BigTV English
Advertisement

SSMB29 Firts Look: ఓర్నీ రాజమౌళి మళ్లీ కాపీ కొట్టాడు కదా… ఏకంగా పవన్‌ కళ్యాణ్‌నే టచ్ చేశాడు

SSMB29 Firts Look: ఓర్నీ రాజమౌళి మళ్లీ కాపీ కొట్టాడు కదా… ఏకంగా పవన్‌ కళ్యాణ్‌నే టచ్ చేశాడు

Trolls On SSMB29 Firts Look: దర్శక ధీరుడు రాజమౌళి, సూపర్ మహేష్ బాబు కాంబినేషన్ లో ఓ భారీ ప్రాజెక్ట్ రూపొందుతోన్న సంగతి తెలిసిందే. ఎస్ఎస్ఎంబీ29(SSMB29 First Look) అనే వర్కింగ్ టైటిల్ తో ఈ సినిమా తెరకెక్కతోంది. పాన్ వరల్డ్ ఈ సినిమా జక్కన్న అత్యంత భారీ బడ్జెట్ తో తెరకెక్కిస్తున్నారు. అయితే ఇప్పటి వరకు ఈ ప్రాజెక్ట్ ఎలాంటి ఆఫిషియల్ అప్డేట్ లేదు.కానీ, కేవలం ప్రకటనతో ఈ సినిమాపై ఓ రేంజ్ లో బజ్ క్రియేట్ చేసింది. ఇక రూమర్స్, టాక్ తో ఫుల్ బజ్ నెలకొంది. ఈ మూవీ విషయంలో జక్కన్న మొదటి నుంచి గొప్యత పాటిస్తున్నారు. జస్ట్ సినిమాపై ఆఫిషియల్ అనౌన్స్ మెంట్ మాత్రమే ఇచ్చారు. ఆ తర్వాత పూజ కార్యక్రమం, షూటింగ్ అన్ని కూడా రహస్యంగా కానిచ్చేస్తున్నాడు.


బజ్ పెంచిన ఫస్ట్ లుక్

కానీ, ఎస్ఎస్ఎంబీ నుంచి ఇప్పటి వరకు ఎలాంటి అప్డేట్ లేదు. ఇక మహేష్ బాబు బర్త్ డే సందర్భంగా ఫస్ట్ లుక్ లేదా టైటిల్ వదులుతారని అభిమానులంత ఎంతో ఆశపడ్డారు. కానీ, వారికి నిరాశ ఎదురైంది. ఇప్పుడే కాదు ఎస్ఎస్ఎంబీ అప్డేట్ కావాలంటే ఇంకా వెయిట్ చేయాలంటూ రాజమౌళి ఓ పోస్ట్ వదిలారు. మహేష్ ఫ్యాన్స్, పాన్ ఇండియా మూవీ లవర్స్ అందరికి రాజమౌళి క్షమాపలు చెబుతూ.. ఎస్ఎస్ఎంబీ సర్పైజ్ కి ఇంకా టైం రాలేదు. నవంబర్ వరకు ఆగండి అంటూ ఓ పోస్టర్ రిలీజ్ చేశారు. ఇందులో మహేష్ లుక్ కనిపించకుండా.. ఛాతి భాగాన్ని మాత్రం చూపించారు. పైగా డీప్ వీ నెక్ తో ఉన్న షర్ట్ ధరించి ఉన్న మహేష్ మెడలో ఉన్న దండ అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. నల్ల పూసలతో ఉన్న మాలకు నంది, డమరుకం, త్రిశూలం, ఆపై శివుడి నామాలతో ఉన్న లాకెట్ ఆసక్తిని పెంచుతోంది. ఇందులో మహేష్ లుక్ కనిపించడకపోవడం అభిమానులంత అసహనం వ్యక్తం చేస్తున్నారు.


మళ్లీ దొరికిపోయిన జక్కన్న

కనీసం టైటిల్ అయిన చెప్పండి సార్ అంటూ రిక్వెస్ట్ చేస్తున్నారు. అసలు ఇప్పటి వరకు ఒక్క అప్డేట్ లేదు.. కనీసం బర్త్ డే జక్కన ఇద్దైనా ఇచ్చారంటూ మూవీ లవర్స్ ఖుషి అవుతున్నారు. అయితే ఇప్పుడీ లుక్ పోస్టర్ నెట్టింట మరో చర్చకు దారి తీసింది. ఈ లుక్ రాజమౌళి కాపీ కొట్టారని కొందరు అంటున్నారు. అంతేకాదు ఇదిగో ప్రూఫ్ అంటూ పవన్ కళ్యాన్ పోస్టర్ ఒక్కటి షేర్ చేస్తున్నారు. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన బ్రో మూవీలోని ఓ లుక్ ని షేర్ చేస్తూ.. ఎస్ఎస్ఎంబీ29లో ఇది కాపీ కొట్టారంటూ ట్రోల్ చేస్తున్నారు. బ్రో మూవీలోని ఓ సీన్ లో పవన్ ధరించిన షర్ట్.. ఎస్ఎస్ఎంబీ29లోని మహేష్ ధరించిన షర్ట్ అచ్చం ఒకేలా ఉన్నాయి. ఒకే డిజైన్, ఒకే కలర్.. క్లాత్ కూడా ఒకేలా కనిపిస్తోంది. మెడ కింది భాగం వరకు ఉన్న ఈ పొస్టర్ ని.. పవన్ తల భాగానికి జత చేసి అచ్చం ఒకేలా ఉందని, ఇది బ్రో మూవీ నుంచి కాపీ కొట్టారంటూ యాంటి ఫ్యాన్స్ జక్కన్న ను టార్గెట్ చేస్తున్నారు.

