంశీని (vaibhav sooryavanshi) ఓపెనర్ గా పంపి తప్పు చేశానని… నెక్స్ట్ మ్యాచ్ లో కచ్చితంగా సంజు శాంసన్ ను (Sanju Samson) ఆడిస్తానంటూ కీలక ప్రకటన చేశారు గౌతమ్ గంభీర్. దీంతో సంజు శాంసన్ ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అవుతున్నారు.
టీమిండియా వర్సెస్ ఇంగ్లాండ్ మధ్య నిన్న నాటింగ్ హామ్ లోని ట్రెంట్ బ్రిడ్జ్ (Trent Bridge, Nottingham) వేదికగా మ్యాచ్ జరిగిన సంగతి తెలిసిందే. అయితే ఇందులో అద్భుతంగా రాణించిన ఇంగ్లాండ్… టీమిండియాను వరుసగా రెండోసారి ఓడించింది. ఈ మ్యాచ్ లో చిత్తుగా ఆడిన టీమిండియా వందలోపు ఆల్ అవుట్ కావడమే కాకుండా… ఏకంగా 125 పరుగుల తేడాతో ఓటమిపాలైంది. ఇలాంటి క్రమంలో వైభవ్ సూర్యవంశీ స్థానంలో సంజు శాంసన్ ను తుది జట్టులోకి తీసుకురావాల్సిందేనని సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు ఆయన ఫ్యాన్స్. మాజీ క్రికెటర్లు కూడా ఇదే విషయాన్ని స్పష్టం చేస్తున్నారు. మొన్నటి వరకేమో వైభవ్ ను ఆడించాలని పట్టుబట్టిన.. మాజీ క్రికెటర్లే.. ఇప్పుడు సంజు కావాలని అంటున్నారు.
ఇంగ్లాండ్ చేతిలో మూడవ టి20 ఓడిపోయిన తర్వాత టీమిండియా హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ కూడా ఇదే విషయాన్ని గ్రహించి.. మీడియా ముందు వెల్లడించారు. 15 ఏళ్ల కుర్రాడు వైభవ్ సూర్యవంశీ సేవలు తమకు చాలని వెల్లడించారు. అతనిపై ఇక ఒత్తిడి పెట్ట దలుచుకోలేదని కుండబద్దలు కొట్టి చెప్పారు. అతని పక్కకు పెట్టి తర్వాతి మ్యాచ్ నుంచి… కచ్చితంగా వరల్డ్ కప్ హీరో సంజు శాంసన్ ను తీసుకుంటామని ప్రకటించారు గౌతమ్ గంభీర్. దీంతో గౌతమ్ గంభీర్ చేసిన వ్యాఖ్యలు వైరల్ గా మారాయి. కాగా నిన్న మ్యాచ్ ఫినిష్ అయిన తర్వాత కూడా గౌతమ్ గంభీర్ కు సంజు అభిమానుల నిరసన సెగ తగిలింది. టీమిండియా బస్సు ముందు ఇంగ్లాండ్ లో ఉన్న NRI సంజు (Sanju Samson) అభిమానులు నిరసనకు దిగారు. ఇక చేసేది ఏమీ లేక, గౌతమ్ గంభీర్ కూడా సంజును తీసుకుంటానని ప్రకటించేశాడు.