Jr NTR : తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో ప్రస్తుతం ఉన్న స్టార్ హీరోస్ లో జూనియర్ ఎన్టీఆర్ ఒకరు. బాల నటుడిగా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన తారక్ తనకంటూ అద్భుతమైన ఫ్యాన్ బేస్ క్రియేట్ చేసుకున్నాడు. రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన త్రిబుల్ ఆర్ సినిమాతో పాన్ ఇండియా రేంజ్ లో గుర్తింపు లభించింది. ఇప్పుడు ఎన్టీఆర్ సినిమా రిలీజ్ అవుతుందంటే ఒక రకమైన పండగ వాతావరణం ఉంటుంది.
ఎన్టీఆర్ ప్రస్తుతం ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో డ్రాగన్ అనే సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా కోసం ఎన్టీఆర్ విపరీతంగా బరువు తగ్గారు. చాలామందికి ఇప్పుడు ఎన్టీఆర్ ను చూస్తే ఆశ్చర్యం కలుగుతుంది. ప్రస్తుతం అందుతున్న సమాచారం ప్రకారం.. సినీ హీరో జూనియర్ ఎన్టీఆర్ గాయపడినట్లు తెలుస్తుంది. హైదరాబాద్ లో జరిగిన ఓ యాడ్ షూటింగ్లో తారక్ స్వల్పంగా గాయపడ్డట్లు ఆయన టీమ్ తెలిపింది. షూటింగ్ జరుగుతుండగా చేయి గీరుకుంది, ఫస్ట్ ఎయిడ్ చేసిన వెంటనే మళ్ళీ కొంతసేపటి తర్వాత తారక్ షూటింగ్ లో పాల్గొన్నారు. దీనిని బట్టి కూడా తారక్ డెడికేషన్ అర్థం అవుతుంది. ఇకపోతే దీనిపై మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
Also Read: Kalki 2: దీపిక ఇష్యూకు కోటిన్నరపైగా వ్యూస్… ఇప్పుడైనా అర్హత తెచ్చుకుంటుందా ?