Film industry: సాధారణంగా సినిమా షూటింగ్ సెట్లో ప్రమాదాలు చోటు చేసుకోవడం సహజమే.. అయితే ఆ ప్రమాదాలు ఒక్కొక్కసారి విషాదంగా మారుతూ ఉంటాయి. ఈ క్రమంలోనే తాజాగా కోలీవుడ్ స్టార్ హీరో ఆర్య (Arya ) నటిస్తున్న ఒక సినిమా షూటింగ్ సెట్లో ఘోర విషాదం చోటు చేసుకుంది. స్టంట్ మ్యాన్ ఏకంగా ప్రాణాలు కోల్పోయారు అసలు ఏం జరిగిందో ఇప్పుడు చూద్దాం.
ఆర్య మూవీ సెట్ లో స్టంట్ మ్యాన్ మృతి..
అసలు విషయంలోకి వెళ్తే.. ప్రముఖ హీరో ఆర్య , డైరెక్టర్ పా. రంజిత్ (Pa.Ranjith) కాంబినేషన్లో సినిమా రాబోతోంది. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. అయితే ఈ సినిమా షూటింగ్ సెట్లో ప్రమాదం జరిగింది అని ప్రముఖ కోలీవుడ్ హీరో విశాల్ (Vishal).తెలిపారు. కారుతో స్టంట్స్ చేస్తుండగా.. ప్రమాదవశాత్తు స్టంట్ మ్యాన్ రాజు(Raju ) ఆదివారం ఉదయం మృతి చెందినట్లు విశాల్ తెలిపారు. ఇకపోతే విశాల్ పోస్ట్ తోనే ఈ దుర్ఘటన గురించి అందరికీ తెలిసింది. రాజు మృతి పట్ల పలువురు సంతాపం వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా రాజు కుటుంబానికి అండగా ఉంటానని.. విశాల్ హామీ ఇచ్చారు. ప్రస్తుతం ఈ విషయం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
స్టంట్ మ్యాన్ రాజు..
స్టంట్ మ్యాన్ రాజు విషయానికి వస్తే .. ఈయన సాహసోపేతమైన స్టంటులతో కోలీవుడ్ పరిశ్రమలో మంచి పేరు సొంతం చేసుకున్నారు. తన కెరియర్లో ఎన్నో ఏళ్లుగా కోలీవుడ్లో అనేక చిత్రాలకు పనిచేశారు. ధైర్యవంతుడిగా నైపుణ్యం కలిగిన స్టంట్ ఆర్టిస్ట్ గా కూడా పేరు సొంతం చేసుకున్నారు. ఇలాంటి ఒక గొప్ప ఆర్టిస్ట్ ఇప్పుడు తుది శ్వాస విడవడం నిజంగా బాధాకరమని చెప్పాలి. ఈయన కుటుంబానికి చిత్ర బృందం ఏ విధంగా సహాయ పడుతుందో చూడాలి.
ఆర్య – పా. రంజిత్ కాంబోలో మూవీ..
ప్రముఖ కోలీవుడ్ స్టార్ హీరో ఆర్య, డైరెక్టర్ పా.రంజిత్ దర్శకత్వంలో ‘సార్పట్టా పరంబరై’ అనే సినిమా 2021లో వచ్చింది. ఈ సినిమా బాక్సింగ్ నేపథ్యంలో పీరియాడిక్ యాక్షన్ డ్రామాగా కరోనా సమయంలో ఓటీటీలో రిలీజ్ చేశారు. ఇప్పుడు ఈ సినిమాకి సీక్వెల్ కూడా రాబోతోంది. ‘సార్పట్టా: రౌండ్ 2’ పేరుతో రానుందని సమాచారం. అట్టడుగు వర్గాల ప్రజల జీవితాలను అప్పటి రాజకీయ పరిస్థితులను తెలియజేస్తూ ఈ సినిమాను తెరకెక్కించారు. అటు తమిళంలో మంచి విజయం సాధించిన ఈ సినిమా తెలుగులో కూడా మంచి ఆదరణ అందుకుంది. ఇప్పుడు వీరిద్దరి కాంబినేషన్లో రాబోతున్న ఈ సీక్వెల్ మూవీ కూడా అంతే విజయాన్ని సొంతం చేసుకుంటుందని అభిమానులు ఆశాబావం వ్యక్తం చేస్తున్నారు. ఈ సినిమా వచ్చే ఏడాది విడుదల కానుంది అని మేకర్స్ ప్రకటించిన విషయం తెలిసిందే.
So difficult to digest the fact that stunt artist Raju passed away while doin a car toppling sequence for jammy @arya_offl and @beemji Ranjith’s film this morning. Hav known Raju for so many years and he has performed so many risky stunts in my films time and time again as he is…
— Vishal (@VishalKOfficial) July 13, 2025