AA22 ×A6: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్(Allu Arjun) ప్రస్తుతం కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ అట్లీ(Atlee) దర్శకత్వంలో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. వీరిద్దరి కాంబినేషన్లో యాక్షన్ ఫాంటసీ డ్రామాగా తెరకెక్కుతున్న సినిమా శరవేగంగా షూటింగ్ పనులను జరుపుకుంటుంది. ఈ సినిమా ప్రస్తుతం AA22 ×A6 అనే వర్కింగ్ టైటిల్ తో షూటింగ్ పనులను జరుపుకుంటుంది. ఇక అల్లు అర్జున్ ఈ సినిమా షూటింగ్ కోసం ముంబైలోనే ఉంటున్న సంగతి తెలిసిందే. ఇదిలా ఉండగా ఈ సినిమాకు సంగీత దర్శకుడు ఎవరు అనే విషయం పెద్ద కొద్దిరోజులుగా పెద్ద ఎత్తున వార్తలు చక్కర్లు కొడుతూనే ఉన్నాయి. తాజాగా ఈ సినిమాకు సంగీత దర్శకుడు ఫిక్స్ అయ్యారని ఈ విషయాన్ని స్వయంగా అల్లు అర్జున్ తెలియజేశారని చెప్పాలి.
తాజాగా అల్లు అర్జున్ తన ఇంస్టాగ్రామ్ స్టోరీ ద్వారా ప్రముఖ యువ సంగీత దర్శకుడు సాయి అభ్యాంకర్ (Sai Abhyankkar)ఫోటోని షేర్ చేస్తూ ..”నా ప్రియమైన సోదరుడు.. SAK మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే.. రాబోయే సంవత్సరంలో మీ అందరికీ మంచి విజయం అలాగే పేరు ప్రఖ్యాతలు రావాలని కోరుకుంటున్నాను అంటూ అల్లు అర్జున్ ఈ యువ సంగీత దర్శకుడికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తూ చేసిన పోస్ట్ ప్రస్తుతం వైరల్ అవుతుంది.
ఈ విధంగా అల్లు అర్జున్ వచ్చే ఏడాది మంచి సక్సెస్ అందుకోవాలని చెప్పడంతో అల్లు అర్జున్ అట్లి డైరెక్షన్లో రాబోతున్న సినిమా వచ్చే ఏడాదిలో విడుదల కాబోతున్న నేపథ్యంలోనే తన సినిమాకు పని చేస్తున్న సంగీత దర్శకుడిని ఇలా కన్ఫామ్ చేశారని అభిమానులు భావిస్తున్నారు. ఇక ఈ సినిమాకు సంగీత దర్శకుడు కూడా కన్ఫామ్ కావడంతో సినిమా పట్ల మంచి అంచనాలు ఏర్పడ్డాయి. ఇక సాయి అభ్యంకర్ ఇటీవల ప్రదీప్ రంగనాథన్ హీరోగా నటించిన డ్యూడ్(Dude) సినిమాకి కూడా సంగీతం అందించిన సంగతి తెలిసిందే ఈ సినిమా 100 కోట్లకు పైగా కలెక్షన్లను రాబట్టి సంచలనాలను సృష్టించింది.
హీరోయిన్ గా దీపిక పదుకొనే..
ఇక అల్లు అర్జున్ అట్లీ సినిమాకు సాయి సంగీత దర్శకుడుగా వ్యవహరించబోతున్నట్లు చిత్ర బృందం అధికారకంగా వెల్లడించాల్సి ఉంది.. ఇక ఈ సినిమా సన్ పిక్చర్ బ్యానర్ పై ఎంతో ప్రతిష్టాత్మకంగా అత్యంత భారీ బడ్జెట్ సినిమాగా తెరకెక్కుతోంది. ఈ సినిమాలో దీపికా పదుకొనే హీరోయిన్ గా నటిస్తున్నారు. ఈమెతో పాటు మృణాళ్ ఠాకూర్, జాన్వీ కపూర్, రష్మిక వంటి తదితరులు కూడా కీలకపాత్రలలో నటించబోతున్నారని తెలుస్తోంది. ఇక ఈ సినిమా పాన్ ఇండియా స్థాయిలో కాకుండా పాన్ వరల్డ్ స్థాయిలో ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలనే ఆలోచనలో దర్శకుడు ఉన్నట్టు తెలుస్తోంది. పుష్ప 2 సినిమా తర్వాత అల్లు అర్జున్ నటిస్తున్న సినిమా కావడంతో ఈ సినిమాపై భారీ స్థాయిలో అంచనాలు ఏర్పడ్డాయి.
Also Read: Anchor Lasya: శివయ్య సన్నిధిలో గుడ్ న్యూస్ చెప్పిన లాస్య.. కంగ్రాట్స్ చెబుతున్న ఫ్యాన్స్!