E-Paper
Advertisement

Akhanda 2 : నేల టికెట్‌లో కూర్చున్న వాళ్లు… ఇంటర్వెల్‌కు వెళ్లి బాల్కనీలో కూర్చుంటారు

Akhanda 2 : నేల టికెట్‌లో కూర్చున్న వాళ్లు… ఇంటర్వెల్‌కు వెళ్లి బాల్కనీలో కూర్చుంటారు
Advertisement

Akhanda 2 : ప్రముఖ దర్శకులు రవి రాజా పినిశెట్టి కుమారుడు ఆది పినిశెట్టి తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో నటుడుగా తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు సాధించుకున్న విషయం తెలిసిందే. ఆది పినిశెట్టి కెరియర్ లో మంచి సక్సెస్ఫుల్ సినిమాలు కూడా ఉన్నాయి. అయితే ఒక తరుణంలో సహాయక పాత్రల్లో కూడా కనిపించడం మొదలుపెట్టాడు ఆది పినిశెట్టి.

ముఖ్యంగా బోయపాటి శ్రీను సినిమాల్లో ఎక్కువ విలనిజం పండిస్తాడు. బోయపాటి శ్రీను దర్శకత్వంలో అల్లు అర్జున్ హీరోగా చేసిన సినిమా సరైనోడు. ఆ సినిమాలో విలన్ పాత్రలో కనిపించాడు ఆది పినిశెట్టి. ఆ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద మంచి సక్సెస్ సాధించింది. అక్కడితో ఆది పినిశెట్టి కి మరియు బోయపాటి శ్రీనుకి మధ్య మంచి బాండింగ్ కుదిరింది.

అజ్ఞాతవాసిలో కూడా 

Advertisement

త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో పవన్ కళ్యాణ్ నటించిన సినిమా అజ్ఞాతవాసి. పవన్ కళ్యాణ్ కెరియర్ లో వచ్చిన 25వ సినిమా ఇది. ఈ సినిమా ఊహించిన స్థాయిలో సక్సెస్ సాధించలేదు. ఎన్నో అంచనాలతో థియేటర్కు వెళ్లిన ప్రేక్షకులకి నిరాశన మిగిల్చింది. ఈ సినిమాలో ఆది పినిశెట్టి విలన్ గా నటించారు.

ఆది పినిశెట్టి ఎలివేషన్ 

అయితే బోయపాటి శ్రీను బాలకృష్ణ కాంబినేషన్ గురించి భారీ ఎలివేషన్ ఇచ్చాడు ఆది పినిశెట్టి. వీరిద్దరి కాంబినేషన్ నెక్స్ట్ లెవెల్ లో ఉంటుంది. వీళ్ళ సినిమాను నేల టిక్కెట్లో చూసే ఆడియన్స్ కూడా సినిమా పూర్తి అయ్యేసరికి బాల్కనీలో ఉంటారు అంటూ చెప్పాడు.

Advertisement

అంటే తన ఉద్దేశం ఏంటంటే అంత హ్యాపీనెస్ తో గాలిలో తేలిపోతారు ఎక్కడికో వెళ్ళిపోతారు అని చెప్పడం కావచ్చు. మొత్తానికి అఖండ 2 సినిమా డిసెంబర్ 5న ప్రేక్షకులు ముందుకు రానుంది. ఇప్పటివరకు ఈ సినిమా నుంచి రెండు పాటలు విడుదలయ్యాయి. కొద్దిసేపటికి ఈ సినిమా నుంచి ట్రైలర్ కూడా విడుదలైంది. ఇప్పటివరకు వచ్చిన కంటెంట్ అంతా కూడా విపరీతమైన అంచనాలను పెంచుతుంది.

తమన్ ఈ సినిమాకి సంగీతం అందిస్తున్నాడు. బోయపాటి శ్రీను బాలకృష్ణ కాంబినేషన్ సినిమాకు తమను ఇచ్చే బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ఏ రేంజ్ లో ఉంటుందో అఖండ సినిమా ప్రూవ్ చేసింది. ఇప్పుడు అఖండ 2 సినిమా బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఏ రేంజ్ లో ఉండబోతుందో చూడాలి.అఖండ 2 సినిమా గురించి భారీ ఎలివేషన్ ఇచ్చిన ఆది పినిశెట్టి.

Also Read: Saailu Kampati: ఒక రూపాయి కోసం రూమ్ మొత్తం వెతికా, మీ కష్టం పగోడు కూడా రాకూడదు అన్న

Related News

టాక్సిక్ ..500కోట్లు అయ్యే పనేనా ?

మా ఆయన కోసమే గాయమైనట్టుంది… పెళ్లి తర్వాత మూడు నెలలు కలవలేదంటూ!

శ్రీకృష్ణుడిగా రౌడీ హీరో విజయ్ దేవరకొండ.. దిల్ రాజు క్రేజీ రీమేక్ ప్లాన్

బన్నీ ట్రిపుల్ రోల్‌పై కొత్త ట్విస్ట్.. ‘రాకా’ కథ మొత్తం మారిపోయిందా?

డెనిమ్‌లో మాల్వి మల్హోత్రా.. బ్లూ బ్యూటీని చూస్తే చూపు తిప్పుకోవడం కష్టమే!

ఇరుముడి బాక్సాఫీస్ రన్.. రూ.300 కోట్లు సాధ్యమేనా?

ఆర్ట్ డైరెక్టర్ ఆనంద్ సాయి కొడుకు కేసులో బిగ్ ట్విస్ట్…

ఇరుముడి సీక్వెల్ సినిమాలో రామ్ చరణ్.. ఫాన్స్ కు పూనకాలే!

Big Stories

Advertisement
×