E-Paper
Advertisement

పాత గాయాలను రేపుతున్న సంజయ్ దత్! ‘ఆఖ్రీ సవాల్’ వెనుక అసలు కుట్ర ?

పాత గాయాలను రేపుతున్న సంజయ్ దత్! ‘ఆఖ్రీ సవాల్’ వెనుక అసలు కుట్ర ?

Aakhri Sawaal: ‘ఆఖ్రీ సవాల్’… బాబ్రీ మసీదు కూల్చివేత, ఆర్‌ఎస్‌ఎస్ నిషేధం వంటి కాంట్రవర్సీ కంటెంట్ తో మరోసారి మంటలు పెట్టె పనిలో పడింది బాలీవుడ్. దేశంలో ఎప్పుడు ఎక్కడ ఏ చిన్న గొడవ జరిగినా సెన్సిటివ్ అయిపోయే ఇలాంటి అంశాలని మళ్ళీ సిల్వర్ స్క్రీన్ పైకి తీసుకొచ్చి రచ్చ లేపుతున్నారు. సంజయ్ దత్ మెయిన్ లీడ్ గా చేస్తున్న ఈ సినిమాని స్వయంగా ఆయనే నిర్మించడం గమనార్హం.ఇక తాజాగా వచ్చిన ఈ ‘ఆఖ్రీ సవాల్’ టీజరే ఇప్పడు సోషల్ మీడియాలో ఒక రేంజ్‌లో ట్రోలింగ్‌కు గురవుతోంది. సెన్సేషన్ సబ్జెక్ట్ అనే పేరుతో అసలైన సమస్యల్ని పక్కన పడేసేలా పాత గొడవలను మళ్ళీ తవ్వి తీసేలా చేస్తున్న ఈ సినిమా వెనుక ఉన్న అసలు ఉద్దేశం ఏంటని కాస్త గట్టిగానే క్వశ్చన్ చేస్తున్నారు నెటిజన్లు.

గాంధీ హత్య తర్వాత 1948లో RSSపై వేసిన బ్యాన్

టీజర్ చూస్తె సంజయ్ దత్ స్వయంగా నిర్మిస్తున్న ఈ చిత్రంలో ఆయన ప్రొఫెసర్ గోపాల్ నాదకర్ణిగా పాత్రలో కనిపించబోతున్నట్టు అర్థమైతుంది.అయితే టీజర్ చూస్తుంటే ఇది కేవలం సినిమా లా కాకుండా ఒక వర్గాన్ని టార్గెట్ చేస్తూనో లేక ఒక వర్గానికి వత్తాసు పలుకుతూనో తీసిన పొలిటికల్ డ్రామాలా అనిపిస్తోందన్నది నెట్టింట్లో వినిపిస్తున్న కామెంట్స్.ఇక ఈ టీజర్ లో 1992లో దేశాన్ని కుదిపేసిన బాబ్రీ ఘటనను మళ్ళీ చూపించడం చూస్తుంటే, మళ్ళీ ఆనాటి ఉద్రిక్తతలను గుర్తు చేయడమేనా అన్న డౌట్స్ వస్తున్నాయ్.ఇక గాంధీ హత్య తర్వాత 1948లో RSSపై వేసిన బ్యాన్, ఆ సంస్థపై వచ్చిన అలిగేషన్స్ ని ఇందులో ప్రముఖంగా ప్రస్తావించడం ఈ సమయంలో అవసరమా?అన్న టాక్ వినిపిస్తుంది.

