#NTRNeel: ప్రముఖ స్టార్ హీరో ఎన్టీఆర్ (NTR ) వరుస పెట్టి సినిమాలు ప్రకటిస్తూ అభిమానులకు మంచి వినోదాన్ని పంచే ప్రయత్నం చేస్తున్నారు. ముఖ్యంగా రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన ఆర్ఆర్ఆర్ చిత్రంతో గ్లోబల్ రేంజ్ లో పాపులారిటీ అందుకున్న ఈయన.. ఆ తర్వాత కొరటాల శివ దర్శకత్వంలో దేవరా సినిమా చేసి మంచి విజయాన్ని అందుకున్నారు. నిజానికి ఈ సినిమా మొదట మిక్స్డ్ టాక్ తెచ్చుకున్నా.. ఆ తర్వాత మౌత్ టాక్ బాగుండడంతో 600 కోట్ల క్లబ్లో చేరింది. తర్వాత బాలీవుడ్ లో సినీ రంగ ప్రవేశం చేశారు ఎన్టీఆర్. హృతిక్ రోషన్ హీరోగా.. కియారా అద్వానీ హీరోయిన్గా వార్ 2 చిత్రంతో తొలిసారి విలన్ గా నటించడమే కాకుండా ఈ సినిమాతో బాలీవుడ్ రంగ ప్రవేశం చేశారు కానీ ఈ సినిమా డిజాస్టర్ గాని నిలిచింది.
కే జీ ఎఫ్ 1&2 చిత్రాలతో పాటు సలార్ సినిమాతో సంచలనం సృష్టించిన డైరెక్టర్ ప్రశాంత్ నీల్ (Prashanth Neel) దర్శకత్వంలో ‘ ఎన్టీఆర్ 31 డ్రాగన్’ అనే వర్కింగ్ టైటిల్ తో ఎన్టీఆర్ తో సినిమా చేస్తున్నారు. ఈ ఏడాది మొదట్లోనే ఈ సినిమా షూటింగ్ ప్రారంభమైన విషయం తెలిసిందే. మొదటి నుంచే ఈ సినిమాపై అంచనాలు పెరగగా.. మొన్నమధ్య డైరెక్టర్ కి, హీరోకి మధ్య విభేదాలు వచ్చాయని.. అందుకే సినిమా షూటింగ్ ఆగిపోయిందని సమాచారం. వాస్తవానికి డైరెక్టర్ చెప్పిన కథలో కాస్త మార్పులు చేయమని ఎన్టీఆర్ చెప్పారని.. దానికి డైరెక్టర్ ఒప్పుకోలేదనే వార్తలు కూడా వినిపించాయి. కానీ ఇప్పుడు డైరెక్టర్ కి హీరో కి మధ్య గొడవలు ముగిసినట్లు తెలుస్తోంది.
అందులో భాగంగానే ఇప్పుడు కొత్త షెడ్యూల్ కి చిత్ర బృందం ప్రయాణం అవుతున్నట్లు సమాచారం. ఈ మేరకు ఒక పోస్టర్ కూడా సోషల్ మీడియాలో వైరల్ గా మారుతుంది . అందులో కారు దగ్గర చాలా స్టైలిష్ గా నిలబడి ఫోటోలకు ఫోజులు ఇచ్చారు ఎన్టీఆర్. అందులో భాగంగానే యూరోప్ లో హై యాక్షన్ సీక్వెన్స్ చిత్రీకరించడానికి చిత్ర బృందం సిద్ధమైనట్లు సమాచారం. యూరోప్లో జరిగే ఈ సీన్ సినిమాకి హైలైట్ గా నిలవబోతున్నట్లు తెలుస్తోంది. మొత్తానికి అయితే త్వరలో కొత్త షెడ్యూల్ షూటింగ్ ప్రారంభం కాబోతోంది. కాబట్టి మరిన్ని అప్డేట్స్ కోసం అభిమానులు ఎదురుచూస్తున్నారు.
also read:Akshay Kumar: 100 కోడిగుడ్లతో కొట్టించుకున్న అక్షయ్ కుమార్.. షాక్ లో ఫ్యాన్స్!
ఇక ఈ డ్రాగన్ సినిమా విషయానికి వస్తే… ఎన్టీఆర్ హీరోగా, రుక్మిణి వసంత్ హీరోయిన్ గా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమాకి.. ఎన్టీఆర్ ఆర్ట్స్ , మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్లపై హరికృష్ణ కొసరాజు, నవీన్ ఎర్నే, రవిశంకర్ యలమంచిలి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. 2026 జూన్ 25న ప్రపంచవ్యాప్తంగా విడుదల కాబోతున్న ఈ సినిమాకి రవి బస్రూర్ సంగీతం అందిస్తున్నారు.