OTT Movie : రీసెంట్ గా ఓటిటీలో రిలీజ్ అయిన ఒక స్టైలిష్, రెట్రో-ఇన్స్పైర్డ్ కామెడీ మూవీ ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. ఆర్. మాధవన్, ఫాతిమా సనా షేక్ నటన, అందమైన విజువల్స్, ఆకర్షణీయమైన సంగీతం ఈ సినిమాకి హైలెట్ గా నిలిచాయి. ఈ సినిమాలో 42 ఏళ్ల వ్యక్తి కి పెళ్లికాకపోవడంతో, ఒక యాప్ లో అమ్మాయిలతో మాట్లాడుతూ ఒంటరితనాన్ని పోగొట్టుకోవడానికి ప్రయత్నిస్తాడు. ఆ తరువాత స్టోరీ ఆసక్తికరంగా నడుస్తుంది. ఈ సినిమా పేరు ఏమిటి ? ఎందులో స్ట్రీమింగ్ అవుతుంది ? అనే వివరాల్లోకి వెళితే.
నెట్‌ఫ్లిక్స్ (Netflix) లో
ఈ సినిమా పేరు ‘ఆప్ జైసా కోయి’ (Aap jaisa koyi). 2025 లో వచ్చిన ఈ సినిమాకి వివేక్ సోని దర్శకత్వం వహించారు. కరణ్ జోహార్ ధర్మాటిక్ ఎంటర్టైన్మెంట్ బ్యానర్‌లో దీనిని నిర్మించారు. ఇందులో ఆర్. మాధవన్, ఫాతిమా సనా, అయేషా రజా, మనీష్ చౌదరి, నమిత్ దాస్, శ్రీయం భగ్నానీ, శహెబ్ చటర్జీ వంటి నటులు నటించారు. ఈ కథ జంషెడ్‌పూర్, కోల్‌కతా నగరాల మధ్య జరుగుతుంది. ఈ సినిమా నెట్‌ఫ్లిక్స్ (Netflix) లో స్ట్రీమింగ్ అవుతోంది.
స్టోరీలోకి వెళితే
జంషెడ్‌పూర్‌లో 42 ఏళ్ల శ్రీరేణు త్రిపాఠి (ఆర్. మాధవన్) ఒక సంస్కృత ఉపాధ్యాయుడు. ఇంత వయసు వచ్చినా, ఇంకా పెళ్లి కాని వ్యక్తి. శ్రీరేణు, తన సోదరుడు భాను త్రిపాఠి, వదిన కుసుమ్, సోదరి నిషా, అంకుల్ ప్రమోద్ అతని భార్య ప్రమీలతో కలిసి ఒక సంప్రదాయ హిందూ కుటుంబంలో జీవిస్తుంటాడు. అతను పెళ్లి కోసం సరైన సంబంధం కోసం ప్రయత్నిస్తుంటాడు. కానీ అతని వయస్సు, సంప్రదాయవాద వైఖరి పెళ్ళికి అడ్డంకిగా మారతాయి. అతని వదిన కుసుమ్, అతనికి సంబంధం కుదర్చడానికి గట్టిగా ప్రయత్నిస్తుంది. కానీ శ్రీరేణుకి ఏదీ సెట్ కాకుండా పోతుంది. ఈ క్రమంలో శ్రీరేణు తన ఒంటరితనంతో పోరాడుతూ “ఆప్ జైసా కోయి” అనే యాప్‌ను ఉపయోగిస్తాడు. ఇందులో అమ్మాయిలతో మాట్లాడుతూ, తనఒంటరితనాన్ని పోగొట్టడానికి ప్రయత్నిస్తుంటాడు.
ఈ సమయంలో కోల్‌కతాకు చెందిన 32 ఏళ్ల మధు బోస్ అనే ఒక ఫ్రెంచ్ ఉపాధ్యాయురాలు శ్రీరేణు జీవితంలోకి ప్రవేశిస్తుంది. శ్రీరేణు, మధు ఒక అరేంజ్డ్ మ్యారేజ్ సెట్టింగ్‌లో కలుసుకుంటారు. వారి వ్యక్తిత్వాలు భిన్నంగా ఉన్నప్పటికీ, వారి మధ్య ఒక ఫీలింగ్ మొదలవుతుంది. శ్రీరేణు మొదట తన అదృష్టాన్ని నమ్మలేకపోతాడు. కానీ మధు అతన్ని పూర్తిగా అంగీకరిస్తుంది. ఇది అతనికి ఒక కొత్త ఆత్మవిశ్వాసాన్ని ఇస్తుంది. ఇక శ్రీరేణు, మధుకి నిశ్చితార్థం కూడా ఖరారవుతుంది. ఈ సమయంలో శ్రీరేణుకి ఒక షాకింగ్ విషయం తెలుస్తుంది. నిశ్చితార్థం రోజున, మధు కూడా “ఆప్ జైసా కోయి” చాట్ యాప్‌ను గతంలో ఉపయోగించిన విషయం శ్రీరేణు తెలుసుకుంటాడు.
ఇది అతని సంప్రదాయవాద ఆలోచనలకు షాక్ ఇస్తుంది. ఈ విషయం అతని అహాన్ని కూడా దెబ్బతీస్తుంది. ఈ సంఘటన వారి సంబంధంలో ఒక పెద్ద సమస్యగా మారుతుంది. శ్రీరేణు కుటుంబం, ముఖ్యంగా అతని సోదరుడు భాను, సంప్రదాయవాద ఆలోచనలతో మధు వైఖరిని వ్యతిరేకిస్తాడు. చివరికి శ్రీరేణు, మధు పెళ్ళి జరుగుతుందా ? ఈ సమస్య ఎలా సర్దుకుంటుంది ? ఇంతకీ ఆ యాప్ లో ఎలాంటి సంభాషణలు జరుగుతాయి ? అనే విషయాలను తెలుసుకోవాలనుకుంటే, ఈ సినిమాను మిస్ కాకుండా చుడండి.
Read Also : బిజినెస్ మీటింగ్ లో పెళ్ళైన వ్యాపారవేత్త రాసలీలలు… క్లైమాక్స్ లో దిమ్మతిరిగే ట్విస్ట్