also read:‘డ్రగ్’ వార్‌…..టాలీవుడ్ vs పొలిటీషియన్స్

ఫోకస్  బాబ్రీ మసీదు కూల్చివేత, ఆర్‌ఎస్‌ఎస్ నిషేధం పైనే

ఇక నేషనల్ అవార్డీ అయిన అభిజీత్ మోహన్ వారంగ్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో సమీరా రెడ్డి, అమిత్ సాధ్ లాంటి వాళ్లు ఉన్నా.. అందరి ఫోకస్ మాత్రం బాబ్రీ మసీదు కూల్చివేత, ఆర్‌ఎస్‌ఎస్ నిషేధం వంటి వాటిపైనే ఉంది.కుమార్ విశ్వాస్ లాంటి కవులు సాహిత్యం అందించడం విశేషమే అయినా, సినిమా కంటెంట్ మాత్రం ‘ప్రొవొకేటివ్’గా (రెచ్చగొట్టేలా) ఉందనే టాక్ వినిపిస్తోంది. ఇక మిథున్ చక్రవర్తి కొడుకు నమాశి చక్రవర్తి ఈ పీహెచ్‌డీ స్టూడెంట్ పాత్రలో ఏం నిజాన్ని వెలికి తీస్తాడో కానీ, ప్రస్తుతానికైతే టీజర్ సోషల్ మీడియాలో మంటల్ని పుట్టిస్తుంది.

ఇంతకు మించిన కథలు దొరక లేదా?

ఇక “సినిమాలు తీయడానికి ఇంతకు మించిన కథలు దొరక లేదా? మళ్ళీ ఈ మతపరమైన, రాజకీయ వివాదాలు ఎందుకు?” అని కొందరు మండిపడుతుంటే.. “సంజయ్ దత్ తన ఇమేజ్‌ను మార్చుకోవడానికి ఇలాంటి కాంట్రవర్సీ టాపిక్ ని తలకెత్తుకున్నాడు అని మరికొందరు సెటైర్లు వేస్తున్నారు.ఇక మే 08న రిలీజ్ కానున్న ఈ సినిమాకు సెన్సార్ బోర్డు నుంచి గ్రీన్ సిగ్నల్ రావడం అంత ఈజీ కాదని ఇండస్ట్రీ వర్గాల మాట.

మరి ‘ఆఖ్రీ సవాల్’ అనేది నిజంగానే ఆఖరి ప్రశ్నగా మిగిలిపోతుందా లేక సరికొత్త కాంట్రవర్సీ లకి తెరలేపుతుందా చూడాలి. బాబ్రీ, RSS లాంటి సెన్సిటివ్ ఇష్యూ ని కమర్షియల్ లాభాల కోసం వాడుకోవడం ఎంతవరకు కరెక్ట్ అన్నదే అందరి ముందున్న పెద్ద క్వశ్చన్ మార్క్ !

also read:టాలీవుడ్‌లో బిగ్ ట్విస్ట్…అద్దెల్లేవు.. ఇక అంతా వాటాలే!

Related News

మెగాస్టార్‌ను మించిపోయిన రామ్ చరణ్.. అంతగా ‘పెద్ది’తో ఏం చేశాడంటే?

‘పెద్ది’ ఎంట్రీ చూసి ఉపాసన ఏం చేసిందో తెలిస్తే షాక్ అవుతారు.. అయితే సినిమా..

యూట్యూబర్ ‘నందూస్ వరల్డ్’ దంపతులపై చీటింగ్ కేసు.. యూకే ఉద్యోగాల పేరిట భారీ వసూళ్లు

అభిమానిపై ‘రాకింగ్ స్టార్’ రియల్ ప్రేమా.. క్యాన్సర్ బాధితుడికి వీడియో కాల్ చేసిన యష్!

పెద్ది’ మూవీ రివ్యూ: రామ్ చరణ్ ఊరమాస్ జాతర.. బుచ్చిబాబు హిట్ కొట్టాడా?

పెద్ది ఓటీటీ లాక్….అప్పుడే డిజిటల్ స్ట్రీమింగ్ పై క్లారిటీ వచ్చేసిందిగా!

ప్రభాస్ ‘స్పిరిట్’ లొకేషన్ సెల్ఫీ లీక్.. లుక్ చూస్తే పూనకాలే!

బన్నీ-లోకేష్ కనగారాజ్ సినిమా క్యాన్సిల్ అయిందా? …. అసలు నిజం తెలిస్తే షాకవ్వాల్సిందే!

Big Stories

×