పవన్ సినిమా నుంచి లేపేశారా?

అంతేగాదు గతంలోనూ బాహుబలి మూవీలోని ఓ సీన్ కూడా కాపీ కొట్టారంటూ గుర్తు చేస్తున్నారు. ఈ రెండు కూడా ఫస్ట్ లుక్ పోస్టర్స్ కావడం గమనార్హం. కాగా బాహుబలిలోని చాలా సీన్స్ ఇతర భాషల్లోని వివిధ సినిమాలను రాజమౌళి కాపీ కొట్టారంటూ అప్పట్లో తెగ వార్తలు వచ్చాయి. అంతేకాదు ఆయా చిత్రాల పోస్టర్స, బాహుబలి చిత్రంలోని లుక్స్ షేర్ చేస్తూ తెగ ట్రోల్ చేశారు. ముఖ్యంగా బాహుబలి ఫస్ట్ లుక్ పోస్టర్ నే కాపీ కొట్టారు. అదే నదిలో శివగామి.. అమరేంద్ర బాహుబలిని చేయి పైకి ఎత్తి పట్టుకున్న సీన్. అచ్చం అలాంటి సీన్ హాలీవుడ్ చిత్రం ‘సిమోన్ బ్రిచ్’ నుంచి కాపీ కొట్టారు. 1997లో వచ్చిన ఈ సినిమా పోస్టర్.. 2015లో బాహుబలిలో అచ్చం చూపించారు. అప్పుడు కూడా ఈ కాపీ సీన్ ఫస్ట్ లుక్ పోస్టర్ గా విడుదల చేశారు. ఇప్పుడు బ్రో సినిమాలోని పవన్ లుక్ ని కాపీ కొట్టి.. ఎస్ఎస్ఎంబీ29 ఫస్ట్ లుక్ గా రిలీజ్ చేశారంటూ యాంటి ఫ్యాన్స్ విమర్శలు గుప్పిస్తున్నారు. ప్రస్తుతం ఎస్ఎస్ఎంబీ29 ఫస్ట్ లుక్ చూసి ఫ్యాన్స్ ఖుషి అవుతుంటే.. ఇది కాపీ అంటూ యాంటి ఫ్యాన్స్ ట్రోల్ చేస్తున్నారు. దీనిపై ఫ్యాన్స్ నుంచి రకరకాల అభిప్రాయాలు వస్తున్నాయి. జక్కన్న కాపీ కొట్టిన అందులో ఏదోక స్పెషాలిటీ ఉంటుందని, ఇందులో హీరో మెడలోని లాకెట్ అంటూ అభిమానులు కామెంట్స్ చేస్తున్నారు.

Related News

Janhvi Kapoor : ఇది నా అదృష్టం, జాన్వి పాపా పెద్ది కన్సర్ట్ లో ఎంత ముద్దుగా మాట్లాడిందో

Ram Charan: నా కల నిజం అయిపోయింది, కన్సర్ట్ లో రామ్ చరణ్ అదిరిపోయే ఎంట్రీ

SSMB29 : మొత్తానికి మహేష్ బాబు అప్డేట్ ఇచ్చాడు, గ్లోబ్ ట్రోటర్ ఈవెంట్ పై మహేష్ రియాక్షన్.

Gouri G Kishan : నాకు మారి సెల్వరాజ్ సార్ ఫోన్ చేశారు, ఇష్యూ గురించి ఏం చెప్పారంటే?

The Great Pre wedding show: ది గ్రేట్ ప్రీ వెడ్డింగ్ షో సినిమాపై బెల్లంకొండ రియాక్షన్, మొదటి సెలబ్రిటీ సపోర్ట్

Shraddha Das: అల్లు అర్జున్ టాలీవుడ్ షారుక్.. నా ప్రపంచమే మారిపోయిందన్న నటి!

Actor Vikranth: అమెరికాలో సాఫ్ట్వేర్ కంపెనీ..700 మంది ఎంప్లాయిస్.. ఈ హీరో బ్యాక్ గ్రౌండ్ మామూలుగా లేదే!

Ajay Bhupathi : ఘట్టమనేని వారసుడు సినిమా టైటిల్ ఇదే, ఆ సెంటిమెంట్ వదలని అజయ్ భూపతి

Big Stories

×