AA22xA6 Update : పుష్ప (Pushpa ) సినిమాతో పాన్ ఇండియా హీరోగా పేరు సొంతం చేసుకున్న అల్లు అర్జున్ (Allu Arjun).. ఈ సినిమాతో ఏకంగా నేషనల్ అవార్డు కూడా అందుకున్నారు. అంతేకాదు తెలుగు నాట నేషనల్ అవార్డు అందుకున్న తొలి నటుడిగా కూడా రికార్డు సృష్టించారు. ఈ సినిమా తర్వాత పుష్ప 2 (Pushpa 2) సినిమా చేసి మరో విజయాన్ని తన ఖాతాలో వేసుకున్నారు అల్లు అర్జున్.. ఇప్పుడు కోలీవుడ్ డైరెక్టర్ అట్లీ (Atlee) దర్శకత్వంలో సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. ప్రముఖ కోలీవుడ్ బడా నిర్మాణ సంస్థ సన్ పిక్చర్స్ బ్యానర్ పై కళానిధి మారన్ (Kalanidhi Maran) ఈ సినిమాను నిర్మిస్తున్నారు.
AA22xA6 అప్డేట్..
ఇదిలా ఉండగా.. ఇప్పటికే షూటింగ్ మొదలైన విషయం తెలిసిందే. ఇప్పుడు తాజాగా ఈ సినిమా షూటింగ్ నుండి ఒక అప్డేట్ అభిమానులలో అంచనాలు పెంచేసింది. తాజాగా ఈ సినిమా కోసం అట్లీ భారీగా కష్టపడుతున్నట్లు సమాచారం. అసలు విషయంలోకి వెళ్తే.. దాదాపు 300 మంది ఆర్టిస్టులతో ఈ సినిమాలో అల్లు అర్జున్ ఎంట్రీ సీన్ కోసం భారీ ఏర్పాట్లు చేశారట. ముఖ్యంగా అల్లు అర్జున్ గ్రాండ్ ఎంట్రీ సీక్వెన్స్ చిత్రీకరిస్తున్నారని.. దాదాపు 300 మంది ఆర్టిస్టులు అల్లు అర్జున్ ఎంట్రీ సీన్ కోసం పనిచేస్తున్నట్లు సమాచారం.. మొత్తానికైతే అట్లీ మాస్టర్ ప్లాన్ కి అభిమానులు సైతం ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. మరి భారీ అంచనాల మధ్య రాబోతున్న ఈ సినిమా ఇలాంటి గూస్ బంప్స్ తెప్పించే అప్డేట్స్ తో ఎలాంటి రికార్డ్స్ క్రియేట్ చేస్తుందో చూడాలి.
AA22xA6 సినిమా విశేషాలు..
ఈ సినిమా విషయానికి వస్తే.. ఈ సినిమాలో మొదట గ్లోబల్ స్టార్ ప్రియాంక చోప్రా (Priyanka Chopra) హీరోయిన్గా నటిస్తోంది అంటూ వార్తలు వినిపించాయి. కానీ అనూహ్యంగా ఆమె స్థానంలో దీపికా పదుకొనే (Deepika Padukone) ఫైనల్ అయింది. ప్రభాస్(Prabhas ) హీరోగా, సందీప్ రెడ్డి వంగా (Sandeep Reddy Vanga) దర్శకత్వంలో వస్తున్న ‘స్పిరిట్’ సినిమాకి మొదట ఎంపికైనా.. ఆ తర్వాత కొన్ని విభేదాల వల్ల ఆమెను తప్పించి త్రిప్తి డిమ్రి (Tripti dimri) ని తీసుకున్నారు. అయితే అక్కడ అవకాశం పోయినా మరో తెలుగు సినిమాలో ఈమెకు అవకాశం లభించింది. అలా అట్లీ, అల్లు అర్జున్ కాంబినేషన్లో వస్తున్న సినిమాలో ఈమె హీరోయిన్ గా ఎంపిక అయింది. ఇదిలా ఉండగా ఈ సినిమాలో మొత్తం ఐదు మంది హీరోయిన్లు నటిస్తున్నారు అంటూ వార్తలు వినిపిస్తున్నాయి. ముఖ్యంగా రష్మిక మందన్న (Rashmika Mandanna) ఈ సినిమాలో విలన్ పాత్ర పోషించబోతున్నట్లు సమాచారం. వీరితో పాటు జాన్వీ కపూర్ (Janhvi kapoor) కూడా భాగమైనట్లు తెలుస్తోంది. మొత్తానికైతే భారీ అంచనాల మధ్య.. ఊహించని తారాగణంతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ సినిమా మరెన్ని రికార్డ్స్ క్రియేట్ చేస్తుందో చూడాలి.
also read: Mokshagna: నందమూరి మోక్షజ్ఞ కొత్త లుక్.. ఇలా మారిపోయాడేంటి ?